Next Page 
ఒక తీయని మాట పేజి 1

 

                                                   ఒక తీయని మాట


                                              - వసుంధర

                          


   

 

    ఇంట్లో నిర్మల ఒక్కతేవుంది.
    పద్దెనిమిదేళ్ళ ప్రాయపు నిర్మల యింట్లో ఒంటరిగా వుంది.
    నిర్మల తండ్రి రామారావు, సవతి తల్లి  మాణిక్యాంబ, సవతితమ్ముడు రఘు, సవతి చెల్లెలువల్లి- అంతకలసి  మ్యాట్ని సినిమాకువెళ్ళారు. వాళ్ళంతా వెళ్ళిపోయి తనోక్కతేనూ ఇంట్లో  వదిలినందుకు నిర్మల  రవ్వంతకూడా బాధపడలేదు. బాధపడాలంటే ఆమెకింట్లో ఇంకాబలమైన కారణాలున్నాయి. కానీనిర్మల  బాధపడకపోవడానికి కారణానికి బలంచాలకపోవడం కారణంకాదు.
    వాళ్ళంతా తనొక్కతెనూ ఒంటరిగావదలి ఎప్పుడుబయటకు వేడతారా అని ఆమె ఎదురుచూస్తోంది.
    ఇప్పడందరూ భోంచేసి వెళ్ళారు. నిర్మల అంట్లుతోమాలి. బట్టలుతాకాలి. సినిమాకు వెళ్ళినవారు తిరిగివచ్చేసరికి వారికి టిపిను రెడిచేయాలి.
    అయినప్పటికీ నిర్మల రవంత కంగారుకూడా  లేకుండా ముందుగా  స్నానంచేసింది. ఇంటిపనులన్నీ అయ్యాక తనుమళ్ళిస్నానం  చేయాల్సిఉంటుందని ఆమెకు తెలుసు. అయినా ఆమె ముందుగా స్నానం  చేసింది.
    స్నానంచేశాక దైర్యంగా  తనతండ్రి బెడ్రూంలో అడుగు పెట్టింది. నిలువటద్దంముందునిలబడి తన్నుతాను చూసుకుంది.
    తడివంటినీ అలా చూసుకోవాలన్నది ఆమెకోరిక.
    నిర్మలవళ్ళు మేలిమిబంగారు చాయలో ఉంటుంది. అవయవాలు పొందికగా ఉంటాయి. అప్పడే స్నానంచేసివచ్చిన ఆమె శరీరంపై అక్కడక్కడా నీటి బిందువులు అప్పడామే ముత్యాలు పొదిగిన బంగారు నాగాలా వుంది.
    నిర్మల  తన అందాన్ని చూసుకుని  తనే మురిసిపోయింది.
    "నేను నిజంగా రాజకుమార్తేలా  వుంటాను-" అనుకుందామే.
    నిర్మల టర్కిష్ తువ్వాలుతో శుభ్రంగా వళ్ళుతుడుచుకుంది. తర్వాత వణుకుతున్న చేతులతో బిరువాతాళాలు తీసింది. బీరువాతెరిచింది.
    అది ఆమెకు కావలసినది.....
    తనక్కావలసినది మరి అంత  దగ్గరగా కనపడడం తనకోరిక తిరుసమయం మరి దగ్గరలోకి రావడం -నిర్మలకు తను కలగాని కనడంలేదుగదా అని అనుమానం వచ్చింది. ఒకసారి తన్ను తాను  గిచ్చుకుంది.
    అది కళ కాదు.
    నిర్మల సమయం  వృధా చేయలేదు క్షణాలమీద బట్టలు వేసుకుంది. ముదురునీలంరంగు పువ్వుల పరికిణి-దానిపై ఆకాశం రంగు వోణి- అదే రంగు జాకెట్...నిర్మల  త్వరత్వరగా అద్దం  ముందుకువెళ్ళి నిలబడింది.
    ఇప్పడామెకు ప్రపంచాన్ని జయించినంత సంతోంషంగా వుంది.
    ఆ పరికిణి నిర్మలకెంతో  యిష్టం అది వేసుకోవాలని ఆమెకు మనసు. గడిచిన శ్రావణ శుక్రవారానికి వల్లికోసం ఆపరికిణి కుట్టించింది మాణిక్యాంబ నిర్మలకేమి కుట్టించలేదు నిర్మల  అందుకేమీ అనుకోలేదు.
    ముందుగా  వల్లికి బట్టలు కుట్టించాక- వల్లికి మోజుతిరాక ఆ పాత బట్టలు నిర్మల ధరించాలి. ఆ పాతబట్టల్లో కూడా నిర్మలకు నచ్చినవివ్వడం జరుగదు. నిర్మల కళ్ళలోని మెరుపు మాణిక్యాంబ అర్ధం చేసుకోగలదు. ఆ మెరుపుకు  అర్ధం చదివి- ఆమె యిష్టానికి వ్యతిరేకమ్తెనవె యిస్తుంది మాణిక్యాంబ.
    నీలం రంగు పువ్వుల పరికిణి నిర్మలకు నచ్చిన విషయం మాణిక్యాంబ కనిపెట్టేసింది. ఆమె వల్లితో పొరపాటున కూడా నిర్మలకివ్వద్దని చెప్పింది. వల్లిని తరచుగా  అదే కట్టుకోమనేది. వల్లి ఆ పరికిణి కట్టుకుని తిరుగుతూంటే-" జాగ్రత్తగావాడుతల్లి! చిరుగుపట్టకుండానే ఇది  స్టిలుసామాను వాడికిస్తాను. మంచి గిన్నె వస్తుంది-" అంటూండేది.
    అంటే ఆ పరికిణి నిర్మలకు దక్కదని అర్ధం నిర్మల ఆ హెచ్చరికను అర్ధం చేసుకుంది అలాంటి హేచ్చరికలామెకు కొత్తకాదు.
    నిర్మలను పురిట్లోనే  కని చనిపోయింది తల్లి. ఏడాది తిరక్కూండా మళ్ళి పెళ్ళి చేసుకున్నాడు తండ్రి కొత్త పెళ్ళికూతురు మాణిక్యాంబకు సవతి తల్లి  అన్న బిరుదు నిర్మల కారణంగానే వచ్చింది.
    రామారావు అన్నివిధాలా మాణిక్యాంబకు నచ్చాడు. అతడుతన భర్త కావడం అదృష్టంగా భావించేదామే. అయితే  తనది  ద్వితీయవివాహమని అతడికి మరోస్త్రీ కొంతకాలం భార్యగా వ్యవహరించిందని గుర్తుచేయడంకోసమే నిర్మల అయింటిలో ఉన్నదని  మాణిక్యాంబకు అనిపించేది.
    వివాహమైన తొలిఘడియల్లోనే రామారావు నిర్మలను మాణిక్యాంబ చేతుల్లో పెట్టి- "దీనికోసమే  నేనివివాహం చేసుకున్నాను. ఈబిడ్డను తల్లిలేని లోటు తెలియకుండా పెంచాలి" అన్నాడు.
    మాణిక్యాంబ తలవూపింది. బలవంతంగా తనచేత ప్రేమించబడాలనుకుంటున్న ఆ పసికందుపై అప్పటిలోనే ఆమెకు ద్వేషం  పేరుకుంది. కానీ ఇంట్లో తనస్దానం బలపడేవరకూ ఆమె తన అసలు రంగుబయత పెట్టలేదు.
    వివాహమైన ఏడాదికే మనిక్యమాంబ వల్లిపుట్ట్టింది. ఆ తర్వాత  రెండేళ్ళకు రఘు పుట్టాడు, అప్పడమే ఆపరేషన్  చేయించుకుంది. ఆ ఆపరేషన్లోనే నిర్మపట్ల ఏ మాత్రం ప్రేమఉన్న అదిపోయింది.
    నిర్మలది స్వతహాగా మెత్తటి స్వభావం. ఆ యింటిలో ఆమె సమాన హక్కులకోసం పోరాడలేదు. పెద్దలు చెప్పినమాటలు బుద్దిగావినేది. ఏపని చెప్పినా విసుక్కోకుండా ఓపికగాచేది. ఎన్ని తిట్టినా  మూలకుపోయి గ్రుడ్ల నీరు కుక్కుకోవడం తప్పు పల్లెత్తుమాటని ఎదిరించడమామెకు చేతకాదు.
    పన్నెండేళ్ళు వచ్చేవరకూ నిర్మల స్కూలుకువెళ్ళి చదువుకుంది. పెద్దమనిషన ఆడపిల్లను స్కూలుకు పంపించడం తప్పనిచెప్పి- చదువు మనిపించేసింది మాణిక్యాంబ అయినాప్రయివేటుగాకట్టి ఇంటర్మీడియాట్ ప్యాసయింది నిర్మల ఆమెకు తెలివి , శ్రద్ధ, పట్టుదల, ఓర్పుఉన్నాయి.
    వల్లిమాత్రం స్కూలుకెవెళ్ళి చదువుకుంటోంది. పెద్దమనిషి సిద్దాంతం ఆమెకు వర్తించలేదు టెన్తుక్లాసు రెండుసార్లు పెయిలయ్యింది వల్లి. మూడో పారి ఎలాగో ప్యాసయింది. ఇప్పడామే     ఇంటర్మిడియట్  మొదటిసంవత్సరం చదువుతోంది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS