Next Page 
హనీమూన్ పేజి 1



                                                             హానీమూన్

                                                                                     -యర్రంశెట్టి శాయి

                                                  

   
    నేనూ సారధి డార్జిలింగ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందు క్కారణం ఉంది. ఈ కరువుగొట్టు రోజుల్లో ఏ కారణమూలేకుండా - డార్జిలింగ్ లాంటి  హిల్ స్టేషన్  కేళ్ళాలనుకోవడానికి మేమేం  లక్షాదికారులంకాదు. మావూలు మిడిల్ క్లాస్ పక్షులం.

    మేమిద్దరం  చిన్నప్పటినుంచి కలసి చదువుకున్నాం. కలిసే ఇంటర్లో తప్పం! కలిసి మళ్ళి పూర్తి చేశాం. అనుకోకుండా ఇద్దరికీ ఒకే వూళ్ళో ఉద్యోగాలు కూడా వచ్చియ్. ఇద్దరికీ కొద్దిరోజులు తేడాలో పెళ్ళిళ్లయినాయ్.

    మన దేశంలో సగటు మొగాడు పెళ్ళాన్ని వరాలు కోరుకోమని అడిగేద్ది పెళ్ళయిన మొదటిరోజే కదా! ఆ తరువాత  వరాలు కోరాలనే కోరిక ఆవిడకూ, కోరుకోమని అడిగే ద్తేర్యం మొగాడికి గారంటిగా ఉండవ్. మేమిద్దరం కూడా మ పెళ్ళినాటి రాత్రి  భార్యలతో హనీమూన్ వెడదామని ప్రామిస్ చేశాము. అక్కడితో ఆగినా బాగిండేది.

    "హనీమూన్ ఎక్కడికి?" అని వాళ్ళు అనుమానంగా అడిగినప్పుడు అద్దరం కూడా న్యూస్ పేపర్లో అంతకుముందే వేస్త బెంగాల్ రాష్ట టూరిజం  శాఖవారి "డార్జిలింగ్  సందర్శించండి! అద్భుతమయిన అనుభూతిని పొందండి" అనే ప్రకతాన్ చూసి ఉండటంవాళ్ళ-డార్జిలింగ్ కి తీసుకు వెళ్తామని కమిట్ అయిపోయాము.      

    నిజానికి ఆ ప్రామిస్ లూ , ఆకమిట మెంట్ లూ ఇంకోకరయితే గుర్తుంచుకోరుగాని మా భార్యామణులు మాత్ర్హం ఆ విషయం అలాగే గుర్తుంచుకుని,విలు దొరికినప్పదల్లా సాధించడం గోణగడం ప్రారంభించారు. ముందూ వెనుకలు  ఆలోచించకుండా  అలా పెళ్లాలకు  వరాలిచ్చేయడం  ఎంత తప్పో ,తీరా కమిట్  అయిపోయాక గాని మాకు తెలిసిచావలేదు. ఇక చేసేదిలేక మాకున్న సంపదలన్నిటిని సమీకరించి  డార్జిలింగ్  వెళ్ళడానికి నిశ్చయించుకున్నం. ఇద్దరినీ పక్క పక్క ఇల్లె కాబట్టి ఒ ఆదివారం నాడు ప్రయాణం తాలూకు చర్చలకు మా ఇంటి  వసారాలో సమావేశామయము.

    "ముందస్తుగా మనం అసలి ప్రయాణం తలపెట్టడం మన ఆరోగ్యానికి మంచి కాదా అనే విషయం పరిశీలిద్దాం!" అన్నాడు సారధి.


    "పోనీ ఈ విషయమంతా చూడ్డానికి ఒ కమిటి వేయండి! గోంగూర ఫలానా సంవత్సరం ఎందుకు పండలేదు అన్న విష్యం తెలుసుకోడానిక్కూడా కమిటీలు  వేస్తున్నారు కదా ఈ రోజుల్లో" అంది మా ఆవిడ లోపల్నుంచి.

    సంసారంలోకి రాజకీయాలు చొప్పించడం దానికి బాగా అలవాటు. వాళ్ళనన్య రెండుసార్లు మునిసిపల్  కౌన్సిలర్ గా పోటిచేసి ఓడిపోవటం వల్ల- వాళ్ళ కుటుంబం  మొత్తానికి రాజకీయాలు బాగా తెలుసని  దాని నమ్మకం.

    "అసలు డార్జిలింగ్  వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో ముందు  లెక్కలు వేద్దాం!" అన్నాడు సారధి.

    "అవును! అదే కరెక్ట్ ప్రొసీజర్ !" అన్నాన్నేను.

    "మీ ఫామిలికి, మా ఫామిలికి కలిసి టికెట్లు "అన్నాడు వాడు.

    "అంటే-ఎంతవుతుంది?"

    వాడు ఆలోచనలో పడ్డాడు. గడపదగ్గరే నిలబడ్డ వాళ్ళావిడ ఫక్కున నవ్వింది.

    "ఆ మాత్రం తెలిదా? ఒకరి కెంతవుద్దో దానిని  నాలుగు పెట్టి హెచ్చవేస్తే సరి" అంది తానో పెద్ద లెక్కల ప్రొపెసర్ లాగా (వాళ్ళ నాన్న  లెక్కల టిచర్ అవడం  చేత ఆమె కూడా లెక్కల టిచర్ లా బి బిహెచ్ చేస్తూంటుంది అప్పడప్పడు)

    "అవును! అల చేస్తే  ఈజీగా తెలిసిపోతుంది" అంటూ కాగితం తీసుకున్నాడు వాడు. తీరా లెక్క వేయబోయే సరికి అసలు ఒకటికే ఎంత చార్జి అవుతుందో తెలిలేదు. "ముందు ఒకరికి చార్జి ఎంత  వుందో  ఎలా తెలుసుకోవటం?" బాలలవిడని అడిగాడు వాడు.

    "అది కూడా  తెలిదా? నలుగురికి ఎంత వుందో, దానిని నాలుగు పెట్టి డివ్తేడ్ చేస్తే వస్తుంది" అందామె.

    "ఎడ్చనట్లుంది. ఇంత నువ్వు లోపలికెళ్ళు" అన్నాడు  సారధి కోపంగా.

    "ఆ మాటమీదే ఉండండి- కాఫిలని, 'టి'లని మరోసారి పిలిచారంటే చూడండి-ఏం జరుగుతుందో" అనేసి కోపంగా లోపలి కెళ్ళిపోయిందామే.

    "చార్జ్  ఎంతో తెలుసుకోవాలంటే - బెస్ట్ దింగేమిటంటే- ర్తేల్వే 'ఎంక్వయిరీస్ ' కి ఫోన్ చేసి తెలుసుకోవటం" అన్నాన్నేను.

    కాని మరి ఫోన్ మా ఇద్దరీళ్ళల్లోనూ లేదు. మా ఎదురింటి ప్లీడర్  గారికి ఉంది. కాని-అది కొంచెం  రిస్క్  వ్యవహారం. ఆయన దగ్గరకు మనం వెళ్ళేమాట అటుంచి ఆయన రోడ్డుమీద వస్తుంటే-పరిచయస్తులూ, స్నేహితులూ చెల్లా చేడురాయి సమీపంలో  ఉన్న సందుల్లోకి గాని,  ఇళ్ళల్లోకి గాని పారిపోవటం మా వూళ్ళో కనిపించే అద్భుత ప్రకృతి దృశ్యాలలో ఒకటి. బ్రహ్మదేవుడు ఒ జలగని సృష్టించాలని ముచ్చతపడి- ఇంచు మించుగా ఆ కాస్యక్రమం  పూర్తిచేసి, ప్రాణం పోయిబ్ప్యే సమయంలో- హఠాత్తుగా మనసు  మార్చుకుని దాన్ని మనిషిగా మార్చాడని, ఆ మనిషే  ప్లీడర్ గారని ఆయన విష్యం తెలిసిన వారందరికి నమ్మకం. మూడు రకాల న్యూస్  పేపర్లు కొని వాటిల్లో వార్తలను పోల్చిచూస్తూ, కనబడ్డ ప్రతివారికి చదివి  వినిపిస్తూ, వాటికి తన వ్యాఖ్యలను జోడిస్తూ- వీరవిహారం చేయడం  ఆయన హాబీ! అయితే తమాషా ఏమిటంటే  ఈ విషయం ఊరందరికి తెలిసిన ఎవరో ఒకరు రోజూ  ఆయనక్లు దారుణంగా  బలయిపోతూనే ఉంటారు. ఆ రోజు మా వంతు వచ్చ్సింది కనుక చేసేదేమీలేదని ఊహించుకుని మేము ఆయనింటికి  వెళ్ళాము. మమ్మల్ని చూడగానే చేతిలోని తెలుగు  పేపరు ఆనందంగా మడిచేశాడతను. 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS