Next Page 
ఆఖరి మలుపు పేజి 1


                                           ఆఖరి మలుపు

                                                                                మైనంపాటి భాస్కర్

 

                                       


                                                              ప్రొలాగ్


    అద్భుతమే జరిగింది ఆ రోజు!


    ఇండియాకి సంబంధించినంత వరకూ అయితే అది నిజంగా పరమాద్భుతమే!


    ఒలింపిక్స్ గేమ్స్ లో ఒక ఇండియన్ మూడు గోల్డ్ మెడల్స్ సాధించాడు!!


    కల కాదు! నిజమే!


    వందమంది స్పోర్ట్స్ మెన్ తో ఉన్న టీమ్ వెళ్ళినా ఒక్క వెండి పతకం కూడా సాధించే సత్తా లేని దేశాల్లో ఇండియా మొదటిది!


    అలాంటిది, ఒక్క ఇండియన్ స్పోర్ట్స్ మెన్ మూడు బంగారు పతకాలు కొట్టెయ్యడం....


    ఫాంటాబ్యూలస్ ఫీట్!


    అక్కడున్న అందరిలో అదే ఆలోచన!


    ప్రేక్షకులకి, విలేఖరులకి, అధికారులకి, అనధికారులకీ ఇంటర్నేషనల్ టీవీ క్రూలకీ....


    అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రాజా మాత్రం అనవసరమైన ఫస్ చెయ్యకుండా చిరునవ్వు నవ్వుతూ నిలబడి వున్నాడు.


    నిజమే! అతను మూడు గోల్డ్ మెడల్స్ గెలిచినవాడు.


    పిస్టల్ షూటింగ్.


    పోల్ వాల్ట్.


    ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్....


    అతన్ని చూసి విదేశీ విలేఖరులంతా ఎగ్జయిట్ అయిపోతున్నారు.


    కానీ ఇండియన్స్ లో మాత్రమే నెగెటివ్ రియాక్షన్స్ కనబడుతున్నాయి. కుల మత భేదాలూ, ప్రాంతీయ భేదాలూ, భాషోన్మాదం ఇవన్నీ మనసులని మసిబారిపోయేటట్లు చేస్తూ వుండగా, రాజా సహచరులంతా పైకి నవ్వుతూ, లోపల్లోపల ఏడుస్తూ వున్నారు.


    తనవాళ్ళ సైకాలజీ తెలుసు రాజాకి. అతను అవేం పెద్దగా పట్టించుకోలేదు. కానీ మనసులో ఏమూలో సన్నటి సెగలాంటి బాధ.


    ఈ ఫీలింగ్స్ అన్నీ వదిలించుకుని వీళ్ళు బాగుపడేది ఎప్పుడు?


    అతనలా అనుకుంటూ ఉండగానే -


    హఠాత్తుగా రంగప్రవేశం చేశాడు ఒక వీరాభిమాని!


    అతను ఇండియన్ అయి ఉండవచ్చు.


    లేదా, పాకిస్తానీ అయి ఉండవచ్చు.


    బంగ్లాదేశ్ గానీ, నేపాలీ గానీ.... ఎవరైనా అయి ఉండవచ్చు.


    పోలికలని బట్టి ఫలానా అని వెంటనే చెప్పలేకపోయినా, మొత్తానికి అతను భారత ఉపఖండం నుంచి వచ్చిన మనిషే అని మాత్రం సులభంగా తెలిసిపోతూనే వుంది.


    ఆ అభిమాని మొహం వెయ్యి వాట్ల బల్బులాగా వెలిగిపోతోంది. సంతోషాన్ని దాచుకోలేకపోతున్నాడు అతను.


    రాజా చేతులు రెండూ పట్టుకుని, అవి ఊడిపోతాయేమో అన్నంత బలంగా ఊపెయ్యటం మొదలెట్టాడు.


    నవ్వుతూ సహనంగా చూస్తున్నాడు రాజా.


    వెల్! వెల్! వెల్!


    సాటి ప్లేయర్స్ కి సంతోషం లేకపోవచ్చు!


    కానీ సాటి మనిషి ఒకడు ఇంతగా సంతోషం ప్రకటిస్తున్నాడు. ఇతనిలాంటి వాళ్ళు లక్షల్లో వుంటారు.


    తన అభిమానులు!


    తనకేం తక్కువ?


    ఆ వీరాభిమాని హిందీ, ఉర్దూ కలిసిన హిందుస్తానీలో అంటున్నాడు.


    "రాజా భయ్యా! నీ విజయం అంటే నా విజయమే అనుకో! నీ ఈ ఫీట్ చూడాలనే నేను ఢిల్లీ నుంచి వచ్చాను."


    "నడిచి వచ్చావా?" అన్నాడు రాజా.


    సంతోషంగా అన్నాడు వీరాభిమాని -


    "అవును రాజా భయ్యా! మా హీరో మూడు మెడల్స్ గెలుచుకోబోతుంటే ఈ అభిమాని ఆ మాత్రం ఫీట్ చెయ్యలేడా?"


    అతను ఇంకా రాజా చేతులు గబగబ ఊపేస్తూనే వున్నాడు.


    నవ్వుతూ అడిగాడు రాజా -


    "ఏమిటి నీ పేరు?"


    "భగవాన్!" అన్నాడతను రాజా చేతులు ఊపుతూనే.


    అప్పుడు-


Next Page 

  • WRITERS
    PUBLICATIONS