TeluguOne - Grandhalayam | Online Book Store | Novel Reading | Telugu Novels | Telugu Kathalu | Famous Telugu Writers | Chandu Sombabu | Yandamuri Veerendranath | Merlapaka Murali | Vasireddy Seeta Devi | Samaram Novels
అధికారి

                           అధికారి
   
                                             ___ చందు హర్షవర్దన్
                                          
                                         

 

            
    
    ఆదివారం.....
    
    సమయం రాత్రి 7గంటలు......
    
    విజయవాడ మహానగరం నడి బొడ్డున వున్న ఇందిరా గాంధీ స్టేడియంలో జనం కిటకిటలాతున్నారు,. ఏదన్నా ఇంటర్ నేషనల్ క్రికెట్, వాలీబాల్, కబాడీలాంటి టోర్నమెంట్స్ జరిగినప్పుడు మాత్రం రద్దీగా  ఉండే స్టేడియం ఇవాళ అలాంటి పోటీలేమి లేకుండానే రద్దీగా ఉంది.
    
    స్టేడియం చుట్టూ అతిధులకు స్వాగతం తెలిపే క్లాత్ బేనర్స్ సర్విబాదులకు బిగదీసికట్టారు.
    
    స్టేడియం  ఎంట్రన్స్ లో ఇరవై అడుగుల ఎత్తుగల స్వాగతద్వారాన్ని ఏర్పాటుచేశారు.
    
     బాక్సాఫీసు రికార్డులను బ్రద్దలుకొట్టిన సినిమా నూరు రోజుల పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫంక్షన్ అది.
    
    ముఖ్యఅతిధిగా  ఆంధ్రప్రదేశ్ గవర్నరు, గౌరవ అతిధిగా అంధ్రప్రదేశ్ ముఖ్యమ౦త్రి  హాజరు కానున్నారు. సినిమాటోగ్రాఫిక్ మంత్రి, సినీప్రముఖలు, సీనిదర్శకులు, టేక్నీషినన్స్ , ప్రాత్రికేయులు, అనధికారులు, అనధికారులు అభిమానుల అనంద హొళలతో ఆ ప్రాంగణం  అంతా కళకళాలాడుతొంది.
    
    ముఖ్య అతిధులు ఇద్దరూ 'జడ్' క్యాటగిరీ రిస్కులో వుండడం మూలంగా మామూలు పోలీసు బందోబస్తుకన్నా భారీ ఎత్తున సేక్యూరీటి  ఏర్పాటు చేశారు. నగర పోలీసు కమిషనర్ శ్రీ హర్ష ప్రత్యక్షంగా తనే ఆ ఏర్పాటులన్నీ దగ్గరుండి చూస్తున్నాడు. అతనికి సహాయంగా డి. సి.పి, ఎ.సి.పి లతో పాటు మిగతా అర్భన్ పోలీసు సిబ్బందే కాకుండా, ప్రక్కజిల్లాల నుంచి రప్పించిన డి.ఏస్.పి.లు. ఇన్స్ స్పెక్టర్ లు, సబ ఇన్స్ స్పెక్టర్ లు , వందల సంఖ్యలో కానిస్టేబుల్ బందోబస్తులో వున్నారు.  కీలకమైన ప్రదేశాలలో బందోబస్తును చాలా పకడ్భందీగా ఏర్పాటు చేశాడాయాన. అసలు అయన స్టయిలే వేరు.   
    
    ముఖ్య అధితులు మరి కొద్ది నిముషాలలో వస్తున్నట్టు ఆర్గనైజర్లు మైకులో అనౌన్స్ చేయడంలో స్టేడియంలో అక్కడక్కడ గుంపులు, గు౦పులుగా వున్న జనం అంతా ముంచుకు వచ్చారు. అప్పటికే వేసిన కుర్చీలన్నీ నిండిపోయాయి సీట్లు లేనివాళ్ళు నుంచునే ఆ కర్యక్రామాన్ని చూడాలని తహతహా లాడుతున్నారు.
    
    సరిగ్గా 7 గంటల 5 నిమిషాలకు వి.ఐ .పి క్వానయ్ స్టేడియంలోకి  ప్రవేశించింది. రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి  కారు దిగి స్టేడియంలోకి అడుగు పెట్టారు. ఒక్కసారిగా స్టేడియం అంతా కరతాళ ధ్వనులు మిన్నముట్టాయి.
    
    జనం ఆనందానికి కారణం కేవలం ముఖ్య అతిధుల  ఆగమనమే కాదు. సరిగ్గా అదే సమయానికి సి.ఏం. గవర్నరుతోపాటు వేదికవైపుకు కదిలి వస్తున్న హిట్ చిత్రాల  దర్శకులు నారాయణ, ఆ చిత్ర హీరో 'అధికారి' రాకను వాళ్ళు గమనించారు.
    
    సభాస్థలినుంచి సభాసామ్రేట్ , దశ సహస్ర కేసరి వాగ్దాటిరావు అతిధులందర్నీ పేరు పేరున సభా మండపానికి ఆహ్వానించారు.
    
    "ఈ నాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి శతకోటి వందనాలు, సాధారణంగా ఏ చిత్రం అయినా వందనాలు సాధారణంగా ఏ చిత్రం అయినా వంద రోజులు ఆడితే ఆడితే శతదినోత్సవం జరుపుకోవడం విశేషమే! కాని ఈ రోజు జరుపుకుంటున్న శతదినోత్సవానికి ఓ ప్రత్యేకత వుంది.......
    
    చలన చిత్ర రంగానికి ఒక్క ఊపుపూపిన చిత్రం 'అధికారి' ఇందులో అందరూ కొత్త వాళ్ళు నటి౦చడం ఒక విశేషం.  ఆ చలనచిత్ర దర్శకులు నారాయణగారు  కూడా ఈ చిత్రంలో నటిచడం మరో విశేషం! ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్దులలో ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగాను, ఉత్తమ దర్శకులుగాను, ఉత్తమ హీరోగాను అవార్డులు రావడం మనందరికి గర్వకారణం అయితే, జాతీయ స్థాయిలో ఈ చిత్రం రెండు అవార్డులను గెలుచుకుంది. అవి ఉత్తమ దర్శకుడి అవార్డు, ఉత్తమ హీరో అవార్డు.......
    
    అంతేకాదు తెలుగు చలనచిత్ర చరిత్రలో గర్వంగా చెప్పుగోదగ్గ  మరో విశేషం ఈ చిత్రం ఆస్కార్ అవార్డును నామినేట్ అయింది. తప్పకుండా  మరిన్ని అవార్డులు రావాలని మనందరం  ఆశిద్దాం......
    
     అటువంటి విషయ, విశేషణాలుగల ఈ చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను మరోసారి ముఖ్యఅతిధుల సమయంలో మనందరం చూసి అశిద్దాం.
    
    అంతే జనంలో అనంద కేరింతలు టెంపరెరీగా  ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ స్క్రీన్ పై చిత్ర ప్రదర్శన మొదలయింది.
    
                                                                            1
    
    సమయం, ఉదయం ఆరుగంటలు.
    
    స్థలం__ హైదరాబాదు మహానగరంలో బంజారాహిల్స్ లోని ఫిలీమ్ నగర్ .
    
    డైరెక్టర్ కపూర్ గారిఅధునాతన బంగ్లా మాందు యూనిఫాం వేసిన వాచ్ మెన్ పహరాకాస్తున్నాడు.
    
    సరిగ్గా అదే సమయానికి భుజాన సంచి వ్రేళ్ళాడేసుకుని ఓ వ్యక్తి గేటు ముందు ఆగాడు.
    
    "కపూర్ సాబ్ ఉన్నారా?" అడిగాడు.
    
    "ఆఫ్ కౌన్ హై? క్యా కామ్ హై?'
    
    "సాబ్ సీ మిల్నాహై"
    
    "అచ్చా దస్ బజేకో అవో"
    
    "లేదు నేను కపూర్ సాబ్ ను ఇప్పుడే కలవాలి. చాలా దూరం నుంచి వచ్చాను."
    
    అరె జావో..... జావో.... చెబుతుంటే నీక్కాదు........ జావో..... జావో...... దస్ బజేకో అజానా."    


Related Novels