Next Page 

విరాజి పేజి 1

                                                       

                                                                      విరాజి

                                                                                           __  కొమ్మూరి వేణుగోపాలరావు

 

                                      అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది.

    సందు మొదట్లో వున్న టీ కట్టేస్తున్నారు. అంతవరకూ గదిలో కూర్చుని పెన్నూ, కాగితాలలో యుద్ధంచేసి అలసిపోయి, కాస్త మార్పుకోసం బయటకువచ్చిన గౌతమ్ అక్కడకుచేరి కొంచెం అనుమానిస్తూ, షాపు మూసేస్తున్నారేమిటి?" అనడిగాడు.

    టీ షాపు యజమాని అతనికి బాగా తెలుసు . గౌతమ్ ని చూసి నవ్వి _ ఈ మధ్య పోలీసులతో గొడవ ఎక్కువయిపోయింది సార్. పదకొండు దాటితే ఊరుకోవడంలేదు. ఇన్నేళ్ళబట్టి నా దగ్గర టీ తాగి తాగివున్నారు. కాబట్టి చూసీచూడకుండా వూరుకుంటున్నారు. ఇంకో పదినిముషాల్లో వ్యాన్ వొస్తుంది. తెరిచి వుండటం చూశారో వ్యాన్ ఎక్కించుకుని వెళ్ళిపోతారు. ఉండంటిసార్ కలిపిస్తాను." అని అక్కడున్న కుర్రాడిని పురమాయించి ఒక్క నిముషంలో టీ తయారుచేసి కప్పులో పోసి యిచ్చాడు.

    ఆ చుట్టూప్రక్కల సండులన్నింటికి వరదరాజిచ్చే మసాలా టీ అంటే చాలా ఫేమస్.

    గౌతమ్ టీ త్రాగుతూ _ ఈ కొత్తరూల్సోచ్చాక బేరాలు పడిపోలేదా?"అనడిగాడు.

    "ఎందుకు పడిపోలేదు సార్? రాత్రి పన్నెండూ _ రెండు గంటల మధ్య సెకండ్ షో సినిమాలు విడిచిపెట్టెవేళ ఆ టైముకు అయిదారు రైళ్ళు కూడా వస్తాయి. ఎంత చూసుకున్నా కనీసం మూడు నాలుగొందలు బేరం పోతుంది.

    "అయ్యా!" అన్నాడు గౌతమ్ .

    "మళ్ళీ ఏమయినా కథ రాస్తున్నారా సార్?"

    గౌతమ్ రాస్తున్నట్లు తల వూపాడు.

    "దేనిమీద సార్."

    "పుడుపు వృత్తిమీద _ కథకాదు నవల ."

    "రాయండి సార్, ఆ సబ్జెక్ట్ చాలాబావుంటుంది కాని చాలా నిజాయితీగా, కరెక్ట్ గా రాయాలిసార్, ఎందుకంటే యిదివరకు ఆ సబ్జెక్ట్ మీది వొచ్చిన రచనలు రచయితల ఊహాగానాలతో అసలున్న నిజంకన్న కల్పించిన రంగులతో అవాస్తవికంగా వున్నాయి. ఒక్కరికీ ఆ వృత్తిలో వున్న వారి జీవితాల గురించిన వాస్తావాలు తెలీదు."

    చాలా స్వచ్చంగా , స్పష్టంగా విజ్ఞతతో మాట్లాడుతున్నాడు వరద రాజు. గౌతమ్ అతనివంక ఆశ్చర్యంగా చూశాడు.

    "ఏమిటిసార్ అలా చూస్తున్నారు?"

    "నిన్ను చూస్తుంటే కేవలం ఓ టికొట్టు యజమానిలా కనిపించవు వరదరాజూ ఎంతో జీవితానుభావం వున్నట్లు మాట్లాడతావు."

    "చేసేవృత్తికి జీవితానుభావానికి సంబంధం లేదు సార్. సమయ మోచ్చినప్పుడు నా జీవితచరిత్ర ఎప్పుడయినా చెబుతాను. నవలగా రాద్దురు గాని అన్నట్లు రచయితా శారద పేరు ఎప్పుడన్నా విన్నారా సార్"

    "విన్నాను. అయన రచనలు చదివాను కూడా."

    "తెనాలిలో ఓ హొటల్ లో సర్వర్ గా పనిచేసేవాడు సార్. అసలు పేరు నటరాజన్ . శారద అన్న కలంపేరుతో రాసేవాడు. జీవితచక్రంలో నలిగిపోయినవాడు కావడంచేత అతని రచనలన్నీ జీవితంలోకి దూసుకువచ్చినట్లుంది ఒక్కోసారి కాఫీకి కూడా డబ్బులేక నానా బాధా పడుతుండేవాడు."

    గౌతమ్ మనసు చివుకుమన్నట్టుగా తలూపి ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు.

    "పడుపు వృత్తిలాంటి సబ్జెక్ట్స్ మీద రాయాలంటే వాళ్ళమీద చాలా స్టడీ చెయ్యాలిసార్. ఆ వృత్తిలో ఉన్న ఇఅదారుగురుతో నయినా కనీసం ఇంటర్వ్యూ చెయ్యాలి."

    గౌతమ్ ఏమి జవాబివ్వలేదు.

    "అసలు ఎవర్నయినా కలుసుకున్నారా?"

    "ఎవర్నయినా అంటే ?"

    ఆ వృత్తిలో వున్నవారిని.

    గౌతమ్ కాళ్ళలో చిన్న వొణుకు బయల్దేరింది. అసలతనికి అడ పిల్లలంటేనే భయం. అందులో ఆ వృత్తిలో వున్నవాళ్ళని .....

    "లేదు ....."

    "కలుసుకోండి సార్. కలుసుకుంటే మీ ఊహకు కూడ అందనంత సత్యాలు వెల్లడవుతాయి."

    దూరంగా ఎక్కడో వ్యాన్ వస్తున్న చప్పుడయింది. గౌతమ్ తల వూపి జేబులోంచి అర్ధరూపాయి తీసి కౌంటర్ మీద పేట్టి "వొస్తాను" అని అక్కడ్నుంచి బయల్దేరాడు.

    గాడికి వెళ్ళబుద్ధి కాలేదు. కొంతదూరం అలా తిరిగోద్దామని బయల్దేరాడు.

    మొదట్నుంనుంచీ అతను  వొంటరి. వొంటరిగా కూర్చుని అలోచించడంలో, తెలుగు ఇంగ్లీషు నవలలు ముందేసుకుని చదువుకుంటూ ఉండడంలో పేజీలకు పేజీలు రాసుకుంటూ వుండటంలో పొందే ఆనందం, ఆనందనుభూతి నలుగురిలో వుమ్దతంతావు కలిగేదికాదు. చిన్నతనంలో తానున్న చోటుకు యిద్దరు ముగ్గురు మూగితే దూరంగా తొలగిపోయేవాడు.

    అర్దరాత్రి అవడంవల్ల జనసంచారం బొత్తిగాలేదు. అప్పుడో మనిషి అప్పుడో మనషి మధ్య మధ్య ఓ రిక్షా త్రాసపడుతున్నాయి. మనసంతా అతను రాస్తున్న నవల మీద నిమగ్నమై వుంది. ఎంత దూర మొచ్చిందో తెలియలేదు.

    "బాబు గారూ!" ఓ సన్నని కంఠము నిలబడి ఉలికిపాటుతో అదిరిపోయాడు.

    సందు మొదట్లో ఓ స్రీ ఆకారం నిలబడి వుంది. స్ట్రీట్ లైటు చాలా దూరంగా వుండటంవల్ల మోహం కనబడటంలేదు. పైగా మేలి ముసుగు మోహం మీదకు లాక్కునివుంది.

    ఎందుకో కాళ్ళు వణికాయి. ఆగిపోయి "నన్నేనా?" అని అడిగాడు. తడబడే కంఠముతో.

    ఆమె తళుక్కుమని నవ్వింది. అట్లా నవ్వేతప్పుడు మోహం కాస్త ప్రక్కకు కదలడంలో తలలోని వువ్వులుకూడా తళతళలాడాయి.

    "మహాతెలీనట్లు అంత తెలీకుండానే యిటుకేసి వొంటరిగా వచ్చారా?"

    "నిజంగా నాకు ....."

    "అమ్మో! గడుసువారే" అంటూ ఆమె చొరవగా ఒక అడుగుముందుకువేసి చొరవగా అతని చెయ్యి పట్టుకులాగింది. రండి యిల్లు యిక్కడే ఎంతో దూరం లేదు"

    అతనికి ముచ్చెమటలు పోశాయి. అతని చెయ్యి చల్లదనం చూసి ఆమె మళ్ళీ నవ్వింది. 'పాపం అనుభావం లేదు కాబోలు' అనుకుంటూ.

    ఒక్కక్షణం సందిగ్డావస్థ.

    వరదరాజు మాటలు గుర్తు వస్తున్నాయి. ఈ వృత్తి గురించి రాసేటప్పుడు చాలా తెలిసివుండాలి. జీవతానుభవం వుండాలి.

    ఆమెతోకూడా వెళ్ళి ఇంటర్వ్యూ చెయ్యాలన్న ఆలోచనకు బలము చేకూర్చుకున్నాడు.

    "అదికాదు .... అన్నాడు తడబడే కంఠంతో. అతని చెయ్యి యింకా ఆమె చేతిలోనే వుంది.

    "ఏది కాదు?" ఆమె మళ్ళీ గల గల నవ్వింది.

    "నీతో ...."

    "భలేవారే చెప్పండి"

    "కొంచెం మాట్లాడాలి"

    "కొంచెం ఏమిటి బోలెడు మాట్లాడండి.

    "అదికాదు నీ గురించి, నీ వృత్తిగురించి, నీ జీవితచరిత్ర గురించి."

    ఉన్నట్లుండి ఆమెలో మార్పు వచ్చింది. అతని చెయ్యి విదిలించునట్లు విసిరికొట్టింది.

Next Page