TeluguOne - Grandhalayam
kommanapalli ganapathi rao

   
    కన్నారావు కింత కాలం ఇంటర్వ్యూల్లో కంగారుతో తెలిసినవే చెప్పలేకపోడం మాత్రమే తెలుసు గాని, ఇలా పెళ్లిచూపులూ ఇంటర్వ్యూ తరహాలో జరుగుతాయని , ఇక్కడా అక్కడిలాగే వెధవ మొహం వేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయనీ ఇప్పుడే భోధపడింది.


    "సారీ నాన్నా!" లేచింది కిన్నెర. "వీళ్ళను పంపేయండి."


    గోపలారావు దంపతులు నిశ్చేష్టులై చూస్తుండగానే ఠీవిగా వెళ్ళిపోయింది కిన్నెర.


    "మీ అబ్బాయి మాకు నచ్చలేదని చెప్పటానికి మా రిగ్రాట్స్...." మంగ ఇక్కడా ఇంగ్లీషులో చెబుతుంటే మూతి పళ్ళు రాలగొట్టాలన్న ఆవేశం వచ్చింది కన్నారావుకు, కాని నిగ్రహించుకున్నాడు.


    కారణం బ్రిటిష్ వాళ్ళతో సంబంధ భాంధవ్యాలు కలవాళ్ళు అంటే ఇప్పటికి తుపాకులూ గట్రా వాళ్ళ దగ్గర ఉంటాయన్న విషయం అర్ధమైఉక్రోషంగా వెళ్ళిపోయారు.


    వీర్రాజు మీసాలు మెలేస్తున్నాడు. వాళ్ళు చూడాలనే కాని లోన ఎక్కడో చిన్న అందోళన, కారణం , ఇప్పుడు జరిగిన పెళ్ళి చూపుల తంతు నూట ఒకటోది.

 


                                                                        *    *    *    *


    ఆ రాత్రి.......


    అరెకరం నేలపై కట్టిన తాతల నాటి లోగిలి డాబా మీద ఫారెన్ లిక్కర్ సేవిస్తున్న వీర్రాజు చీకటిలో సరాసరి తన వేపే వస్తున్న ఓ భారీ ఆకారాన్ని చూసి అణువంత కంగారు పడినా, రాజసం తగ్గని కంఠంతో ....."ఎవరది?" అన్నాడు చిన్న సైజు అరుపులా.


    "నేనే వీర్రాజుగారూ , రాయుడ్ని."


    వస్తూనే వినయంగా చేతులు జోడించి భుజానికున్న చిన్న సంచిని నేలపై ఉంచుతూ వీర్రాజుకు అభిముఖంగా ఉన్న బెత్తం కుర్చీలో కూర్చున్నాడు రాయుడు.


    సుమారు నలభై సంత్సరాల వయసులో ఎప్పుడూ చిదానందంగా మోహంలో ప్రసన్నతను వర్షింప చేసే రాయుడు మాత్రమే వీర్రాజు ముందు అలా చనువుగా కుర్చోగలిగేది ఆ గ్రామంలో ఎన్ని గడపలున్నా, ఎంత మంది జనాభా వున్నా, వీర్రాజు మనసుకు దగ్గరైన మనిషిగా చాలా ప్రశస్తి గల రాయుడు ఇలాంటి సమయాల్లో వీర్రాజును ఒదార్చగలగడమే కాదు, రాజధాని విషయాల్ని చిటికలో సేకరించగలడు. కోర్టులో నడిచే కేసుల గురించి, అద్భుతమైన సలహాలివ్వడం మాత్రమే కాక , ఆ చుట్టూ పక్కల గ్రామాల్లో జరుగుతున్నా విశేషాల్ని సేకరించడము, అవసరమైన వ్యక్తులకు చేరవేసి చాలాచాలా ఉపకరించగలడు కూడా.


    "మనసేం బాగున్నట్టు లేదు" అక్కడికి వీర్రాజు మనసు గురించి ఆలోచించటమే తన ఏకైక కర్తవ్యం అన్నట్టుగా ఓ పెగ్గు గ్లాసులో పోసుకున్నాడు.


    "సహజమే" అన్నాడు మొదటసిప్పు రుచి చూస్తూ.."అందులోనూ కూతురంటే అంత ప్రేమ వున్న ఏ తండ్రయినా ఈ స్థితిలో ఇలాగే ఆలోచిస్తుంటాడు."

 

    "అప్పుడే నీకు తెలిసిపోయిందన్నమాట!"


    "ఎంత మాట!" ఈసారి నవ్వకుండా నిర్వేదాన్ని అభినయించాడు. "రష్యాలో గోర్భాచావ్ ను రాత్రికి దింపేస్తారని రెండు గంటలు ముందే ఉహించిన వాణ్ణి, దిగిపోయిన గోర్భచావ్ ను తిరిగి పిఠం ఎక్కించిన వైనాన్ని పేపర్లు చూడకముందే మీ చెవిని వేసిన వాణ్ణి, ఇక్కడ విఫలమైన నూట ఒకటో పెళ్ళి చూపుల తతంగం తెలుసుకోకుండా ఎలా వుండగలను? పైగా కిన్నేరంటే నా బిడ్డ లాంటిదేగా!"


    "బిడ్డలాంటిది కాబట్టే నీవరకు వచ్చిందంటావ్!" అణువంత ఉక్రోషాన్ని ప్రదర్శించారు వీర్రాజు.


    ఈ ప్రశ్న ఏ జవాబు నాశించి అడిగింది అర్ధం చేసుకోలేకపోయాడు రాయుడు. తూర్పున ఓ లోగిలిలో అధిపతి అయిన వీర్రాజు ఇప్పుడు అదే పల్లెలో మరో లోగిలిలో వుంటున్న ప్రత్యర్ధి గురించి పరోక్షంగా అడుగుతున్నాడు.

 

    "నువ్విలా అంటే, అలానా 'రాయుడు' అని మమ్మల్ని నమ్మమంటావ్!"


    "ఛఛఛ!" చిద్విలాసంగా నవ్వాడు రాయుడు. "మీరిలా అర్ధంతరంగా ప్రశ్నించకపోయినా నేను చెప్పే వాణ్ణీగా! అయినా ఇదేం నాకు నచ్చలేదు."


    "ఏది! విరావేశాన్ని ప్రదర్శించాడు వీర్రాజు.


    "ఈ సంబంధాన్ని కూడా మా అమ్మాయి తిప్పి కొట్టడమా?"


    "అవును" అంటే వీర్రాజు అమాంతం డాబా మీది నుంచి దిగువకు విసిరేయక పోయినా, తాగుతున్న లిక్కర్ ను
మొదటి పెగ్గు దగ్గరే ఆపించేసి బయటకు గెంటించేయగలడు. "అలా అని నేనంటానని మీరెలా అనుకున్నారు వీర్రాజుగారూ? అసలు అమ్మాయి స్టేటస్సేమిటి, ఎలాంటి చరిత్ర గల కుటుంబానికి చెందింది. ఆ విషయం నాకూ తెలిదు? ఆ కట్టుకునే వాడు ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలి కిన్నెర మనసును గెలవాలంటే అనే విషయాన్ని నే నార్ధం చేసుకోలేనా? ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రిటన్ కు చెందిన ప్రిన్స్ చార్లస్ లాంటివాడు కదండి కిన్నెర కావాలని కోరి రావాలసింది! కాని ఏది?" బాధగా ఆగేడు క్షణం. "అలనాటి నుండి మీ కుటుంబానికి బ్రిటన్ సంబంధ బాంధవ్యాలున్నా మన కిన్నెర ఎదిగేసరికి ప్రిన్స్ చార్లెస్ కు పెళ్ళయిపోయిందిగా!"


    ఇష్టమైన పద్దతిలో మాట్లాడి వీర్రాజును రంజింపచేయడంలో నిష్ణాతుడు రాయుడు."మీ తొందర కాని, నిర్ణయాలు నేలమీదకు వచ్చే దాకా అగోద్దటండి?'


    ఈ స్టేట్ మెంటేమిటో అర్ధం కాలేదు వీర్రాజుకు.


    "చూశారా? ఓ గొప్ప మేధావి అయ్యుండి, తరతరాల వంశ ప్రతిష్ట కలిగి వుండి, మీరి పాయింటును మరిచిపోయారు. అదేనండి.....మీ అమ్మాయి పెళ్ళి నిర్ణితమైంది స్వర్గంలోనే అయితే అసలు మీరెవరు లేదనటానికి?'


    అప్పటికి హాఫ్ బాటిల్ తాగిన వీర్రాజు నాకు తెలియకుండా నిర్ణయం జరగడం ఏమిటి చెప్మా అని క్రోధారులు నేత్రాలతో చూస్తుంటే చెప్పాడు రాయుడు.   

Related Novels