Next Page 

టు హెల్ విత్ లవ్ పేజి 1


                              టు హెల్ విత్ లవ్
    
                                                                                ---యర్రంశెట్టి సాయి


                                   
 

     గంగాభవాని గుండె ఝల్లుమంది.    
    "ఓరి దేవుడో....మళ్ళీ వచ్చాడు" అంటూ బయటకు పరుగెత్తింది.
    తులసి తృళ్ళితృళ్ళి నవ్వుతోంది.
    సురేష్ ఆమె నవ్వుని పట్టించుకోవటంలేదు. ఇంటర్నల్ వార్ చాలాసేపు కొనసాగింది. పూర్తిగా సంధి కుదిరాక అప్పుడు మాట్లాడాడు.
    "ఇప్పుడు చెప్తావా?" అడిగిందామె.
    "ఏదీ? మన సివిల్ వార్ గురించా? ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మొదటిరోజు మనం కలుసుకున్నంత బావుంది."
    "ఛ! నేనడిగేదదికాదు....."
    "మరి?"
    "నీ ముఖం ఎలా మారిపోయింది? ముఖ్యంగానీ ముక్కు, నొసలూ....."
    "దురాశ మొఖమునకు చేటు"
    "అంటే?"
    "ఏటు జెడ్ చెప్పనా"?
    "అవును. ఏ టు జెడ్....."
    "మొదటిరోజు ఏం జరిగిందంటే ముందు నువ్వే నన్ను వెనక్కుతోశావ్.....ఇలా! అప్పుడు నేను వెనక్కుపడుతూ నిన్ను కూడా లాక్కున్నాను.....ఇలా......"
    తులసి అతని చేతుల్నుంచి అతి కష్టం మీద వదిలించుకుని లేచి నిలబడింది.
    "నువ్వు రాక్షసుడివి"
    "అదేమిటి నువ్వేగా ఏ టు జెడ్ చెప్పమంది?"
    "ఏ అంటే నీ మొఖం మార్పిడి దగ్గర్నుంచీ"
    "ఎరక్కపోయి వెళ్ళాను ఇరుక్కు పోయాను. మాయజేసి ప్లాస్టిక్ సర్జరీ చేసేసరికి చాలామార్పు వచ్చేసింది" జరిగిందంతా చెప్పాడతను. కధ పూర్తయేసరికి తులసికి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
    "పిచ్చీ.....నన్ను పస్తులుంచాల్సి వస్తుందని ఇంత రిస్క్ తీసుకున్నావా?"
    "అందులో కూడా కొంచెం స్వార్ధం ఉందిలే"
    "ఏమిటిది?"
    "అదే.....బాగా డబ్బుంటే నువ్ కొంచెం మారతావ్ కదా! అప్పుడు కొత్త అమ్మాయి దొరికిన ఫీలింగ్ తో ఎంజాయ్ చేయవచ్చని"
    తులసికి నవ్వొచ్చేసింది.
    "నీకు ఈ జన్మలో సీరియస్ గా ఉండటం సాధ్యమవుతుందా?"
    "అదేమిటి ఆ 'ఆఖరి పోరాటం' లో రెండు నిముషాలు సీరియస్ గానే ఉంటాను కదా" అతని తలను హృదయానికి హత్తుకుందామె.
    "ఆ గాంగ్ వాళ్ళు మళ్ళీ నీజోలికిరారు కదా"
    "వస్తే వాళ్ళ రహస్యం బయట పెట్టేస్తానని భయపడతారు"    
    "ఇంకెవరిద్వారా నయినా ఎటాక్ చేయిస్తారేమో"
    ఆమె మెడమీదనాలుకతో స్పృశించాడతను.
    "అది సరేగాని నేను లేనప్పుడేం చేశావ్? తలగడదిండేనా?"
    ఆమె మళ్ళీ నవ్వేసింది.
    "దీపను పిలిపించుకున్నాను టీజింగ్ గా అంది."
    "నాకు మొదటినుంచీ అనుమానమే మీ ఇద్దరిమీదా"
    అతని బుగ్గ గట్టిగా గిల్లబోయింది.
    "గంగా తేరికాస్ హై మైలీ" గట్టిగా అరచాడతను.
    తలుపు బయట సర్రునపాకినట్లు కదిలినయ్ గంగాభవాని చీర కుచ్చెళ్ళు.
    "చూశావామనమాటలువింటోంది"
    "ఏమిటి? పిలిచారా?" అప్పుడే వచ్చినట్లు అడుగుతోందామె బయటినుంచి!
    తలుపు తెరిచాడతను.
    "అవును"
    "ఎందుకు?"
    "తులసి చూడండి! గిల్లుతోంది. ఇదిగో ఇక్కడ ఎలా కందిపోయిందో చూస్తారా?" ఆమె మొఖంలో కోపం, సిగ్గు ప్రవహించినవి.
    "ఛీపాడు! ఇలాంటివన్నీ బయటోళ్ళకు చెప్తారా?" అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది చిరాకుగా.
    "తల్చుకుంటే మీరూ లోపలికి వెళ్ళవచ్చు!"
    చివాలున వెనక్కు తిరిగిందామె.
    "అంటే?"
    "త్రిబుల్ కాట్ తెప్పిద్దాం"
    తులసి నేలమీద కూలబడిపోయినవ్వేయ సాగింది.
    తలుపుదభేలుమని మూసి వెళ్ళిపోయింది గంగాభవానీ.
    "అదిసరే గాని మనం అర్జంటుగా లేడీ డాక్టర్ దగ్గరకెళ్ళాలి" స్టౌ వెలిగిస్తూ అందామె.
    "ఎలాగోలా నీతో మానేజ్ చేసుకుంటానులే! ఇంకొకామె ఎందుకు?" ఆమె కోపంగా తలూపింది.
    "నాకోసం! నీకోసం కాదు!"
    "నువ్వు లేడీ డాక్టర్ నేం చేసుకుంటావ్? మేల్ డాక్టర్ ని చూసుకుంటే......"
    "ఎగ్జామిన్ చేయించుకోవాలి"
    "నేను చేస్తాగదా"
    "షటప్! సిగ్గు లేదూ అలామాట్లాడానికి."
    "సిగ్గుపడితే మానవజాతి ఎప్పుడో అంతరించిపోయేది"
    "నీలాంటి మాడ్ ఫెలోస్ తో ఉండటం కన్నా అంతరించిపోతేనే బాగుండేది"
    "ఇంతకూ డాక్టర్ కథేమిటి?"
    "అదే అని అనుమానంగా ఉంది"
    "ఓ.....అదా....." గట్టిగా అరిచాడు. అతని మొఖం వెలిగిపోయింది.
    "ఆమె కొంచెం సిగ్గుపడింది."
    "అలా అరుస్తావెందుకు? గంగాభవానీ వింటుంది"
    "వింటే ఏం? నెక్స్టు ఛాన్స్ ఆమెకిస్తానులే"

Next Page