Next Page 

షా పేజి 1

 

                                                               షా


                                                                                          యర్రం శెట్టి సాయి

                  

 

 

    వదినా!
    వదినా ........."
    ఆమె కోసం ఇల్లంతా తిరుగుతూ పెరట్లో కొచ్చాడు సృజన్.
    సుభద్ర అక్కడ ఉలసి మొక్కకు దణ్ణం పెడుతూ కనిపించేసరికి తనూ ఆమె పక్కనే నిలబడి కళ్ళు మూసుకుని రెండు చేతులూ జోడించాడు.
    సుభద్ర కళ్ళు తెరిచి ప్రక్కనే నిలబడ్డ సృజన్ ని చూసి నవ్వాపుకుంది.
    "చాలా గొప్ప భక్తుడి వేలే......ఇంక లోపలకు పద......" అంది నవ్వుతూ.
    సృజన్ ఆమె వెనుకే లోపలకు నడిచాడు.
    "వదినా......మరే.....మా ఫ్రెండ్స్ రంగాగాడు, స్వరూప్ గాడూ లేరూ."
    "లేక ఎక్కడికి పోయారు?"
    "అదే వదినా పాపం వాళ్లివాల ఉదయం భోజనం చేసి రాలేదుట....పాపం .....అందుకని నాతొ పాటు వాళ్ళను మనింటికి ........అదే......నువ్వు కాబేజీ టమాటో కర్రీ వండావు చూడు, అది ఎంతో బావుందని...."
    సుభద్ర నవ్వేసింది.
    "వాళ్ళిప్పుడు నీతోపాటు మనింటిలో భోజనం చేస్తారు. అంతేనా?"
    "ఆ ఆ! అంతే వదినా?"
    "దానికోసం నా వంటకాల నేమీ పొగడక్కరాలేదని వాళ్ళతో చెప్పు."
    "అయ్యయో! పొగడ్తలు కాదోదినా! నిజంగానే .......వట్టు కూడా వేశారు వాళ్ళు."
    "సరే నాయనా........నేను నమ్ముతున్నాను ఇంక, నీ గొడవ ఆపేయ్"
    "థాంక్యూ వదినా! బెస్ట్ సిస్టరిల్లా ఆఫ్ డది ఇయర్ బహుమతి అంటూ పెడితే ప్రతి సంవత్సరం నువ్వే కొట్టేస్తావొదినా........"
    సుభద్ర చిరాగ్గా చుసిందతని వేపు.
    "బెస్ట్ వసపిట్ట ఆఫ్ ది ఇయర్ బహుమతి పెడితే లైఫ్ లాంగ్ నీకే వస్తుంది. నువ్వెళ్ళి మీ ఫ్రండ్స్ తో మాట్లాడుతూ  ఉండు భోజనం వడ్డించి పిలుస్తాను.........."
    "ఓ.కే. వదినా! మా బంగారు వదినా........." ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుని బయటకు పరుగెత్తాడు సృజన్.
    హాలులో కూర్చున్న రంగా, స్వరూప్ అతన్ని చూడగానే ఆత్రుతగా అడిగారు.
    "ఏరా! వదినేమీ విసుక్కోలేదు కదా?"
    "ఏడ్చారులే వదిన సంగతి తెలీందేముంది మీకు?"
    "తెలుసుననుకో అయినా వారానికిలా రెండు సార్లు భోజనాని కొచ్చేస్తుంటే......."
    "అది సరే గాని ఆ మూల హంగర్ కి నీ షర్ట్స్ వున్నాయి చూడు అని నువ్వు వాడటం లేదేంరా?" అడిగాడు రంగా.
    సృజన్ నవ్వాడు.
    "కావాలంటే తీసుకొండ్రా! కొత్తవి కుట్టిచ్చేసరికి వాటిమీద మోజు తీరిపోయింది.
    ఆ మాట అనడమే ఆలస్యంగా రంగా, స్వరూప్ ఇద్దరూ లేచి వెళ్ళి హంగర్స్ కి వేళ్ళాడుతున్న బట్టలు చెరో రెండు జతలూ న్యూస్ పేపరులో ప్యాక్ చేసి పెట్టేసుకున్నారు.
    "హమ్మయ్యా ! ఇంక కాలేజీ క్లోజ్ అయ్యేవరకూ బట్టల బాధ లేదురా" ఆనందంగా అన్నాడు రంగా.
    స్వరూప్ డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి అక్కడున్న పౌడర్ టిన్స్ తీసుకుని ఆశ్చర్యంగా చూస్తూ.
    "ఇదెక్కడి పౌడరురా------భలే భావుంది సువాసన....." అనడిగాడు చేతిలో కొంచెం జల్లుకుని.
    "ఫారిన్ దిరా మొన్ననే కొన్నాను."
    స్వరూప్ అది మరికొంచెం చేతిలో జల్లి మొఖానికి రాసుకున్నాడు.
    "ఆహా! ఎంత ప్లెజెంట్ గా ఉందిరా"
    పనికుర్రాడు గదిలోకొచ్చాడు.
    "సార్! అమ్మగారు భోజనానికి పిలుస్తున్నారు."
    "పదండ్రా" అన్నాడు సృజన్.
    ముగ్గురూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు.
    "నమస్తే వదినా" అన్నారిద్దరూ సుభద్ర ను చూడగానే.
    ""ఆ మధ్య రావడం లేదేమిటయ్యా నా చేతి వంటలు బావుండటం లేదా ఏమిటి" నవ్వుతూ అడిగింది సుభద్ర.
    "వంటలు బావుండటం లేదంటే మా కళ్ళు పోతాయ్ వదినా? రోజూ భోజనానికి రావాలనే వుంటుంది కాని మీరు చీపురు తీసుకుంటారేమో నని ----------" అన్నాడు రంగా.

Next Page