TeluguOne - Grandhalayam | Online Book Store | Novel Reading | Telugu Novels | Telugu Kathalu | Famous Telugu Writers | Chandu Sombabu | Yandamuri Veerendranath | Merlapaka Murali | Vasireddy Seeta Devi | Samaram Novels
Udyogam


                                 ఉద్యోగం

                                                                           -ఆదివిష్ణు

ఇందులో
*దూరం  * ఉద్యోగం *బంధితులు *కుర్చీలు  * ఎన్నిక * సుఖంలేని మనిషి * దేవుడు కరుణించాలి!
మొదటి నాలుగు కథలూ  ఆంధ్ర సచిత్ర వారపత్రిక నుండీ, తర్వాత రెండు కథలూ జయశ్రీ మాసపత్రిక నుండీ, చివరికథ జ్యోతి మాసపత్రిక నుండీ పునర్ముద్రి తాలు. ఆయా సంపాదక మహాశయులకు రచయిత కృతజ్ఞతలు.

 

                                      


                                   దూరం

' అన్ని హంగులూ వున్న గొప్ప సిటీ ఆంధ్ర రాజధాని మంచి చోటుకే వెడుతున్నావు నువ్వు. దీన్ని అదృష్టమనే చెప్పాలి. వెళ్ళిరా.మళ్ళీ ఈప్రాంతాలకొచ్చేప్పుడు యింకా పెద్దవాడివై రా! వెళ్ళు , బెస్టాఫ్ లక్!'
బస్సు వేగంగా నడుస్తోంది. పైమాటలు నన్ను వెంటాడుతునే ఉంటాయి.అయినా వెలితి మనసునిండా నిండుకున్నది.    
తెలుగు తనానికి ముఖ్యమైన అలంకారం యిక్కడ ముచ్చటించవలసిన అవసరం వుంది. సొంత వూరు వదిలి దూరంగా బ్రతుకుదామనే తపనని తెలుగు మనిషి సాధ్య మైనంతవరకూ చంపుకుంటాడనే నూటికి  నూరుపాళ్లు నిజాన్ని నాలాంటి మనిషి కాదనలేడు.
ఆ జాతి నాది. ఆ మనిషి నేను.
నా  జాతి కాని మనుషుల్ని నేను చూచి ఖంగారుపడిన సంఘటనలు  యిక్కడ ఉదహరిస్తాను.
ఒకటి- ఆరేళ్ళ క్రితం యాత్రలనెపం మిద పూరీ జగన్నాధం  వెడుతుండగా కలకత్తా తరలి వెడుతున్న మద్రాసీని రైల్లో చూచినప్పుడు, రెండు- సామర్లకోట రైల్లేస్టేషన్ పక్కగా వో చిన్న పాకలో టీ షాపు పెట్టుకు బ్రతుకుతున్న మళయాళీని చూచినప్పడు, మూడు- మా ఆఫీసులో బంట్రోతు ఉద్యోగం చేస్తోన్న  బాలన్ తో మాటాడి నప్పుడూను.
చిన్న ఉద్యోగాలు.వచ్చేది సిసలైన తెలుగు మనిషి తాలూకు కేవలం ఆడంబరాలకి చాలినంత జీతం వాళ్ళది. అయినాసరే వందల దూరం వచ్చేసి నిశ్చితంగా బ్రతుకు తున్నారు.
విడ్డూరంగా ఉంటుంది. నేనే ఆస్థితి కొచ్చేస్తే గుండె  ఆగి చద్దుననిపిస్తుంది. నా మనుషుల్నీ, నా  వూరునీ, నా  అను భూతుల్నీ- అన్నింటినీ వదిలేసి  అంత దూరం  వెళ్ళి  ' వెట్టి చాకిరీ' చేసుకు బ్రతి కేదానికంటే మా వూర్లో రిక్షాలాగి బ్రతకడం మేలనే మనుషుల్లో నేనుంటాను.    
 ఇదీ నేను!
ఆంధ్రులు  గర్వంచదగ్గ  చరిత్రగల తెలుగుగడ్డ మిద పుట్టి, పెరిగి, పెద్దవాడి నయ్యేను. ఆ దగ్గర్లోనే  ఉద్యోగం చేసేను యిన్నాళ్ళూ: ఇప్పుడు పిడుగు పడినట్లు ఎవడి కొంపో ఉద్దరించాలన్నట్టు నన్ను బదిలీ చేయడం శిక్ష! గొప్ప శిక్ష!
రాజధాని గురించి నేనూ చెప్పగలను-
ఎన్నో తరహాల సంస్కృతీ- సంస్కారం, ఎన్నో, జాతుల సంగమం, కళామయ నహానగరం.ఆలాటి నగరానికి వెళ్ళడం ముదావహామనీ, కళ మిద మోజువున్న ప్రతీ మనిషి తిండి  లేకపోయినా బ్రతకగల భాగ్య నగరమనీ నేనూ చెప్పగలను- మరో డెవడైనా అక్కడికి బదిలీ అవుతే బదిలీ అయ్యింది సాక్షాత్తూ నాకు. నే నెలాటి మనిషినో నాకు తెలుసు.
నా అభిరుచులు చాలామందికి నచ్చక పోవచ్చు. వట్టి అనాగరికుడన్న వేలెత్తి చూపించవచ్చు.కానీ నేనంత త్వరగా మారలేను దూరంగా ఉద్యోగాలు చేస్తోన్న తెలుగు సోదరుల 'తెగింపు' ని మాత్రం హర్షించగలను.
భాగ్యనగరానికి బదిలీమిద కాకుండా ఏదో చూచి పోడానికని సరిపెట్టుకుంటే రెండు మూడు  నెలలుండగలనేమో గానీ, 'బదలీ నే తప్పదు. నువ్వు వెళ్ళాలి లేకపోతే జీవితంలో  నువ్వు దెబ్బ తినేయగలవని చెప్పి ముక్కుమిద కొట్టినట్టు నా కొచ్చిన కాగితం చూస్తుంటే రెండు రోజులైనా ఉండలేనేమో ననిపిస్తోంది. గట్టిగా ఏడవాలని వుంది.
నాలాటి  వాళ్ళకే తెలుస్తుంది నా యాతను. గుండె నిబ్బరం, కొంచెం సాహసం,ప్రతి చిన్న విషయాన్ని ఆయా లాగ్రంగా పరిశీలించాలనే గుణం గల వాళ్ళకి మాత్రం ఇది ఒక  పిచ్చివాడు తీరిక వేళలో ఆడుకుంటున్న వెర్రి  ఆలోచనల గూడులాగుంటుంది. అయినాసరే, ఈకధ రాస్తాను.
బ్రహ్మచారిగా  జీవితం గడిపి నన్నాళ్ళూ ఈబదిలీ రాలేదు. అప్పుడొచ్చినా అభిప్రాయాల్ని కొంచెంగా నైనా మార్చుకునేవాడిని పెళ్ళయింది. ముద్దుల మూట గట్టే చిరంజీవి పుట్టలేదు.  ఈస్థితిలో నాకు బదిలీనా?
దిగులుగా ఒస్సేక్కాను నన్ను తీసుకెడుతున్న బస్సూ కదల్లేక కదుల్తున్నట్టుంది. జగ్గయ్య పేట దాటేంత వరకూ మనసుని అదుపులో పెట్టుకోగలిగేను. అది కాస్తా దాటగానే నా క్కనిపించే ఎడారిలాంటి ప్రదేశాన్ని చూస్తూ గొంతు దాకా. వచ్చిన దుఃఖాన్ని అలాగే కప్పి పెట్టుకోడం ప్రారంభించేను. మావేపున రోడ్లు ఇలావుండవు.కళగా  ఉంటాయి. కాంతులు వెదజల్లతాయి. పచ్చటి పైరుతో నవ్వుతూ స్వాగతం చెబుతున్న ట్టుంటాయి. భయంగా వుంది. పుట్టి. పెరిగిన వూరు వదిలికొత్తజీవితం 'ఒంటరిగా' ఎలా గడప గలను?
నిద్రపోవటానికి కళు మూసుకున్నాను. నిద్రలాటిదే కానీ సుకమైన నిద్రని చెప్పను. కళ్లు మూసుకున్నట్లు  మాత్రం జ్ఞాపకం.

                             *     *      *       *
నా ఆలోచనలకున్న రంగులు స్పష్ఠంగా చూచుకోగల అవకాశం హైద్రాబాద్ బస్టాండ్ లో లభించింది.
నేను వస్తున్నట్టు రాముడికి తెలీజేశాను. వాడు నా మిత్రుడు. మా వూరివాడు. నాతో నాలుగేళ్ళు చదువుకున్న వాడూను. వాడీ నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. తెలుగు దేశం, తెలుగు ప్రజలు అని ఇరవై నాలుగంటలూ జపం చేస్తూ కూర్చుంటే నీ జీవితమేంగాను?  అని చెప్పి లేకపోతే అర్నేల్లు పాటు ప్రత్యేకమైన వాళ్ళాఫీసు పనిమిద బొంబాయి లో నిశ్ఛితంగా గడిపి రాగలడు?
బస్సు దిగుతూనే రాముడికోసం వెతికేను. కనిపించలేదు. అంత రద్దీలో వాడు లేకపోయినందుకు దిగులుపడిపోయి ఉందును. కానీ వెంటనే కనిపించేడు శ్రీనివాసరావు.
శ్రీనివాసరావు ఒక్కగా రివటాలా,ఎర్రగాఅందంగా ఉంటాడు చెయ్యెత్తు మనిషి. గట్టిగా గాలి వస్తే వంగిన రెల్లు గడిల్లా వొరిగి పోగల ఆకారం.    
అతన్ని చూస్తూనే గట్టిగా కేక పెట్టోయేను. నా  ప్రయత్నం అతనే  ముగించేడు. నా రెండు చేతులూ పుచ్చు కుని కళ్ళతో  ఆప్యాయత కుపిరిస్తూ గుండెలనిండా నిండిన ఆనందాన్ని మాటల్లో ఒలికించేడు.
" మిరూ వచ్చేరా గురూగారూ!"
ఆ సమయాన, దూరానవున్న మావూరిని శ్రీనివాసరావులో చూచి ఆనందించేను. వెంటనే సమాధానమూ చెప్పలేక పోయేను.
"పెట్టె బేడాబస్సులోనే  ఉన్నాయా! రండి దింపిద్దాం."


Related Novels


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.