TeluguOne - Grandhalayam
అనుభవాల అలలలో

       "మంచి నీళ్ళు తాగా కదమ్మా? వాళ్ళు చెప్పింది చేయకు" అంది పాప.

 

      "నీ శిగతరగ నీ కెన్ని తెలివితేటలే...ముందు ముందు బాగా పనికివస్తావ్...! అనుకుని పాపని తీసుకువెళ్ళండి" అన్నాడు.
   
 
    పాపని బలవంతాన అవతలికి తీసుకువెళ్ళారు.
   
    "చెప్పండి ఏ ఆట ఆడాలి....?" ఆమె అడిగింది.
   
    "మా పెద్ద బాస్ రావాలి పది నిముషాలు ఆగు" అన్నాడు వాడు.
   
    సరిగ్గా పది నిమిషాల తర్వాత బాస్ అనబడే ఏడడుగుల చిన్న సైజు ఏనుగు లాంటి వాడు అక్కడి కొచ్చాడు. కండలు తిరిగిన తన రక్షణదారుని వెంటబెట్టుకుని.
   
    బాస్ రాగానే అందరూ వెళ్ళిపోయారు. కట్టేసిన సి.ఐ.డి. అతని ప్రక్కనే తుపాకీతో కాపలావాడు బాస్ అతని అనుచరుడు. ఇక్కడ వున్నవాడు! భర్త. గాక నలుగురు మగవాళ్ళు నరరూప రాక్షసుల్లాంటి మగవాళ్ళు ఆమె ఆట చూడటానికి అక్కడా మిగిలారు.
   
    "ఆట ఎలా ఆడాలో చెపుతాను. జాగ్రత్తగా వినిచక్కగా చేయి."
   
    ఆమె వాళ్ళ వేపు అనుమానంగా చూసింది. "ఇదేం ఆట తన భర్త గోళ్ళని పట్టకారుతో బలవంతాన పీకారు. అయినా అతను నోరు మెదపలేదు. తనే అది చూడలేక స్పృహ తప్పి పడిపోయింది. ఈ గాడిద ఆట చూసి తన భర్త పెదవులు కదుపుతాడా? ఉహూ."
   
    "ఏంటి ఆలోచిస్తున్నావ్! ఆడ గాడిద ఆట ఆడవా? సరే....నీ పిల్లదాని మాన ప్రాణాలు ఇప్పుడు మా చేతిలో వున్నాయి. మేం చెప్పినా ఆట ఆడతానని నీ పిల్ల మీద ప్రమాణం చేశావు..."
   
    "నా వల్ల కాదు....నా వల్ల కాదు..."
   
    "ఆ పిల్ల దాన్ని తీసుకురండిరా?" వురిమాడువాడు.
   
    "వద్దు...." ఆమె అరిచింది. వెంటనే చేతులు జాకిట్టు మీదకి పోయాయి.
   
    ఆమె చేతులు ఎప్పుడయితే జాకెట్ గుండీలమీదకి పోయాయో అప్పుడే అతను విపరీతమయిన బాధతో వద్దు అని అరవబోయాడు. బొడ్డునుంచి బయలుదేరిన "వద్దు" అనే ఆ మాట భగ్గున మండే మంటతో కూడిన ఆక్రందన ఆ మంట పైకి తన్నుకు రాగా నోట్లోంచి పైకి వచ్చే వీలుగాక అతని గుండెను చుట్టుముట్టింది. ఆ చిన్న గుండెకాయ కళ్ళ ఎదుట జరుగుతున్న దారుణాన్ని ఆపలేక తానే ఆగిపోయింది.
   
    అతని ప్రాణం కళ్ళలోంచి పోయింది. రెప్పలువాల్చలేని ఆ కళ్ళు అలా వుండిపోయాయి.
   
    ఈ విషయం ఆమెకి తెలియదు. అక్కడున్న వాళ్ళకి తెలియదు. ఆమె తెగించినందుకు కాదు. ఆమె కన్నీళ్ళకు, ఆమెకి జరుగుతున్న అన్యాయానికి దేముడు దిగిరాలేదు... భూమి బద్దలు కాలేదు. గాలి స్థంభించలేదు. పవిత్ర భారత దేశంలో ఇలాంటివి మామూలే అన్నట్లు అన్నీ యధావిధిగానే వున్నాయి.
   
    చందు చేయి చాచి చేతికి అందుబాటులో వున్న ప్రొజెక్టర్ ని ఆఫ్ చేశాడు.
   
    చందు ముఖంలో భయం, బాధ సుళ్ళు తిరుగుతున్నాయి. కొద్దిసేపు కణతలు నొక్కుకుంటూ వుండిపోయాడు. అతని పక్కనే సిగరెట్ పీకలు గుట్టలా పడివున్నాయి. ఏమాలోచిస్తున్నాడో అతనికే తెలియదు...చాలాసేపు అలానే కూర్చుండిపోయి తర్వాత ఎప్పుడో కుర్చీలోంచి లేచి "సీతా! నాదేం బ్రతుకు? ఉహూ__నాకు ఫరవాలేదు సీతా! నీకు.... నీకు...ఇలాంటి విషమ పరిస్థితులు ఎప్పటికీ రానివ్వను. దృఢనిశ్చయంతో అనుకున్నాడు.
   
    అక్కడే వున్న పుస్తకంలో నూటనలభయి నాలుగో పేజీ తెరిచి, "చూశాను. గుర్తుపెట్టుకున్నాను. అడుగు వేస్తున్నాను. రాం రాం" అని నాలుగు ముక్కలు గిలికాడు.
   
    ఆ తర్వాత ఆ ఫిల్మ్ అక్కడే వున్న పూల కుండీలో దాచి యధాతధంగా అన్నీ సర్దిపెట్టి ఇంటికి తాళం వేసి బయటపడ్డాడు.
   
    ఏమీ జరగనట్లు తాపీగా నడుస్తూ బయలుదేరాడు చందు.

Related Novels