Next Page 

మహాప్రవాహం  పేజి 1

   
                                 మహాప్రవాహం

                                                  -కొమ్మూరి వేణుగోపాలరావు

 

                       


            
    అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన సమయంలో ఓ లారీ నేషనల్ హైవేమిద అరవైమైళ్ళ వేగంతో దూసుకుపోతోంది.

    
     మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళే రోడ్డు అది.

    
     లారీనిడ్రైవ్ చేస్తోన్న వ్యక్తి కాకుండా ప్రక్కన ఇంకో మనిషి కూర్చుని  ఉన్నాడు.  అతను లారీ క్లీనర్.


    ఇద్దరి చేతుల్లోనూ బీడీలు వెలుగుతున్నాయి ఇద్దరూ  కొంతవరకూ మందుమిద ఉన్నారు.


    ఆ రోజెందుకో నేషనల్ హైవే అయినా ట్రాఫిక్ ఎక్కువగా లేదు.


    " గురో! చిలక  బాగుంది.ఆడుచూ స్తే నడివయసోడులా ఉన్నాడు. ఎలా చేసుకుందో మరి." అన్నాడు క్లీనర్.


    "ఊరుకోరా! చూస్తే చాలా అమాయకులాలిలా ఉంది. యిద్దరు పిల్లలుకూడా ఉన్నారు." అన్నాడు డ్రైవరు మందలిస్తూన్నట్లుగా.


     క్లీనర్ మాట్లాడలేదు.


     ఆ లారీ వెనుక బాడిలో ఓ సంసారం, సంసారం కదిలివెడుతోంది. భార్యా , భర్త,ఇద్దరు పిల్లలు. భర్తకు నలభై అయిదేళ్ళకు పైగా వుంటాయి. భార్యకు ఇరవై అయిదుకన్నాఎక్కువ ఉండవు. పిల్లాడికి అయిదేళ్ళు , పిల్లకు మూడేళ్ళు ఉంటాయి.


     అతని పేరుపార్వతీశం. ఏలూరులో ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆకంపెనీ వాళ్లు కాకినాడలో కొత్తగా    ఓ బ్రాంచిపెట్టి పార్వతీశాన్ని  మేనేజరుగా వేశారు

    
    అతనికి ఏడాది క్రితం హార్ట్ ఎటాకొచ్చింది. కొంతవరకు సిరీయస్ కూడా అయింది. రెండు మూడు రోజులు ఆందోళనగా గడిచిన మిదట క్రిటికల్ పీరియడ్ లోంచటి ప్రాణాలతో బయటపడ్డాడు.

    
     ఒక రకంగా అతనికి కాకినాడ పంపించటం సుఖమే  అనిపించింది. అక్కడ అతనికి అత్తగారి తరపువాళ్ళూ. తన తరపువాళ్ళూ బంధువులున్నారు. అవసరమొస్తే  గవర్నమెంట్ జనరల్ హాస్పిటలుంది. ఊరు కూడా ఏలూరుకన్నా సదపాయంగా, హాయిగా ఉంటుంది. అక్కడ వాతావరణం బావుంటుంది. ఈ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుని అతను కాకినాడ వెళ్ళటానికి సంతోషంగా  ఒప్పుకున్నాడు. ఏలూరునుంచి లగేజి వగైరావలు రైల్లో తీసుకెళ్ళటం కన్నా లారీలో తీసుకెళ్ళటం ఉత్తమమనిపిచింది. ఎంతా! మూడు నాలుగు గంటల ప్రయాణం ! తాము కూడా పిల్లలతో ఆ కాసేపూ లారీమిదే కాలక్షేపంచే స్తేతిన్నగా ఇంటి దగ్గరే దిగిపోవచ్చు. కాకినాడలో అతని ఇదివరకే  రాశాడు. ఈ పాటికి చూసే ఉంటాడు. చూడలేకపోతే దొరికేదాకా వారం  పది రోజులు తాము వాళ్ళింట్లోనే  ఉండవచ్చు.


    శకుంతల భర్తకు సాధ్యమైనంతవరకూ ప్రక్క సుఖం గానే వేసింది. లారీని మెల్లగా తీసుకెళ్ళమ ని డ్రైవర్ను ముందుగా కోరింది.  అతను ఊ అన్నాడు గానీ ఆమె అడిగింది వినిపించుకున్నట్లు లేదు. లారీ చాలా వేగంగా   వెళ్ళి పాతోంది. మధ్య మధ్య గోతుల్లో పడినప్పుడు ప్రేవులు తోడేసినట్లయి గుండె చిక్కబట్టిపోతోంది. ఆ బాధకితట్టుకోలేక అతను   " అమ్మా! అమ్మా!" అని మూలుగుతున్నాడు.


     " ఏవండీ! ఎలా వుంది?" అనడిగింది శకుంతల ఆందోళనతో.


     " బాగానే ఉంది....  కుదుపు వచ్చినప్పుడు.... "


    శకుంతల భర్త గురించి ఆలోచిస్తోంది. తను అతనికి రెండో  పెళ్ళి . మొదటి భార్య గర్భణి వచ్చినప్పుడు సిజేరియన్  ఆపరేషన్ చేస్తే కాంప్లికేషనొచ్చి- తల్లి శిశువూ యిద్దరూ చనిపోయారు- ఆమెకతు ప్రెగ్నెన్సీ చాలా లేటుగా వచ్చింది.


    ఎల్డర్లీ ఫ్రైమి అని డాక్టర్లు జాగ్రత్తగానే ట్రీట్ చేశారు అయినా ఆమెను కాపాడలేకపోయారు. తర్వాత నాలుగయిదేళ్ళదాకా అతను పెళ్ళి చేసుకోలేదు. మెల్లగా బంధువులంతా నచ్చజెప్పి అతన్ని పెళ్ళికి  ఒప్పించారు. శకుంతలకు కట్నాలివలేక పెళ్ళి చెయ్యలేని దుస్థితిలో వున్న తలిదండ్రులు ఆమెను  పార్వతీశానికిచ్చి  పెళ్ళి చేశారు.


    తన  వయసుకన్న యించుమించు  ఇరవైఏళ్లు పెద్ద అయిన వ్యక్తితో పెళ్ళి చేసినందుకు శకుంతల ఏమి బాధ వ్యక్తం చేయ్యలేదు. మొదట్నుచీ తన కుటుంబ పరిస్థితుల్ని ఆమె అర్థం చేసుకుంటూనే వుంది.    


     వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగానే సాగింది. పార్వతీశం ఆమెను చాలా ప్రేమగా , ప్రాణంగా చూసుకునేవాడు శకుంతల అతన్ని భక్తితో కంటికి రెప్పలా చూసుకొనేది.


     " అమ్మా!"  అని ములిగాడు పార్వతీశం.


    "ఏమిటండీ?" అన్నది శకుంతల గాభరాగా.


    " గుండెల్లో కొంచెం నొప్పి వస్తోంది"


     శకుంతల చాలా కంగారుపడింది. అతను హార్డ్ పేషెంటని తెలిసికూడా  ఇలా రిస్క్ తీసుకుని లారీలో ప్రయాణం తలపెట్టినుందుకు తనని నిందించుకుంది.
 వేగంగా జరిగి డ్రైవరు సీటు వెనక వున్న ప్రదేశాని చేరుకుంది.


     చేతుల్తో ఆ భాగాన్ని గట్టిగా తట్టుతూ " ఇదిగో చూడండి. బాబూ అని చేతనైనంత బిగ్గరగా పిలిచింది.


    ఆ సమయంలో డ్రైవరు,క్లీనరు యిద్దరూ కలిసి సీసాలో మిగిలివున్న మందును చేతులు మార్చుకుంటూ కొంచెం కొంచెం సేవిస్తున్నారు. మధ్య మధ్య  బుతులతో కూడిన  జోకులేసుకుంటున్నారు. వాళ్ళకు వెనక జరుగుతూన్న గొడవేమి తెలీటంలేదు.


     శకుంతల చేతుల్తో బాది బాది ,అరిచి  అరిచి అలచి పోయింది.


     వెన్నెల రోజులు కావటంవల్ల అంతటా కాంతిగానే వుంది. అయిదు  నిమిషాలకూ, పది  నిమిషాలకు ఓ లారీయో, కారో ఎదురవుతోంది.


     పార్వతీశం బాధతో గట్టిగా కేకపెట్టినట్లు వినిపించింది.


    పిల్లలు ప్రక్కనే మెత్తగా వేసిన పరుపులమిద దొర్లుతున్నారు.


     శకుంతల ఆతృతగా ముందుకు రాబోయి లారీ వెడుతోన్న వేగానికి లోపల భాగానే  క్రిందపడి దొర్లింది. తర్వాత పాక్కుంటూ పాక్కుంటూ భర్త దగ్గర కొచ్చింది.


     వెన్నెల వెలుగులో కొంచెం ప్రక్కకు దొర్లి కళ్ళు తేలవేసినట్లు చూస్తున్నాడు. వొళ్ళంతా చేమటలు దిగకారు తూన్నట్లు కనిపిచింది.


    "ఏమిటండీ " అంది వొణికే గొంతుతో.


    అతను మాట్లాడలేదు.

Next Page