Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 2

    "అసలు నీ వల్లే అదలా తయారైంది - వద్దంటుందే     "అసలు నీ వల్లే అదలా తయారైంది - వద్దంటుందే ఆ టైపు ఇన్ స్టిట్యుట్ పంపించావు, అప్పటినుంచే దానికి తిరుగుడు బాగా అలవాటయింది...." కోపంగా  అన్నాడు.
    "అవును అన్నింటికి నన్నే అనండి- అదేమో నాకేం తోచడంలేదు మొర్రో,
    టైపన్నా నేర్చుకుంటాను, ఇంట్లో కూర్చుని బోరేత్తుతోందని ప్రాణాలు కొరికితే సరే అన్నాను. అది తప్పినా పరిక్షలయి ఇంట్లో వురికే కూర్చుంది - పోనీ టైపు నేర్చుకుంటే ఎందుకన్నా పనికొస్తుందని వప్పుకోవడం తప్పా...." పద్మావతి ఉక్రోషంగా అంది.
    "అబ్బే ఏది తప్పు కాదు, రాత్రి ఎనిమిదైనా బాయ్ ఫ్రెండ్స్ తో షికార్లు తిరగడం తప్పుకాదు - ఎబార్షన్ చేయించుకోవడం మామూలు, మరొకడ్ని పెళ్ళాడడం అంతకంటే మామూలు.ఇదంతా ఫెషనే - అను, రోజులు మారాయి ఇందులో ఏం తప్పు లేదను......పంపించు కూతుర్ని రోజు తిరగడానికి......'
    "మీరనవసరంగా మాటలు జరకండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు- పిల్ల తప్పుచేస్తే మందలించి బుద్ది చెప్పడం మాని నామీద ఎగురుతారేం - నేనేవడితోనో తిరిగిరమ్మని పంపలేదు. ఆ మాత్రం బాధ్యత నాకూ తెల్సు. అది వచ్చాక నిలబెట్టి అడగండి చాతనయితే, అంతేకాని నన్ననవసరంగా అనకండి" పద్మావతి కోపంగా లేచి లోపలి కెళ్ళిపోయింది. విశ్వనాధం కోపంతో బుసలుకొడుతూ బోనులో పులిలా విసురుగా పచార్లు చేయ్యసాగాడు - తల్లితండ్రుల వాగ్వివాదం విన్న రవి శారద బితుకు బితుకుమంటూ పుస్తకాలు ముందు కూర్చుని చదువు నటిస్తున్నారు గదిలో.
    పబ్లిక్ గార్డెన్ లో ఆ చీకటి పొదలచాటున ఒక యువ జంట అంతసేపు చుట్టూ ప్రపంచాన్నే మరిచినట్టు కూర్చున్నది. అప్పుడే గుర్తుకొచ్చినట్టు చుట్టూ చీకటిచూసి
    "మైగాడ్......ఎడున్నరయింది. బాబోయ్ నే వెళ్ళిపోవాలి సురేష్! ఇంతసేపు టైమే గుర్తురాలేదు" రూప కంగారుగా లేచింది.
    "ఎంతసేపున్నా నిన్ను వదలాలనిపించదు! రూపా కొంప మునిగినట్లు అప్పుడే ఇంత రాత్రవాలా" రూప చెయ్యి నొక్కి తప్పదన్నట్టు లేచాడు సురేష్. "నీ సమక్షంలో గంటలు నిమిషాలుగా, నీ పరోక్షంలో నిమిషాలు గంటలుగా అనిపిస్తాయి."
    "ఆహా.....చాల్లే పెద్ద కవిత్వం చెపుతున్నట్టు ఫోజులు మాను....."రూప అల్లరిగా నవ్వి ఇటు అటు చూసి చటుక్కున వంగి అతని పెదాలమీద చిన్న ముద్దు పెట్టి "బై డార్లింగ్...." అంటూ హేండ్ బాగ్ అందుకుంది.
    "ఫిర్ కబ్? కహ..." రొమాంటిక్ సిని హిరోలా కొంటెగా చూస్తూ అన్నాడు సురేష్.
    'జబ్ తుమ్ కహోగే " రూప తక్కువ తినలేదన్నట్లు గడుసుగా అంది.
    "చాల్లే కాని, రేపు వస్తావా...."
    "అమ్మో వద్దు రోజు వస్తే అమ్మ చంపుతుంది. అసలీ మధ్య అమ్మకేదో అనుమానం వచ్చినట్లుంది. అనుమానంగా చూస్తూ పదిసార్లు అరా తీసి అడుగుతుంది.
    రేపోద్దులే ఎల్లుండి వస్తా. నువిక్కడే వుండి నే వెళ్ళాక కాసేపుండి రా. ఎవరన్నా చూస్తారు ఇద్దరం వెళ్ళడం. గుడ్ నైట్ సురేష్" చికట్లోంచి చకచక బయటికి వచ్చి రిక్షా ఎక్కింది రూప. అంతవరకు టైము, ఉనికి, పరిసరాలు ఏమి గుర్తురాలేదు, కాని ఇప్పుడు రిక్షా ఎక్కి ఇంటికి వస్తుంటే? తండ్రి ఇంటికి వచ్చి వుంటాడు ఎమనరుకదా అన్న భయం పట్టుకుంది రూపకి.
    రిక్షా దిగుతుండగానే వీధి వరండాలోనే తండ్రిని చూసి గతుక్కుమంది రూప.
    రూప గేటు తీసుకురావడం చూసి పచార్లు ఆపి నడుంమీద చేతులు పెట్టుకుని తీవ్రంగా రూపని చూశాడు విశ్వనాధం. తండ్రిని చూసి జంకుతూ లోపలికి వెళ్ళబోయింది.
    "అగు, ఇంత వరకు ఎక్కడికెళ్ళావు?" తీక్షణంగా అడిగారాయన.
    "లతావాళ్ళింట్లో కొత్త రికార్డులు తెచ్చారు వింటూ కూర్చుండిపోయాను" గొణిగింది భయంగా. విస్వనాధంగారొక్క క్షణం రూప మొహంలోకి చూసి చరచర డ్రాయింగురూములోకి వెళ్ళి ఫోను తీసి లత ఇంటికి దయాల్ చేశారు.
    "హల్లో లతేనా మాట్లాడుతోంది? మా రూప మీ ఇంటికి వచ్చిందా సాయంత్రం?" అన్నాడు గంభీరంగా.
    రూప పైప్రాణాలు పైనే పోయాయి. ఆమె నుడురంతా చెమటపట్టింది.
    "లేదు అంకుల్ మా ఇంటికి రాలేదే ఏం ఇంకా రాలేదా?"అంది.
    "అలేదు....ఇదిగో యిప్పుడే వచ్చిందిలే" అంటూ ఫోను పెట్టేసిరూప వైపు తిరిగి తీక్షణంగా చూశారు.
    రూప కాళ్ళల్లో వణుకుబయలుదేరింది.
    పద్మావతి భర్త రౌద్రరూపం చూసేసరికి గుండెలు దడదడలాడాయి.
    అయన రూప దగ్గరకి వచ్చి..." నిజం చెప్పు ఎక్కడికెళ్ళావు? ఎవరితో వెళ్ళావు? నిజం చెప్పు అబద్దం చెప్పడానికి ప్రయత్నించకు. డోంట్ లైటు మీ , వాంట్ ట్రూత్..." కర్కశంగా అన్నారు.
    రూప తడబడిపోయింది. ఏం చెప్పాలో తెలియక భయంగా తల్లి వంక చూసింది. పద్మావతి కూడా- చెప్పు, జవాబు చెప్పు అన్నట్టు చూసేసరికి తల్లి తనని అదుకోదని అర్ధంకాగానే మరింత చెమటలు పట్టాయి నిస్సహాయంగా చూసింది తండ్రి వంక.
    "ఊ జవాబు చెప్పు తొందరగా" అసహనంగా అరిచారయన.
    "పబ్లిక్ గార్డెన్సుకి వెళ్ళాను " బితుకు బితుకుమని చూస్తూ అంది రూప.
    "ఎవరితో...."
    "మా టైపు ఇన్ స్టిట్యుట్ నుంచి ముగ్గురు నల్గురు ఫ్రెండ్స్  వెడుతుంటే వెళ్ళాను"
    రూప చెంప చెళ్ళుమంది.
    "నోర్ముయ్ అబద్దం ఆడద్దని చెప్పను. ఫ్రెండ్ర్స్ తో వెళ్ళవా? ఇంకా అబద్దం ఆడతావా? చెప్పు ఎవడు వాడు? ఎవడితో తిరుగుతున్నావు ఇన్నాళ్ళు?" అయన మితిమీరిన ఆవేశంతో మరోసారి చేయి ఎత్తబోతుంటే పద్మావతి చటుక్కున ముందుకు వచ్చి చెయ్యి పట్టుకుంది.
    "మతిపోతోందా ఏమిటి! ఈడోచ్చిన పిల్లని కొట్టడం ఏమిటి...."
    "నువు ముందు నోర్ముయ్! ఈడోచ్చిన పిల్లకనకే కొట్టడం. అడ్డమైన వెధవలతో తిరుగుతుంటే చూస్తూవుర్కొమంటావా? నువుముందు అవతలికెళ్ళు" భార్యని విసురుగా తోశారు.
    "హుకడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్తుంది. మీ అరుపులు కేకలు ఇరుగు పొరుగు వింటే నష్టపోయేదేమనమే! ఆవేశం పనికిరాదు ఇలాంటి వాటిల్లో మీరూరుకోండి, నేను అన్నీ అడుగుతాను" సర్ధబోయింది పద్మావతి.
    "ఆ ఇన్నాళ్ళు అడిగి చేసిన నిర్వాకం చాలు వుండు. ముందు ఈ సంగతి ఇవాళ తేలిపోవాలి. ఊ చెప్పు ఇన్నాళ్ళు నీవు తిరిగింది ఎవరితో? దాచాలని చూడకు నాకు తెల్సింది నిజం. అంతా చెప్పు" గొంతు తగ్గించి తీవ్రంగానే అడిగారాయన.
    రూపకి తల్లిదండ్రులకి సంగతి తెల్సిపోయిందన్నది అర్ధం కాగానే ఏదో మొండి ధైర్యం ప్రవేశించింది.ఆ టైపు ఇన్ స్టిట్యుట్ పంపించావు, అప్పటినుంచే దానికి తిరుగుడు బాగా అలవాటయింది...." కోపంగా  అన్నాడు.

    రూపకి తల్లిదండ్రులకి సంగతి తెల్సిపోయిందన్నది అర్ధం కాగానే ఏదో మొండి ధైర్యం ప్రవేశించింది.

 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS