Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 1

 

                                           69 సర్దార్ పటేల్ రోడ్
    
                                                                                    యర్రం శెట్టి శాయి.

 

                              

 

    69 సర్దార్ పటేల్ రోడ్ ఓల్డ్ సిటీకి, న్యూ సిటికీ మధ్యలో వుంది.
    ఆ రోడ్ కి అసలా పేరెందుకొచ్చిందో , ఎవరు పెట్టారో ఇవేమీ ఆ రోడ్ ని చుట్టుముట్టి కిక్కిరిసి పోయి కాపురాలు చేసుకుంటున్న జానభాకి తెలీదు.
    తెలుసుకోవాలన్న కోరిక కూడా వాళ్ళకు లేదు.
    డెత్ ట్రాన్స్ లాంటి కార్పోరేషన్ రోడ్లు, రోడ్ల మీద పిచ్చి కుక్కల్ని పెట్టి వ్యాన్ నిండా వేసుకెళ్ళే కార్పోరేషన్ వ్యాన్ లాంటి ఆర్టీసీ బస్ లూ- మాటికిమాటికి ఏదో పండగ పేరు చెప్పి కత్తి చూపించి నడిరోడ్ల మీద దందాలు వసూలు చేసే గుండాలూ, లంచాల కోసం మొత్తం దేశాన్ని అమ్మిపారేయగల ప్రభుత్వ యంత్రాంగం, బూతుని నడిరోడ్ల మీద విలయతాండవం చేయిస్తున్న తెలుగు సినిమాలూ, ఆ బూతునీ వయోలెన్స్ నీ శాయశక్తులా ప్రోత్సహిస్తూ, లక్షలకూ లక్షలు సబ్సిడీలు, టాక్స్ రిబెట్లు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాయిదాల పద్దతిలో పౌరులందరినీ కొరుక్కు తినేస్తున్న సొల్యుషన్.
    ఇవన్నీ సర్దార్ పటేల్ రోడ్ లో వున్న మిడిల్ క్లాస్ కుటుంబాలన్నీటినీ ఏనాడో బండరాళ్ళుగా మర్చేసినాయి.
    అంచేత వారె విషయాలు పట్టించుకోరు.
    "ఇన్ని సమాస్యల్తో మనం రోజంతా బ్రతికి ఉండగలమా?" అనేదే వారి సంశయం . అలాంటి రోడ్ లో అలంటి జనం మధ్య 69 నెంబర్ గల్ ఇంట్లో కాపురముంటున్నాడు రామచంద్ర మూర్తి.
    ఇక చదవండి.

                                              *    *    *    *

    చాలా పాతకాలం నాటి గ్రామ ఫోన్ అది.
    అందులో ఇంచుమించుగా ఆ గ్రామపోనంత పాత రికార్డ్ ఒకటి కొంచెం కీచు శబ్దంతో గిర్రున తిరుగుతోంది.
    అందులో నుంచి 'అందమే ఆనందం , ఆనందమే జీవిత మకరందం అనే ఘంటసాల పాట అలవాటు ప్రకారం రామచంద్రమూర్తి ఇంట్లోనే కాకా ఆ చుట్టూ పక్కల రెండు మూడు ఇళ్ళల్లోకి కూడా వీనుల విందుగా ప్రవహిస్తోంది.
    ఆ గ్రామ ఫోన్ పక్కనే పడకక్కుర్చీలో పడుకుని ఆనందంతో తన్మయత్వంతో పాట వింటున్నాడు రామచంద్ర మూర్తి. వక్కపొడి నమలటంతో పాటు ఆ పాట ప్రతిరోజూ ఎన్నోసార్లు వినటం కూడా వ్యసనమయిపోయిందతనికి.
    అతని హృదయం ఆ పాటలోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నా అతని మనసు మాత్రం ఉదయం నుంచీ చిరాకు కలిగిస్తోన్న క్రాస్ వర్డ్ పజిల్లో అయిదు నెంబర్ క్లూ దగ్గరే పజిల్ అయి నిలబడిపోయింది.
    రామచంద్రమూర్తికి యాభై రెండేళ్ళ వయసుంటుంది గాని 47 కంటే ఎక్కువ వుండవని వంట,మనిషి నటరాజ్ అభిప్రాయం.
    నటరాజ్ అతని కాళ్ళ దగ్గర కూర్చుని బ్రాకెట్ చార్ట్ లో ఆ రోజు వచ్చిన డబుల్ జీరో ఫిగర్ ఎందుకొచ్చింది , ఏ రూల్ ప్రకారం వచ్చింది అరా తీస్తున్నాడు.
    "అద్గదీ! చూశారా! రతన్ ఖాతిరి అల్లాటప్పాగా ఏం కొట్టలేదు డబుల్ జీరో. ఇదిగో యిలా చూడండి! రెన్నేల్ల క్రితం మొదటి వారంలో మంగళవారంనాడు డబుల్ జీరో కొట్టాడు. కిందటి నేలెం చేశాడో చూశారా ఇదిగో - రెండో వారంలో బుధవారం కొట్టాడు మళ్ళీ ఈసారి మూడో వారంలో గురువారం నాడు ఖచ్చితంగా మళ్ళీ అదే వదిలాడు" అన్నాడతను ఉత్సాహంగా.
    "ష్! పాటలు వింటున్నప్పుడు డిస్టర్బ్ చేయవద్దని లక్ష సార్లు చెప్పాను" చిరాగ్గా అన్నాడు రామచంద్రమూర్తి.
    "లక్షసార్లు కాదు గానీ రెండుసార్లు చెప్పారండీ."
    అప్పుడే సీత నీళ్ళ బిందె ఎత్తుకుని లోపలకు వస్తూండటం చూసి చప్పున చార్ట్ మడిచి జేబులో పెట్టేసుకున్నాడు.
    సీత వస్తూనే కోపంగా బిందె దించి గ్రామ ఫోన్ ఆపేసింది.
    "ఆ పాటలు వేస్తుంటే ఆ నటరాజు వళ్ళు మర్చిపోయి వంటంతా నాశనం చేస్తాడని చెప్పానా? ఒక టైమూ పాడూ లేదేమిటీ పాటలు వినటానికి?" కోపంగా అందామె.
    రామచంద్రమూర్తి సీత వేపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాడు.
    "ఆహా! నిజంగా నాకు మతిపోతోంది. నీ ఏజ్ నలబై మూడేళ్ళు అంటే ఎవడూ నమ్మడు. నిజం చెప్పు.....! కావాలని వయస్సు పదేళ్ళు ఎక్కువ చెబుతున్నావ్ కదూ?" అడిగాడు రామచంద్రమూర్తి.
    'అతనూహించిన విధంగానే సీత ముఖంలో కొంచెం తొట్రుపాటు, సిగ్గు కనిపించాయి. కావాలని అతను తనను పొగుడుతున్నాడెమో అన్న అనుమానం కలిగి, అంతలోనే చిరుకోపం కూడా వచ్చింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS