Next Page 
ఈ రేయి నీదోయి పేజి 1

 

                                      ఈ రేయి నీదోయి
    
                                                                                 --మేర్లపాక మురళి
    
                                  

 

   ఎపిలోగ్:
    
    అప్పుడు టైమ్ పదైంది.  

 

    రాత్రి బ్యాగ్ లో ఆ టౌన్ ను సర్ది వెన్నెల జిప్ వేసేసినట్టు చాలా భాగం చీకటిగా వుంది. అక్కడక్కడా మాత్రం వెలుగు చారికలు కనపడుతున్నాయి. వూరంతా తిరిగి, తిరిగి కాళ్ళు నొప్పిపెడుతున్నట్లు గాలి మెల్లగా వీస్తోంది.
    
    ఆమె వంటిల్లంతా సర్ది బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టింది.    

 

    ఆ అలికిడికి అటు తిరిగి పడుకున్న అతను ఇటుతల తిప్పాడు.
    
    లేత పసుపు పచ్చటి ట్రాన్స్ పరెంట్ నైటీలోంచి కనపడుతున్న ఆమె వంపు సొంపులు అతని కళ్ళలో మరో దృశ్యాన్ని అచ్చొత్తుతున్నాయి.
    
    ఆమె జుట్టు ముడివిప్పింది. వర్షం బరువుకి తాళలేని ఓ నీలం మబ్బుతునక ఒళ్ళు విరుచుకుంది. ఆమె తన కళ్ళను సాగదీసింది. కెరటాల ధాటికి ఏమరుపాటుతో ఒడ్డుకి కొట్టుకొచ్చిన రెండు చేప పిల్లలు తిరిగి నీట్లోకి వచ్చి పడ్డాయి. ఆమె ఎద కదిలేటట్టు ఆవుళించింది. పెద్ద కడవలలోని పెరుగును చిలగ్గా వచ్చిన వెన్న రెండు ముద్దలై పోయింది. ఆమె నడుం చిన్నగా కదిలింది. అంతవరకు విశాలంగా పరుచుకున్న నది సన్నటి పయలాగా చీలింది. బొడ్డు నీటి నైటీని తూటు పెట్టుకుని చూస్తోంది. గంగోత్రిలా నాలుగువైపుల నుండి వస్తున్న నీటి తాకిడికి ఎటూ పోలేని కాగితపు పడవ నిలిచిపోయింది.
    
    ఆ తర్వాత కిందకి దిగడానికి లైట్ షేడ్ అడ్డొస్తోంది అతనికి.
    
    పెర్ ఫ్యూమ్ కు బదులు సెక్సీతనాన్ని స్ప్రే చేసుకున్నట్టు మెరిసిపోతున్న ఆమె మెల్లగా నడిచి బెడ్ దగ్గరికి వచ్చింది.
    
    ఆమె అంత ఎగ్జయిటింగ్ గా వున్నా ఏమీ ఆసక్తి కలగకపోవడంతో అతను అటు తిరిగి పడుకున్నాడు. ఆమె ఇటు తిరిగి పడుకుంది.
    
    అంత అందమైన వాళ్ళు, వయసులో వున్నవాళ్ళు ఏం పనీ పాట లేకుండా అలా వుత్తిగానే పడుకోవడం మన్మథ దేవుడికి పూర్తిగా ఇష్టం లేకపోయింది.
    
    అందుకే అక్కడ ఠక్కున ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ మీద పూలబాణాలు వేసి తాపం రగిలించడానికి పూనుకున్నాడు.
    
    తన అంబుల పొదిలో వున్న అయిదు బాణాల్లో ఒకదాన్ని తీసి అతని మీదకి కొట్టాడు.
    
    ఆ దెబ్బకి అతను రెచ్చిపోతాడనుకున్నాడు కానీ విచిత్రంగా అతనిలో ఏ చలనమూ లేదు.
    
    మన్మధుడు ఆశ్చర్యపోయాడు.
    
    ఒక బాణం వేస్తేనే దేవతలు సైతం కోరికలతో రెచ్చిపోతారు. మరి ఇదేమిటి అతనిలో చిన్న కదలిక కూడా లేదు.
    
    రెండో బాణాన్ని వేశాడు.
    
    వూహూ అదీ పనిచేయలేదు. అటు తిరిగి పడుకున్న అతను ఆమె వైపు తలైనా తిప్పలేదు.
    
    మన్మధుడికి పంతం పెరిగింది. ఓటమిని ఒప్పుకోలేకపోతున్నాడు. అందుకే ఈసారి మూడో బాణాన్ని గురిపెట్టి గుండెమీద కొట్టాడు.
    
    ఆ మానవుడు ఎలా పడుకున్నాడో అలానే వున్నాడు.
    
    మన్మథుడికి దిక్కు తోచలేదు. తను గెలవాలన్న పట్టుదల పెరిగి పోయింది.
    
    నాలుగో బాణం, అయిదో బాణం వరుసగా విసిరాడు. ఫలితం లేదు.
    
    ఇప్పుడేమిటి చేయడం? వేయడానికి ఇక బాణాలు లేవు మరి. ఓటమితో కుంగిపోవడం కన్నా ఆత్మహత్య మేలు. అంతలో ఎవరో చేయి పట్టుకోవడంతో పక్కకి తిరిగి చూశాడు.
    
    రతీదేవి నవ్వుతూ నిలుచుని వుంది.
    
    "సరైన టైమ్ కి వచ్చావ్. లేకుంటే ఏమైపోయి వుండేవాడినో" అని మన్మథుడు జరిగినదంతా చెప్పాడు.
    
    రతీదేవి వేదాంతపు నవ్వు నవ్వి "నాకు తెలుసు ఇలా జరుగుతుందని, అందుకే హుటాహుటిన ఇక్కడికి వచ్చా"
    
    "నీకు తెలుసా?"  

 

    "తెలుసా అని మీరు అంత గట్టిగా అడిగితే తెలియదనే చెబుతాను. మొత్తానికి ఊహించాననుకోండి"
    
    "అదిసరేలే ఇప్పుడేమిటి చేయడం? జీవితంలో మొదటిసారి ఇలా మానవుల దగ్గర ఓడిపోవడం. ఎందుకీ విల్లు? ఎందుకీ బాణాలు?" అంటూ విసిరేయబోయాడు.
    
    "ఆగండి నాథా! తొందర పడకండి. ఇంకొక్క బాణం వేసి చూడండి"
    
    "మరో బాణమా? పరాచికాలాడుతున్నావా? నా దగ్గర వుండేది అయిదు బాణాలే గదా"
    
    "కొత్త బాణం వేయండి"
    
    "కొత్త బాణమా! అదెక్కడుంది?"
    
    "ఇదీ ఆ కొత్త బాణం" అని రతీదేవి రెండు చేతుల్నీ ముందుకు చాచింది కొత్త బాణం ఆమె చేతిలోకి వచ్చింది.  

 

    ఆశ్చర్యంతో అలా చూస్తున్నాడు మన్మథుడు.
    
    "ఇది ప్రయోగించండి"
    
    మన్మథుడు దానిని తీసుకోకుండా "ఏమిటది?" అని అడిగాడు.
    
    "కొత్తబాణం అని చెప్పాను గదా దీనికి బృహస్పతిని అడిగి పేరు పెట్టుకోండి. ప్రస్తుతానికి దీనిపేరు కొత్త సంబంధం".
    
    మన్మథుడికి ఏమీ అర్ధం కావడం లేదు. ఫ్లాట్ గా చూశాడు.
    
    రతీదేవి కాస్తంత విపులంగా చెప్పింది "వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అదే మంచం - అదే బెడ్- అదే పార్టనర్. ఏం మూడ్ వస్తుంది చెప్పండి? అందుకే మీరు అయిదు బాణాలు విసిరినా వాళ్ళలో కోరిక చెలరేగలేదు. కొత్త వ్యక్తితో ఇదే సంబంధం మొదలయ్యేలా చేసే ఈ బాణం వేసి చూడండి. తర్వాత విషయం మీకే తెలుస్తుంది"
    
    అంత గట్టిగా చెబుతున్న రతీదేవిని మన్మధుడు అడ్డుకోలేక పోయాడు నెమ్మదిగా ఆమె చేతుల్లోని బాణం తీసుకున్నాడు.
    
    తనను ఓటమి నుంచి కాపాడి, కొత్త బాణం అందిస్తున్న రతీదేవి వైపు మెచ్చుకోలుగా చూశాడు.
    
    'కొత్త సంబంధం' అనే ఆ కొత్త బాణాన్ని ఎక్కుపెట్టాడు.
    
    బాణం వేయబోయి అంతలో ఏదో అనుమానం వచ్చి రతీదేవి వైపు తిరిగి తీక్షణంగా అడిగాడు.
    
    "బెడ్ మీద కొత్త వ్యక్తితో అయితే అద్భుతంగా రియాక్ట్ అవుతారని నీకలా తెలుసు?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS