Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 1


                                      క్రాస్ రోడ్స్
    
                                                                     ---సూర్యదేవర రామ్ మోహనరావు
    
    
                             

 

       Every human being is both a criminal and a saint depending upon the expediency of the moment as to which will assert itself.
    
    The weak and the strong, the rich and the poor the ignorant and the well-informed are exchanging places continuously.
    
    Nothing is permanent except change. Life resembles a great Kaleidoscope before which time is ever shifting, changing and rearranging both the stage setting and the players.
    
    New friends are constantly replacing the old. Every thing is in a state of flux. In every heart is the seed of both rascality and justice.
    
    స్థలం : బొంబాయి మహానగరం...
    
    కాలం : రాత్రి పదకొండున్నర గంటలు...
    
    ఓల్క్స్ వేగన్ డి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకు పోతోంది.
    
    ఆ వ్యాన్ చుట్టూ కూలింగ్ గ్లాసెస్ పూర్తిగా పైకిలేపి వున్నాయి.
    
    ఆ వ్యాన్ లో ఎంతమంది ఉన్నది, ఆ ఉన్నవాళ్ళు ఎవరు అనేది బయట వాళ్ళకు తెలీదు.
    
    ఆ వ్యాన్ ప్రస్తుతం ఆర్.డి.హిందూజా నేధనల్ హాస్పిటల్ కేసి వెళ్తోంది.
    
    స్లమ్ ఏరియాస్, బిజీస్ట్రీట్స్, ఫ్యాషనబుల్ ఏరియాస్ దాటి వ్యాన్ దూసుకుపోతూనే వుంది.
    
    ఆ వ్యాన్ లో వున్న ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ మొదలయింది.
    
    "నువ్వు చెప్పిందాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను." అన్నాడో వ్యక్తి.
    
    రెండో వ్యక్తి కొద్దిక్షణాలు మౌనం తర్వాత.
    
    "ముందు నేనూ నమ్మలేకపోయను. కాని అంత ఖచ్చితంగా చెబుతున్నప్పుడు నమ్మలేకుంకా ఉండలేకపోతున్నాను. నాకు ఆ విషయాన్ని చెప్పిన వ్యక్తిపై గొప్ప నమ్మకముంది. అయినా ఓసారివిచారిస్తే పోతుందిగా...?" అన్నాడు.
    
    "కో... ఇన్సిడెంట్... యాదృచ్చికం... కొత్తేమీ కాదు... అయినా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాం.... ఈ మహానగరంలో నిన్ను ప్రత్యక్షంగా చూడనివాళ్ళు లక్షల్లో వుండవచ్చు. కానీ నీ గురించి తెలీని వాళ్ళు ఒక్కరున్నా ఆశ్చర్యమే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు హాస్పిటల్ లోకి ఎంటరయితే ఎవరికో ఒకరికైనా అనుమానం రాకుండా ఉంటుందా?"
    
    "రావచ్చు. నన్ను గుర్తు పట్టవచ్చు. దానికి అవసరమైన ఏర్పాట్లు ఈ వరకు చేసే ఉంటారు. డాక్టర్ పరబ్రహ్మం ఆ వార్డ్ కి చెందిన పాత రికార్డ్స్ ని సిద్దం చేసి ఉంచుతానని గంటక్రితమే ఫోన్ చేసి చెప్పాడు..."
    
    "ఆ రికార్డ్స్ చూస్తే మన డౌట్స్ క్లియర్ అవుతాయంటావా?...."
    
    "అన్నీ క్లియర్ కాకపోయినా కొంత విలువైన సమాచారం మన చేతికొస్తుంది. దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి."
    
    "తీరా ప్రొసీడ్ అయ్యాక ఆ వ్యక్తి దొరకకపోతే...? ఒకవేళ దొరికినా మనం భావిస్తున్నట్లుగానే ఉండకపోతే! మనం దారాన్ని కట్టి కొండను లాగే ప్రయత్నం చేస్తున్నామేమోననిపిస్తోంది."
    
    బొంబాయి...
    
    కరెన్సీ కట్టల స్థావరం...
    
    సంపద ఎంత వుందో...
    
    కాలుష్యం అంత వుంది...
    
    పని... పని.... పని... క్షణం తీరికలేని పనితో ఈ నగర ప్రజలు నిరంతరం శ్రమిస్తూనే వుంటారు.
    
    అపార వస్తుసంపదని సృష్టిస్తూనే వుంటారు.
    
    అప్పుడే ఏదో సైరన్ వినిపించింది.
    
    ఆ వెంటనే పుట్టపగిలి చీమలు బారుతీరినట్లు జనం రోడ్డుమీదకు వచ్చేస్తున్నారు.
    
    వ్యాన్ వేగం పెరిగింది.
    
    కాని మరికొద్ది నిమిషాలకే దాని వేగం మందగించింది.
    
    బొంబాయి నగరపు వీధులు నిద్రపోవు, విశ్రాంతి తీసుకోవు.... అది తెలిసే ఆ వ్యాన్ షెడ్యూల్ టైమ్ కన్నా ఇరవై నిమిషాల ముందే బయలుదేరింది.
    
    నగరానికి మరోవైపు...
    
    ది అదర్ సైడ్ ఆఫ్ ది ఇండియన్ మాన్ చెష్టర్...
    
    రౌడీలు...
    
    గూండాలు...
    
    పీకలుకోసే నరహంతకులు.... మాఫియా ముఠాల ప్రమాదకరమైన కదలికలు... అనుక్షణం అక్కడ కనిపిస్తూనే వుంటాయి.
    
    ఎక్కడో దుబాయ్ లో ఉన్న దావూద్ ఇబ్రహీం ప్రాణాంతకమైన ఆలోచనలక్కడ ఊపిరి పోసుకుంటుంటాయి.
    
    స్టేన్ లీహో తరహా జూదం అక్కడ కరాళ నృత్యం చేస్తుంటుంది.
    
    సర్ జాన్ హార్వే జోన్స్ తరహా డైనమిజమ్ కూడా అక్కడే కోట్లాది సొమ్మును ప్రోగేసుకుంటుంది.
    
    అప్పుడా అర్ధరాత్రి సయితం బొంబాయి నగర రహదారుల్ని మూసేసిన ఆ జనప్రవాహంలో అలాంటి వారు ఎందరున్నారో.... వాళ్ళు ఎవరో ఎవరికీ తెలీదు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS