Next Page 
సృష్టి పేజి 1


                                                 సృష్టి
                                                    -సూర్యదేవర రామ్ మోహనరావు

 

                                

 

    In our ordinary experience. colors are not simply what they are to the eyes; they are associated with sensations or memories pleasnt or unpleasant, red with blood, blue with the sky, yellow with sunlight and summer, black with morning and gray with autumn or with gloom.

 

    A painting is not a design in spots, meant merely to out do a sunset, it is a richer dream of experience meant to out shine the reality.


                
                                                                                                       -IR WINEDMAN

 

    మద్రాసుకు దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న  పాండిచ్చేరికి రెండు మైళ్ళ దూరంలో వుంది ఆరియన్ కుప్పం బీచ్.

 

    ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

 

    పసుపూ, ఎరుపూ రంగులు పులుముకున్న ఆకాశం ముత్తయిదువ నుదురులా ముచ్చటగా వుంది.

 

    చిన్న చిన్న అలల్తో, కదుల్తున్న సముద్రం నీలిరంగు నేత చీరలా వుంది. గోధుమరంగు ఇసక తిన్నెలు, పెద్ద పెద్ద  రాళ్ళు, ఆ రాళ్ళకు కొంచెం దూరంలో మట్టి రోడ్డు, దానికటూ ఇటూ కొబ్బరి చెట్లు బహమాన్ ఎట్మాస్ ఫియర్.

 

    సమీపంలో ఉన్న కొండల మీంచి వస్తున్న చల్లని గాలి - ఇసకలో కూర్చుని సముద్రం వైపే చూస్తున్నాడు అభినవ్. ఉంగరాల జుత్తు కోలముఖం- సూదిముక్కు- ఎప్పుడూ ఆలోచనలో నిమగ్నమయ్యే కళ్ళు  చిన్న పెదాలు- వత్తుగా మీసం- పల్చటి గెడ్డం.

 

    పాతికేళ్ళ అభినవ్ తెల్లటి పాల ఛాయలో నిగనిగమని  మెరిసి పోతున్నాడు. ఏదో మాటల శబ్దానికి తల తిప్పి చూశాడు.

 

    ఎడం చేతుల్లో తట్టలు, కుడిచేతుల్లో వలలతో జాలరి  వనితలు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు.

 

    వారం రోజులుగా అదే దృశ్యాన్ని అదే సమయంలో చూస్తున్నాడు అభినవ్.

 

    గట్టు మీద నుంచొని, సముద్రంలోకి వలల్ని విసురుతున్నారు జాలరి వనితలు...... ఆ విసురులో హోయలు, నల్లటి వంటి మీద పేరుకుంటున్న చెమట- వంపులు తిరుగుతున్న శరీరం.

 

    సన్నటి  సూర్యకిరణాలు, ఆ వంటి మీద పడి మిలమిల మెరుస్తున్నాయి. అభినవే-

 

    తన పక్కనే ఇసుకలో ఉన్న చేతిసంచి తీసుకుని, అందులో ఫోల్డ్ చేసి ఉన్న ప్లాస్టిక్ ఈజిల్ ను బయటకు, తీసి, ఇసకలో ఫిక్స్ చేశాడు. ఫ్రేమ్. నిండుగా కేన్వాస్ ని చేసి కుంచెను, కలర్స్ ప్లేట్ ను అందుకున్నాడు.

 

    జాలరి వనితల్లో ఒక వనితవైపు చూస్తూ కుంచెను రంగుల్లో అద్దడం ప్రారంభించాడు.

 

    ఎండ నెమ్మదిగా పెరుగుతోంది. అరవై నిమిషాలు గడిచాయి. సముద్రంలోకి వలను విసురుతున్న జాలరి అమ్మాయి - స్కెచ్  పూర్తి అయింది.

 

    ఏదో వేయ్యాలని  వేస్తున్నాడు తప్ప. అతనికేదో అసంతృప్తిగా వుంది. మరో ఇరవై నిమిషాలు గడిచాయి.

 

    జాలరి అమ్మాయిలు అక్కడ నుంచి ముందుకు నడుస్తున్నారు.

 

    తను వేసిన స్కెచ్ వైపు, వెళ్ళిపోతున్న వాళ్ళల్లో ఒకమ్మాయి వైపు తదేకంగా చూస్తున్నాడు అభినవ్.

 

    ప్రతి కళ్ళకూ గొప్ప ప్రేరణ కావాలి.

 

    ఆ ప్రేరణ కోసమే గింజుకుంటున్నాడు అభినవ్.

 

    వాతావరణం క్రమంగా వేడెక్కడం ప్రారంభమైంది. కేన్వాస్ ని, ఈజిల్ ని, సరంజామానీ తీసి బేగ్ లో పెట్టేశాడు. బీచ్ లోంచి బయటికొచ్చి నడవడం ప్రారంభించాడు.

 

    ఆ సమయంలో అతనొక చిత్రకారుడులా లేడు. జీవితంలో పూర్తిగా ఓడిపోయిన వాడిలా వున్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి వెళుతున్న వాడిలా ఉన్నాడు. ఊళ్ళోకి రావడానికి సరిగ్గా నలభై నిమిషాలు పట్టింది.

 

    పోస్టాఫీసు పక్కనున్న పాతకాలంనాటి హోటల్లోకి అడుగుపెట్టాడు. రూమ్ లోకి అడుగుపెట్టాడో లేదో ఫోన్ మోగింది. యాంత్రికంగా రిసీవర్ అందుకున్నాడు.

 

    "హలో..... అభీ హియర్...."

 

    "హలో.... అభీ.... నేనూ..... మధురీ దీక్షిత్ ని..... బొంబాయి నుంచి...." ఆ గొంతు  గమ్మత్తుగా వుంది.

 

    మాధురీదీక్షిత్. అలాంటి అమ్మాయెవరూ అభినవ్ కి   తెలీదు. బొంబాయిలో అభినవ్ అసలు  స్నేహితులు లేరు.

 

    "సారీ! జ్ఞాపకం రావడం లేదు" బుర్ర గోక్కుంటూ అన్నాడు అభినవ్. రిసీవర్లోంచి అందమైన నవ్వు విన్పించింది.

 

    "పోనీ ప్రియాంక. ప్రియాంక గాంధీ అంటే జ్ఞాపకం వస్తుందా?"

 

    ప్రియాంకా గాంధీ..... ఆ పేరెక్కడో విన్నాడు తను. కానీ సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు. ఆ పేరునిఎక్కడ విన్నాడో సీరియస్ద్ గా ఆలోచించడం మొదలెట్టాడు అభినవ్.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS