Home » kommanapalli ganapathi rao » Grand Mastar
ఆమెను బలవంతంగా లోనికినెట్టిన బైక్ వాలా దుండగులతో పోరాటానికన్నట్టు ఉద్విగ్నంగా బయటకు నడిచాడు...
"పిచ్చితల్లి... అలసిపోయినట్టున్నావు" గెస్టుహౌస్ గూర్ఖా ఆత్మీయతగా పలకరించాడు "ఈ మంచినీళ్ళు తాగు..."
ఆమె కాదనలేదు...
తాగింది అక్కడ అదో సాంప్రదాయమని తెలీనిదానిలా.
తాగుతుంటే అదోలా వుంది.
తాగేక మరింత మత్తుగా అనిపించింది.
"ఏదో అవుతున్నట్టుగా వుంది" గొణుగుతుందామె.
ఎవరో నవ్విన చప్పుడు...
అదికాదు... తననెవరో మోసుకువెళుతున్న అనుభూతి...
మగతలోనే గ్రహించింది.
తనను వివస్త్రని చేస్తున్నారు.
శరీరంపై ఏదో బరువు.
ప్రతిఘటించాలని విశ్వప్రయత్నంచేస్తూ బడలికగా కళ్ళు తెరిచింది నలిగిపోయాక...
"ఎ... వ... రు" అడిగింది నిశితంగా పరిశీలిస్తూ... ...
"మ... హేంద్ర... ..."
"అంటే... ..."
"ఈ దేశ ఉపప్రధాని కొడుకు..."
"థేంక్యూ..."
ఉలిక్కిపడ్డాడు మహేంద్ర.
అంతకాలం తన పేరు చెప్పినాకాని, తన స్థాయి వివరించినాగాని నిస్సత్తువుగా ప్రతిఘటించే అమ్మాయిల్నే చూసాడు తప్ప యింత పాజిటివ్ గా రియాక్ట్ అయిన తొలి వ్యక్తి ఈమె.
అలసటగా ఆమెపై నుండి లేచాడు "ఆశ్చర్యంగావుంది"
"నీరసంగా నవ్వింది"
"ఇక్కడ మొదలైన మన పరిచయం నా బోణీ తర్వాత బ్లూ ఫిలింస్ లో నటించేదాకా వెళుతుంది..."
"అలాగా... ..."
"ఈ సన్నివేశాన్ని ఫోటోలా చూపించి బెదిరించి అమ్మాయిల్ని అదుపుచేయడం నాకు అలవాటు... యిక్కడ ఆనవాయితీ కూడా..."
"నా విషయంలో అంత శ్రమ అవసరంలేదు"
"అదేం... ..."
"నాకు యిప్పటికే బ్లూఫిలింస్ లో నటించిన అనుభవం వుంది కాబట్టి..."
"వ్వాట్" తేరుకోలేకపోయాడు మహేంద్ర... "అంటే... నువ్వు యూనివర్సిటీ స్టూడెంటువికాదూ..."
"కాకుండా మీరు తీసుకురారుగా"
ట్రాంక్విలైజర్సు కలిపిన మంచినీళ్ళు తాగేకకూడా ఆమె నిద్రపోకుండా మామూలుగా మాటాడటమేకాదు తను యూనివర్సిటీ స్టూడెంటు అయ్యుండీ అప్పటికే బ్లూఫిలిం అనుభవం వుందంటుంటే బోలెడంత ఆశ్చర్యంగా వుంది.
"నిన్నెప్పుడూ చూసినట్టులేదు" సాలోచనగా అన్నాడు మరోసారి ఆమెను దగ్గరకు తీసుకుంటూ.
"మరోసారితో అర్థమవుతుంది"
"ఏమని..."
"నేను జీవితాంతం గుర్తుంచుకోదగ్గ ఆడపిల్లనని"
"అద్భుతం..." ఉన్మాదిలా ఆమెను పెనవేసుకుపోయాడు. "నిజమే. నువ్వు అరుదయిన ఆడపిల్లవి."
అలసటగా లేచింది ఆ తర్వాత.
బయటకు వెళ్ళబోతుంటే డబ్బందించాడు.
"థాంక్యూ" అంది లెక్క పెట్టుకోకుండానే "మళ్ళీ ఎప్పుడు రావాలి"
"కబురు పెట్టిస్తాను"
"అడ్రసు కావాలా"
"ఉంటే బెటర్"
"తరచూ నేనే వస్తుంటాను మహేంద్రా... బై"
మహేంద్ర నిర్విణ్ణుడై చూస్తుండగానే ఆమె వెళ్ళిపోయింది.
నిజమే...
అమ్మాయిలతో అపారమైన అనుభవంగల మహేంద్రకి యిలాంటి అమ్మాయి తారసపడటం తొలిసారి.
అంతేకాదు...
ఇంతకాలం నిర్విఘ్నంగా అమ్మాయిల్ని, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థినుల్ని ట్రేప్ చేయగలుగుతున్నానుకున్న మహేంద్ర తొలిసారి తను ట్రేప్ చేయబడ్డాడు ఆమె ద్వారా.
నిజానికి ఆమె యూనివర్సిటీ విద్యార్థిని కాదు.
అలా నటించి వారి వలయంలో అడుగుపెట్టిన అమ్మాయి...
'తప్పుచేసింది ఒకరయితే శిక్ష మరొకరికి కాకూడదు' అని చెప్పిన శ్రీహర్ష ఉద్బోధతో ప్రేరణ పొందిన యువతి.
ఎయిడ్స్ వ్యాధితో మృత్యువుకి దగ్గరవుతున్న సుజాత...
* * *
మృత్యువులా ముసుగేసిన చీకటి...
రాత్రి పదిగంటలవేళ నగరం నిద్రకుపక్రమిస్తుంది.
విశాఖపట్టణం నడిబొడ్డున వున్న ఓ భవంతిలో రాజీవ్ ఆసక్తిగా క్షణాల్ని గడుపుతున్నాడు.
మరో పదిహేను నిముషాలలో వస్తున్నట్టు రేష్మి అరగంట క్రితమే ఫోన్ చేసింది.
డబ్బుకూడా సిద్ధం చేసాడు రాజీవ్.
అతడు రేష్మినుంచి కోరుతున్నది ఒక్క రాత్రి అనుభవం కాదు. చాలారోజుల సాహచర్యం. కాబట్టే ఆమె అడిగిన డబ్బు యివ్వటానికి నిర్ణయించుకున్నాడు.



