Home » Sree Sree » Sri Sri Mana Sangeetam
ఓ మహాకవీ
కానూరి వెంకటేశ్వరరావు
ఓ మహాకవీ-
మా మహాకవీ
సామ్యవాద మహాకవీ-
శ్రామిక జనతాకవీ
నీ సాహితి క్రాంతి రథం-
నీ సంస్కృతి కాంతి పథం
నీ ధ్యేయం సోషలిజం-
అదే రేపు నిజం నిజం
నీ కవితా ఝంకారం-
ఆకలి రణ సంకేతం
నీ గీతా ప్రభంజనం-
ఆగమ యుగ సందేశం
జనసాహితీ కృతి కర్త-
యుగ సాహితి నిర్ణేత
నీ మార్గం అజేయం-
నీ సంహిత సజీవం
తెలుగు జాతి వెలుగు రేఖ-
మహాకవి శ్రీశ్రీ
అరుణారుణ జోహార్లు-
అమర కవి శ్రీశ్రీ
(అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య శ్రీశ్రీ బులెటిన్-1, 2007)



