Home » Lalladevi » Ardha Manavudu                       అర్ధ మానవుడు
    
                                                                   ---లల్లాదేవి

                
    

    శ్వేతకిరీటం ధరించిన భూదేవి శిరస్సులా ధగధగ లాడుతోంది హిమాలయ పర్వత శ్రేణి! అరుణరుణ రవి బింబం అల్లన వాలుతోంది. మబ్బు తునకలు వియత్తలానదోగాడుతున్నాయి.
    అది సాయంత్ర సంధ్య! సరిగ్గా ఆరుగంటల ఐదు నిమిషాల ముఫ్ఫై రెండు సెకన్లు అయింది. మరొక్కమూడు నిమిషాలకు రవి బింబం పశ్చిమానికి దిగిపోతుంది. సుందర తరమయిన ప్రకృతి దృశ్యాలకు మనసు ఉల్లసితమవుతోంది.
    కాని శీతలగాలులు వెన్నులోంచి వొణుకు పుట్టిస్తున్నాయి. దూరతీరాల దృశ్యాలు చీకటి ముసుగులో దూరి పోతున్నాయి.
    తెల్లని మబ్బులు గిరి శృంగాలను కౌగలించుకుంటున్నాయి. మల్లెలు పరచినట్టుగా మంచునిండిన కొండ దారులు కన్పిస్తున్నాయి.
    పర్వతారోహక బృందాలకు అవి మల్లెలుపరచిన దారులుకావు. కఠిన తరమయిన పరీక్షా మార్గాలు. అడుగు ముందుకు కదపాలంటే అంతులేని అనుమానాలు వెన్నాడుతాయి. రాత్రి ప్రొద్దు ప్ర్రారంభమయిందంటే గుండెలు జలదరిస్తాయి.
    పర్వతాలను, ముఖ్యంగా మంచునిండిన పర్వతాలను ఎక్కేవారికి ప్రతిరాత్రీ ఒక అగ్ని పరీక్ష! వాతావరణం సున్నా డిగ్రీలకు ఎంత క్రిందికి దిగజారిపోతుందో తెలియదు. ఏ క్షణాన మంచు తుఫాను ఆరంభమవుతుందో అర్ధం కాదు.!
    అందులోనించి రానున్న భయంకరమయిన క్షణాలను స్మరిస్తూ జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తోంది.
    ఆమె వయసు యిరవై ఒకటి. పేరు మాలతి బి.ఎస్.సి. ఆయింతరువాత డార్జిలింగ్ లో మౌంటెనీరింగ్ కళాశాలలో ప్రవీణురాలయింది.
    ఆమె అడుగుజాడల్ని అనుసరిస్తున్న వారు తొమ్మండుగురు. వారంతా దిగిపోతున్న రవిబింబాన్ని దిగులుగా చూస్తున్నారు. వీపులమీద వ్రేలాడుతున్న కిట్ లను సవరించుకుంటున్నారు. బూట్లక్రింద కర కర శబ్దాలను వింటున్నారు. మంచు ముక్కలు పగులుతున్న మ్రోత అది: రవి బింబం పూర్తిగా కృంగిపోయింది.
    మరొక్క అయిదు నిమిషాలపాటు అడుగులు ముందుకు కదిల్చి అక్కడ ఆగిపోయింది. బృందానికి నాయకు రాలయిన మాలతి. మిగిలిన వారంతా నిలిచిపోయి చుట్టూ కలియ చూచినారు.
    అది చదును అయిన ప్రదేశం! గుడారాలు నిర్మించుకునేందుకు అనుకూలమయిన చోటు "కిట్" లను కిందికి దింపేసి రాళ్ళ మధ్య పడివున్న మంచు మంచుముక్కలను ఏరిపారేశారు. రాళ్ళమధ్య మెత్తని ప్రదేశంలో ఇనుప ఊచల్ని దింపి క్షణాలమీద "టెంట్" తయారుచేశారు. చలిగాలి తాకిడినించి రవంత విముక్తి కలిగినట్లు అయింది.
    ఈ పని పూర్తిఅయ్యేలోగా మరొకరు ష్టవ్ వెలిగించి టీ తయారుచేశారు. వేడి తేనీరు రవ్వంత గొంతు జారాక ప్రాణం లేచివచ్చినట్లు అయింది. అప్పటికిగాని నోరువిప్పి మాట్లాడాలని ఎవరికీ అన్పించలేదు.
    "ఈ రోజు రెండు కిలోమీటర్ల కు పైన రెండు వందల అరవై మీటర్లు పయనించాం" అన్నది మాలతి ష్టన్ వెలుతురులో ముందు పరచుకున్న మ్యాప్ ని చూస్తూ!
    "యిలా పెళ్ళి పడకలు, నడిస్తే మనం మరొక మూడు రోజులయినా శిఖరాన్ని చేరగలమా" అని ప్రశ్నించాడు సిన్హా! అతడుట్టి పిరికిగొడ్డు!
    మూడు రోజులుగా పరీక్షిస్తున్నా సిన్హా మౌంటె నీరింగ్ లో ఎలా వ్రేశం సంపాదించ గలిగాడో అర్ధం కాలేదు మాలతికి.
    సిన్హా అలా అనటంతో మిగిలిన వారిలో కొందరికి, విజమ! మరొకమూడు రాత్రులు, తిరిగివచ్చేందుకు ఆరు రాత్రులు మొత్తం తొమ్మిది రాత్రులు గడపటం దుస్సా హసమ్!" అనిపించింది.
    సాధారణంగా పర్వతారోహణకు సాహసికులయిన వారే వస్తారు ఒక్కొక్కప్పుడు అందుకు భిన్నంగా జరిగే అవకాశం లేకపోలేదు.
    వారు చేసే సాహసం అత్యంత విచక్షణతో కూడు కున్నది అయివుండాలి. అంతేకాని అనాలోచిత మయిన దుస్సాహసాలు ప్రాణాంతకరంగా పరిణమించుతాయి. ఈ ఆలోచనతో మరికొందరి గుండెలు పిరికి చెందాయి.
    మాలతి ఆమాట అన్న సిన్హావంక చురుకున చూచింది. అతడు అభిప్రాయం మార్చుకోలేదు కాని సూదుల్లా గుచ్చుకుంటున్న ఆ చూపుల్నించి తప్పుకునేందుకు తలదించుకున్నాడు. ఇటువంటి సమయంలో పిరికి మందుతిన్న మాటలు "టిమ్" ను దిగజార్చుతాయి.
    చెప్తే ధైర్యం చెప్పాలి. లేదా నోరు కదపరాదు ఈ సూత్రానికి భిన్నంగా ప్రవర్తించాడు సిన్హా. ఆమెకు కోపం వచ్చింది. కాని రవంత అయినా దాన్ని బయలుపరచలేదు. మనసు లోలోపలే దాచుకుంది.
    "మిష్టర్ సిన్హా! జాలి గర్వించదగిన సాహసోపేత మయిన విద్య మౌంట్ నీరింగ్. అందులో ఉండేవారికి ఎంత తెగింపు కావాలో అంత సమయస్ఫూర్తి కావాలి. ఎంత విచక్షణ ఉండాలో అంత గుండె దిటవుకూడ ఉండాలి.
Related Novels


Kalaniki Nilichina Katha

Kougitlo Krishnamma

Black Tiger

Ardha Manavudu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.