Home » Kartika Maha Puranam  » తొమ్మిదవరోజు పారాయణము సప్తదశాధ్యాయము


తొమ్మిదవరోజు పారాయణము

సప్తదశాధ్యాయము

 

 

పూర్వోక్త ఉద్బూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తూన్నాడు. నాయనా! ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను_ శ్రద్దగా విను.

ఉద్బూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ.శ్లో ||     కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యంకారణ మేవ చ
స్థూల సూక్షం తథా ద్వంద్వ సంబంథో దేహాముచ్చతే ||కర్మబంధము, ముక్తికార్యము, కారణము __ స్థూలసూక్ష్మము, ఈ ద్వంద్వ  సంబందితమే, దేహ మనబడుతూంది.శ్లో '||     అత్రబ్రూమ స్సమాధానం కోన్యోజీవస్త్వ మేవహి
 స్వయం వృచ్చ సీమాంకో2హంబ్రహ్మైవాస్మి న సంశయ:''జీవుడంటే వేరెవరూ కాదు, నీవే అప్పుడు నేనెవర్ని? అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే "నేనే బ్రాహ్మనై వున్నాను. ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. 

పురుషఉవాచ: 'అంగీరాసా! నువ్వు చెప్పిన వాక్యార్ద జ్ఞానము నాకు తట్టడం లేదు, నేనే "బ్రహ్మను" అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్ధమును గురించి తెలిసివుండాలి గదా! ఆ పదార్ధ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు __ మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను."

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 అంగీరస ఉవాచ : అంతఃకరణానికీ, తద్వ్యాపారాలకీ, బుద్ధికీ సాక్షి __సత్, చిత్ ఆనందరూపీ అయిన పదార్ధమే ఆత్మ అని తెలిసికొనుము. దేహము కుండవలె రూపాదివత్ గా వున్న పిండ శేషమూ __ అకాశాది పంచభూతముల వలన పుట్టినదీ అయిన కారణముగా __ ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప __'ఆత్మమాత్రము కాదు. ఇదేవిధముగా ఇంద్రియాలుగాని, అగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణముగాని __ ఇవేమి కూడా 'ఆత్మ' కాదు __ అని తెలుసుకో, దేనివలననైతే దేహింద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే 'ఆత్మగ' తెలిసికొని __ ఆ "ఆత్మపదార్ధమే నేనై వున్నాను" అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాలచేత __ ఆకర్షింపబడకండా __ ఇనుమును తానాకర్షింస్తుందో __ అదే విధంగా __ తాను నిర్వికారియై- బుద్ధ్యాదులను సైతము చలింప చేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన 'నేను' గా గుర్తించు . దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహింద్రియ మనః ప్రాణులు భాసమానలౌతున్నాయో __ అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికార్తమై __ నిద్రాజాగ్రత్ స్వప్నాదులనూ, వాటి  అద్వంతాలనూగ్రహింస్తున్నదో అదే  నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింప చేసే దీపం ఘటితమైనట్ట్లే __ దేహతరమై 'నే' నబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమనాలవుతాయి.

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 

సమస్తమూ పట్లా ఏర్మడుతూండే అనుహ్, అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో, దేహింద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనదీ __ జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ, పారినామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానివే ఆత్మగా __ అదే నీవుగా ఆ నీవే నేనుగా __ నేనే నీవుగా త్వమేవాహం' గా భావించు ఈ విధంగా "త్వం" (నీవు అనే తచ్చబ్డార్దాన్నీ పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విదిముఖంగా తచ్చబ్డార్దాన్నీ గ్రహించాలి ('తత్' శబ్దానికి 'బ్రహ్మ' అని అర్దము ).


శ్లో ||     అతద్వ్యవృత్తిరూపేణ సాక్షాద్విధి ముఖేన చ
వేదాంతానం ప్రవృత్తి : ద్విరాచార్య సుభాషితమ్ ||

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 


'అతః' శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచమని 'అర్ధం. వ్యావృత్తి' అంటే _ ఇది కాదు __ ఇదీ కాదు __ (నేతి_న + ఇతి, న + ఇతి = ఇదీకాదు ) అనుకుంటూ ఒకటోకటిగా ప్రతిదానినీ కొట్టిపారవేయడం _ అంటే, ఈ చెయ్యి "బ్రహ్మ (ఆత్మ)"కాదు ఈ కాలు 'ఆత్మ (బ్రహ్మ)' కాదు. అనుకుంటూ _ ఇది కాకపోతే మరి 'అది' ఏది ? అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే 'బ్రహ్ మ' (ఆత్మ) అని అర్ధం _ ఇక సాక్షా ద్విదిముఖాత్ అంటే _ 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ' అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, అన్మ్డాలవల్లనే __ 'ఆత్మ' నరయగలగాలాని అర్దము ఆ 'ఆత్మ' సంసార లక్షణా వేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టిగోచరము కాడనీ, చీకటిని ఎరుగనిడానీ __ లేదా __ చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమనీ, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ __ పూర్వోక్త సాధనల వలన తెలుస్కుకో. అబ్బాయీ ! దేనినైతే 'సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం' గా వేదాలు కేర్తిస్తున్నాయో __ అ బ్రహ్మ "నేనే" నని గుర్తించు . ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతయో _ అదే ఆత్మ. అదే నువ్వు. అదే నేను. "తదనుప్రవశ్య" ఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ర్పవేశామూ __ ప్రవేశిత జీవులను గురించిన నియమతృత్యము  __ కర్మ ఫలద్రత్వమూ _సర్వజీవ కారణ కర్తృత్వమూ __ దేనికైతే చెప్పబడుతూ వుందో _ అదో 'బ్రహ్మ' గా  తెలుసుకో. "తత్ త్త్వమసి" = తత్' అంటే బ్రహ్మ, లేదా ఆత్మ __ త్వం అంటే నువ్వే __ అనగా నువ్వే __ అనగా పరబ్రహ్మమని అర్ధం.

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 

ఓ జిజ్ఞాసూ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మ. ఆ పరమాత్మ __ ఈ ప్రకారమైన తాదాత్మ్రత ఏనాడు సిద్దిస్తుందో __ అప్పుడు మాత్రమె 'తత్' శబ్దార్డం తానేనని, 'త్వం శబ్దము సాధనమే గాని ఇతరం గాదనీ టెలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్ధమవడం  కోసం చెబుతున్నాను విను. తత్వమసి = తత్ + త్వం + అసి. ఈ వాక్యానికి అర్ధం తాదాత్మ్వము అనే చెప్పాలి . ఇందులో వాక్యారదాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టలైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి __ లక్ష్యార్దాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే 'తాదాత్మ్యము' సిద్దిస్తుంది. ( ముఖ్యారధ వేదా కలిగితే లక్షణావృత్తి నాసరయించాలి. అందులో 'బాగా లక్షణ, అనే దాని వలన ఇది కలిగితే సాదింపబడుతూ వుంది ( ఉదా '' సో 2యం దేవదత్త: అత్మసంపన్న: )  'అహం బ్రహ్మ2స్మ' అనే వాక్యారధ బోధ స్థిరపడే వరకూ కూడా షమదమాది సాధన సంపత్తితో __ శ్రవణమనదికాలను ఆచరించాలి.

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

ఎప్పుడైతే శ్రుతివల్లనో, గురు కటక్షము వల్లనో తదాత్మ్యబోధ స్థిరపాడుతుందో, అప్పుడీ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంత కాలము ప్రరబడకర్మ పిడీస్తూనే వుంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని  చేరతాము. దానినే ముక్తి __ మోక్షము అంటారు. అందువల్ల, ముందుగా చిత్తశుద్ది కోసం కర్మిష్టులుగా వుండి, తత్సలాన్ని దైవర్పణము చేస్తూండడంవలన __ ప్రారబ్డాన్ననుసరించి ఆ జన్మలోనే గాని, లేదా __ ప్రారబ్ద కర్మ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాసపరులై , జ్ఞానులై, కర్మబంధాల్ని త్రేంచుకుని ముక్తులవుతారు __ 'నాయనా! బంధించెవి __ ఫలవాంచిత కత్మలు. ముక్తినిచ్చేవి __ ఫలపరి త్యాగ కర్మలు" అని ఆపాడు అంగీరసుడు.

 

సప్తదశాధ్యాయ స్సమాప్తః (పదునేడవ అధ్యాయము )

అష్టాదశధ్యాయము

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 


అంగీరసుడు చెప్పింది వినిన __ ఉద్బూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో __
అంగీరసుడిలా చెబుతూన్నాడు : చక్కటి విషయాన్ని అడిగావు __ శ్రద్దగా విను. సుఖ దు:ఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని, తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి, తద్వారా చిట్టాశుద్దిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహాధారియైన వాడి తన వర్ణాశ్రమ విద్యుక్తాలయిన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసితీరాలి.

 

 శ్లో||     స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్దవత్
ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్రం చ శృతిచోదితమ్ ||స్నానము చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే __ ఏనుగు తినిన వేలగపండులా నిష్పలమే అవుతుంది. అందునా __ బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై వుంది.శ్లో ||    ప్రాతస్స్నానే హయశక్తశ్చే త్పణ్యమాసత్రయోత్రయోతతమం
తులాసంస్థ  దినకరే కార్తిక్యాంతు మహామతే||
మకరస్థ రవౌ మాఘే వైశాఖే మేషగే రవౌ|      

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 

ప్రతిరోజునా ప్రాతః స్నానం చెయ్యలేని వాళ్లు __ సూర్యసంచారము కల తులా __ కార్తీక మకర __మాఘ మేష __ వైశాఖాలలోనైనా __ చెయ్యాలి . జీవితంలో ఈ మూడు మాసలైన ప్రాతః స్నానాలు చేసే వాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలోగాని, చంద్ర సూర్యగ్రహణ పర్వలలోగాని  __ స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో __ గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు __ స్నాన సంధ్యా, జప, హొమ, సూర్యానమస్కారాలు తప్పనిసరిగా చేయవలసివున్నాయి . స్నానాన్ని వదలిన వాడు రౌరవ నరకగతుడై __ పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా!  పుణ్య కాలాలన్నింటా సర్వోత్తమమైనదీ కార్తీకమాసము. వేదాన్ని మించిన శాస్రము,  గంగను మించిన తీర్ధము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు __ లేనట్ట్లుగానే కార్తీకమాసములో సమానమైన పుణ్యకాలము గాని, కార్తీక దామోదరునీకన్నా దైవముగాని లేడని గుర్తించు, కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకమాసములో ధర్మాన్ని  ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు.

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 

నాయనా! విష్ణువు __  లక్ష్మిసమేతుడై ఆషాడశుక్ల దశమ్యంతంలో __ పల సముద్రాన్ని చేరి నిద్రా మిషతో శయనిస్తాడు . పునః హరిబోదినీ అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిదురలేస్తాడు. ఈ నడుమ నలుగు మాసాలనే చాతుర్మాస్య (వ్రతము) అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలూ కూడా ఎవరైతే హరి ధ్యానమును, పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహసనాన్ని అలంకరించి ఉండగా __ నారదుడక్కడకు వెళ్ళి వారికి మ్రొక్కి __    'హేశ్రీహరీ ! భూలోకంలో వేదవిధులు అడుగుంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్యసుఖాలను లోని పోతున్నారు. ప్రజలంతా వికర్ములై వున్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక విశ్వసించిన నారాయణుడు, సతీసమేతుడై, వృద్ద బ్రాహ్మణ  రూపాధారియై తీర్దక్షేత్రాదులలోనూ, బ్రాహ్మణ పరిషత్పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరా ఆ దంపతలకు అతిధి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మినారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు. కొందరు అభాక్ష్యలను పాపాచరణులనీ చూచిన శ్రీహరి ప్రజోద్దరణ చింతనా మానసుడై __ చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యధారూపాన్ని పొంది వుండగా __ జ్ఞాన సిద్దుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని నారాధించాడు. అనేక విధాలుగా సుత్తించాడు.

ఏవం శ్రీస్కాంద పురాణా౦తరగత కార్తీక మహాత్మ్యే 
సప్తదశ అష్టాదశాధ్యాయౌ, ( పదిహేడు __ పద్దేనిమిదీ అధ్యాయములు)

 

Karthika Maha Purananamu 9th Day Parayanam

 

9 వ రోజు

నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి

దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు

పూజించాల్సిన దైవము :- అష్టవసువులు - పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః

ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ

 

తోమ్మిదవ రోజు (నవమి) నాటి పారాయణము సమాప్తము  


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.