రుద్రాక్ష విశిష్టత ?

 

Rudraksha means 'The Tear of Lord Shiva', Brief Story of Goddess Lakshmi Devi and Rudraksa , Lord Vishnu, Narada Maharshi

 

 

 

రుద్రాక్షలు పవిత్రతం వాటికి గల శాక్యుల గురించి ఉపనిషత్తులు విశేషంగా వివరిస్తున్నాయి. శివపురాణం, దేవీభాగవతం, రుద్రోక్షోపనిషత్తు, రుద్రజబాల్యుపనిషత్తు, లింగపురాణం, స్కాంద పురాణం ఇలా వివిధ పురాణాలు రుద్రాక్షల గురించి చెప్పాయి. పరమేశ్వరుడు చెప్పిన మాట "త్రిపురాసురుని సంహార సమయంలో నేను నిమీలీతనేత్రుడినై ఉండగా నా కనులనుండి జలబిందువులు రాలి భూమ్మీద పడ్డాయి. వాటినుండి సర్వజన క్షేమార్థమై రుద్రాక్షవృక్షాలు ఆవిర్భవించాయి'' పరమశివుడు మానవజాతికి ప్రసాదించిన అద్భుతవరం రుద్రాక్షలని అష్టాదశపురాణాల్లో చెప్పబడింది. రుద్రాక్షలు ఏకాలంలో ఆవిర్భవించాయో ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేదు, వాటికి చారిత్రిక ఆధారాలు లేవు. వీటిలో కొన్ని బ్రహ్మదేవుని మ్య్ఖం నుండి ఉద్భవించాయని చెబుతారు.

 

 

Rudraksha means 'The Tear of Lord Shiva', Brief Story of Goddess Lakshmi Devi and Rudraksa , Lord Vishnu, Narada Maharshi

 

 


ఒకప్పుడు విష్ణుమూర్తికి దేవతలందరూ విలువైన వజ్రవైఢూర్యాలు, సువర్ణ ఆభరణాలు సమర్పించి తమ భక్తిని తెలుపుకున్నారు.  ఈ సందర్భంలో పరమశివుడు ఒక రుద్రాక్షబీజాన్ని కానుకగా పంపగా విష్ణుమూర్తి పరమానందభరితుడై ఆ రుద్రాక్షని స్వీకరించి తన చెంతనే ఉన్న మహాలక్ష్మికి అందించాడు. రుద్రాక్ష మహిమ తెలియని శ్రీలక్ష్మీదేవి ఈసడింపుగా చూసింది. సర్వసంపదలకు నిలయమైన లక్ష్మీదేవికి రుద్రాక్ష అతి స్వల్పంగా కనిపించింది. రుద్రాక్ష అపమృత్యువుని నివారించి దేహసౌఖ్యాన్నే కాక, ఆత్మశాంతిని, సౌందర్యాన్నీ ప్రసాదిస్తుందనే సత్యాన్ని లక్ష్మీదేవి గ్రహించలేకపోయింది. అదే సమయానికి కలహాభోజుడైన నారదుడు రంగప్రవేశం చేశాడు. నారదుడు లక్ష్మీదేవిని రెచ్చగొట్టి శివుడు రుద్రాక్షను కానుకగా పంపడాన్ని హేళనగా చూపిస్తూ శ్రీమహావిష్ణువుని చిన్నబుచ్చడమే అనీ, ఇది శివుడు పన్నిన పన్నాగమే అనీ, శివుడు బహుకరించిన రుద్రాక్షను తిరిగి శివుడికే పంపితే అది గుణపాఠంగా ఉంటుందని లక్ష్మీదేవి భావించింది. నారదుడు లక్ష్మీదేవికి ఒక సలహా ఇచ్చాడు, రుద్రాక్షను తిప్పి పంపడం కంటే డానికి సరిసమానమైన తూగే బంగారం పంపడం తగిన గుణపాఠం అవుతుందని అన్నాడు.

 

 

Rudraksha means 'The Tear of Lord Shiva', Brief Story of Goddess Lakshmi Devi and Rudraksa , Lord Vishnu, Narada Maharshi

 

 


నారదుని మాటలు విన్న లక్ష్మీదేవి రుద్రాక్ష తులాభారాన్ని ఏర్పాటు చేసి రుద్రాక్ష బరువుకు తగినట్టుగా లక్ష్మీదేవి తన బంగారాన్ని త్రాసులో ఉంచింది. కానీ, మొత్తం సంపదనంతా ఉంచినా త్రాసులో ఉంచిన రుద్రాక్షకు తూగకపోవడంతో లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి ఏమి చేయాలో తోచక విష్ణువే దీనికి తగిన సలహా ఇవ్వగలడని ఆలోచించి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడిగింది. ఈ ఏడు లోకాల సంపదలు కూడా రుద్రాక్షకు సరిపోదని ఒక విబూది ఫలం త్రాసులో వేయమని చెప్పాడు. లక్ష్మీదేవి అలాగే చేయగా త్రాసు పైకి లేచింది. తన అజ్ఞానానికి లక్ష్మీదేవి సిగ్గుపడింది. మానవజాతికి మహాశివుడు అందించిన ఆపురూప సంపద రుద్రాక్ష. రుద్రాక్షను నిష్ఠతో ధరిస్తే సకల పాపాలు తొలిగిపోయి మానసిక, శారీరక శాంతి, సకల సంపదలనూ పొందుతారు.


More Enduku-Emiti