మంచి విషయాన్ని తెలుపుతున్న సముద్రుడు



 

 

ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండే సముద్రం నదులన్నిటికీ భర్తతో సమానం. సముద్రంలో  నిరంతరాయంగా ఎన్నో నదులు, ప్రవాహాలు వచ్చి చేరుతుంటాయి. అలా అవి వచ్చి చేరాలని సముద్రం ఆశపడదు. వచ్చి చేరినందుకు పొంగిపొరలదు. హద్దు దాటదు. ఆ ప్రవాహాలను తనలో యిముడ్చుకొని గంభీరంగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఇది సముద్రానికున్న స్వభావము. అలా సముద్రునిలా అశాంతికి తావివ్వకుండా నిర్మలంగా ఉండాలనుకుంటే దేహములో గల ఆత్మానుభవం యందే నిమగ్నమై ఉండు. భౌతిక విషయానుభవ సుఖం కావాలని కోరుకోకు. వాటంతట అవే వచ్చి చేరిన, సంతోషముతో హద్దు మీరకుండా ఉండు. సుఖాన్ని, దుఃఖాన్ని సమభావనతో స్వీకరించు. అప్పడు నీలో అశాంతి కలగదు. ఈ మంచి విషయం సముద్రుడు మనకు తెలుపుతున్నాడు. ఈ విషయం మనకు గీతలోని ఈ శ్లోకం ద్వారా తెలియుచున్నది.


అపూర్యమాణ మచల ప్రతిష్టం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తద్వత్ కామాః యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ...

 


More Good Word Of The Day