అదృష్టం సులభంగా అందని ఫలమైతే.. దురదృష్టం తరచూ తలుపుతట్టే అతిథి.అందుకే మనల్ని సమస్య చుట్టుముట్టేంత సులభంగా విజయం వరించదు. దాని కోసం ఎంతో కష్టపడాలి. పోరాడాలి. చెమటోడ్చాలి. అహర్నిశలు శ్రమిస్తూ ధ్యాస శ్వాస పనిపై పెట్టాలి. అప్పుడు కూడా విజయం మనల్నే వరిస్తుందని చెప్పలేం. కానీ పోరాడాలి. ఆ పోరు విరామం తీసుకోకుండా, విశ్రాంతిని ఆశించకుండా చేస్తూనే ఉండాలి.కాబట్టి అదృష్టం మనల్ని అందలం ఎక్కించకపోయినా కఠోర శ్రమ, వెనక్కి తగ్గని మనస్తత్వం, మడమ తిప్పని నైజం మనల్ని విజేతగా నిలిపే అవకాశం ఉంది.అందుకే కష్టే ఫలి : అన్నారు పెద్దలు.




మనిషన్న తరువాత కొంచం జాలి,కరుణ,మమత ఉండాలి.సాటి మనిషి గురించి ఆలోచించాలి. అవసరమున్నంత మేర, మన శక్తి కొద్దీ, సహాయసహకారాలు ఏదో ఓ రూపంలో అందించాలి. దాన గుణం లేని వారిని మంచివారుగా సమాజం అంగీకరించదు. ఎందుకంటే ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. మన సంపాదన ఏరీతిగా, వినియోగపడ్తున్నది కూడా ముఖ్యమే. . కానీ కొందరు వారి కున్న సంపద అంతా వృధా అవుతున్నా, ఆకలితో ఉన్న వారికి పట్టెడు మెతుకులు విదిల్చరు. కాబట్టి దానం చెయ్యని చెయ్యీ, కాయలు కాయని చెట్టూ ఒకటే..ఇలాంటి వారి జీవితం వృధా!

 

---అనిల్


More Good Word Of The Day