ఉదయం లేవగానే ఏం చేయాలి

 


ఉదయం లేచిన వెంటనే మనం ఎవరిని చూస్తే ఆ రోజు అలాగే సాగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. అందుకే ప్రతి రోజు శుభప్రదంగా ఉండాలంటే ఉదయాన్నే వేటిని చూస్తే శుభం కలుగుతుందో, వేటిని చూడకుండా ఉండటం మంచిదో తెలుసుకుందాం. సుమంగళినీ, గోవునూ, వేదవేత్తనూ, అగ్నిహోత్రాన్ని చూసిన శుభ ఫలము కలుగును. నది, సముద్రం, సరస్తులు చూస్తే దోషాలు పోతాయి. పెరుగూ, నెయ్యి, ఆవాలు, అద్దం చూస్తే అశుభంగా తలుస్తారు. ఇక ఉదయం లేవగానే పదిదోసిళ్ళ నీరు త్రాగితే మంచిది. అలా చేయటం వల్ల నిత్యం యవ్వనంతో ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకీ, పిల్లలకి ఉదయాన్నే నీళ్ళు తాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతం అజీర్తి, మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉండగలుగుతారు. రాగి చెంబుతో నీరు తాగితే మలబద్దకం ఉండదని ఆయుర్వేదం చెబుతోంది.


More Good Word Of The Day