సంక్రాంతికి ఈ దానం చేస్తే మీ గ్రహ బాధలు తీరిపోతాయి..

 

 

సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగే కాదు.... ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా. ఈ సమయంలో చేసే దానధర్మాలు, పూజలు గొప్ప ఫలితాన్నిస్తాయని చెబుతారు. అందుకే ప్రతి రాశివారూ తమ గ్రహబాధల నుంచి తప్పించుకోవడానికి, సంక్రాంతికి తప్పకుండా దానం చేయమని సూచిస్తున్నారు. మరి ఏ రాశివారు ఎలాంటి దానం చేస్తే, గ్రహాల అనుగ్రహం పొందవచ్చో చూద్దామా...


మేషరాశి– ఈ రాశివారు మకర సంక్రాంతికి నువ్వులు, బెల్లం దానం చేస్తే చాలా మంచిది.


వృషభరాశి– ఈ రాశివారు నువ్వులతో పాటు దుస్తులు దానం చేయాలని చెబుతున్నారు.


మిధునరాశి– గ్రహశాంతి కోసం నువ్వులు దానం చేసేటప్పుడు నల్లనువ్వులనే దానం చేస్తారు. కానీ మిధునరాశి వారు సంక్రాంతికి తెల్లనువ్వులని దానం చేస్తే మంచిదట. వీటితో పాటు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కూడా దానం చేస్తే మంచిది.


కర్కాటక రాశి– వీళ్లు  నువ్వులతో పాటు సగ్గుబియ్యం, వస్త్రాలని దానం చేయాలి.


సింహరాశి– ఈ రాశివారు నువ్వులు, బెల్లం, వస్త్రాలను దానం చేయాలని సూచిస్తున్నారు.


కన్యారాశి– వీళ్లు మినుములు, నువ్వులు, నూనె దానం చేస్తే గ్రహబాధలు తీరిపోతాయన్నది పెద్దల మాట.


తులారాశి– ఈ రాశివారు నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేస్తే మంచిది.


వృశ్చికరాశి– సంక్రాంతి సమయంలో నువ్వులు, బియ్యం దానం చేస్తే ఈ రాశివారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.


ధనుస్సురాశి– ఈ రాశివారు సంక్రాంతికి శనగలు, నువ్వులు దానం చేయాలి.


మకరరాశి- నూనె, నువ్వులు, వస్త్రాలని దానం చేయడం వల్ల ఈ రాశివారికి మంచి జరుగుతుంది.


కుంభరాశి- ఈ రాశివాళ్లు దువ్వెన, నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలను సంక్రాంతి సమయంలో దానం చేయాలి.


మీనరాశి– శనగలు, సగ్గుబియ్యం, నువ్వులు, వస్త్రాలను దానం చస్తే ఈ రాశివారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.


వీటితో పాటు ఆడవారు సంక్రాంతి సమయంలో పసుపుకుంకుమలు, పళ్లు దానం చేస్తే... జీవితం సజావుగా సాగిపోతుందన్నది పెద్దల మాట.


More Sankranti