జ్ఞానులతో పరాచికం వద్దు

 

 

పరిగత పరమార్థాన్‌ పండితాన్‌ మా-వమంస్థాః

తృణమివ లఘు లక్ష్మీర్నైవ తాన్‌ సంరుణద్ధి ।

అభినవ మద రేఖా శ్యామ గండ స్థలానాం

న భవతి బిసతంతుర్వారణం వారణానామ్‌ ॥

 

జ్ఞానసంపన్నులైన పండితులను అవమానించాలని చూడకూడదు. మన సిరిసంపదలను చూసి మనం ఆడే పరాచకాలను వారు భరిస్తారని భావించకూడదు. ఎందుకంటే జ్ఞానులైనవారికి ఐశ్వర్యం గడ్డిపోచతో సమానం. బలిష్టమైన ఏనుగుని తామరతూడలతో బంధించం ఎలా సాధ్యం కాదో, అలాగే ధనాన్ని ఎరగా చూపి జ్ఞానులను వశం చేసుకోవడం కూడా అసాధ్యం!

 

..Nirjara

 


More Good Word Of The Day