వాస్తులో సాధారణంగా జరిగే పొరపాట్లు

Vastu and Common Mistakes

 

వాస్తు నమ్మినవారికే వర్తిస్తుంది.. విశ్వాసం లేనివారికి వర్తించదు అనుకుంటారు కొందరు. కానీ వాస్తు ఒక శాస్త్రం. వాస్తు సిద్ధాంతాలు తెలుసుకుని పాటించడం శ్రేయస్కరం. వాస్తుకు సంబంధించి ఎక్కువమంది చేసే సాధారణ తప్పులు కొన్ని ఉన్నాయి. అలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తగా ఉండేందుకుగానూ అవేంటో తెలుసుకుందాం.

 

తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్య దిశల్లో వరండా వేస్తుంటారు. ఈ మూడు దిక్కుల్లో ఎటువైపూ కూడా వరండా ఉండటం శ్రేయస్కరం కాదు.

 

చాలామంది నైరుతిలో బాత్రూం పెట్టుకుంటారు. ఈశాన్యం వైపు మాత్రమే కాదు, నైరుతిలోనూ స్నానాల గదులు, టాయ్లెట్లు ఉండకూడదు.

 

పిల్లర్ కు ఎదురుగా ద్వారం పెడతారు. ఇలా ఉండకూడదు.

 

పిల్లర్ ఎదురుగా ప్రహరీ గేటు కూడా ఉండకూడదు.

 

చాలామంది ఇంటి మూల, ప్రహరీగోడ పక్కగా సంపు నిర్మిస్తారు. ఇలా అయితే అడ్డంగా ఉండదు అనుకుంటారు. కానీ,ఇంటిమూలలో నీళ్ళ సంపు ఉండకూడదు.

 

కొందరు పిల్లర్ ఎదురుగా నీళ్ళ సంపు ఏర్పాటు చేస్తారు. ఇలా స్థంభం ఎదురుగా నీటి సంపు ఉండకూడదు.

 

కొందరు ప్రహరీ గేటు దాటగానే, ఇంట్లోకి ప్రవేశించే మధ్య దారిలో నీళ్ళ సంపు ఏర్పాటు చేస్తారు. ఇలా గేటుకు ఎదురుగా నీళ్ళ సంపు అస్సలు ఉండకూడదు.

 

Indian architecture and vastu, common mistakes in vastu, varanda in east or west, bathroom in nairuthi, bathroom in eesanyam, door opposite pillar, pillar opposite compound wall, sump at corner


More Vastu