వాస్తు - గాలి, వెల్తుర్లు

Vastu wind and lightning

మనం మళ్ళీమళ్ళీ చెప్పుకుంటున్నట్లుగా వాస్తు అంటే కేవలం వంటిల్లు ఎటువైపు ఉండాలి, పూజ గది ఏ దిక్కున ఉండాలి లాంటి అంశాలు మాత్రమే కాదు. వాస్తులో పిల్లర్లు, నీళ్ళ సంపుల దగ్గరనుంచి గోడకు వేసే రంగుల వరకూ అనేక విషయాలను ప్రస్తావించారు.

ఇప్పుడు మనం వాస్తులో గాలి, వెల్తుర్ల గురించి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రంలో గాలీ వెల్తుర్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నిజమే మరి, ఇంట్లోకి గాలీ వెల్తురు లేకపోతే అసలది ఇల్లెలా అవుతుంది?! చెట్టు తొర్రలోనో, కొండ గుహలోనో ఉన్నట్లు ఉండదూ?! ఇంట్లోకి గాలీ వెల్తురు గనుక రాకపోతే తాజాదనం ఉండదు. ఊపిరాడదు. విసుగు, చిరాకు, అసహనం కలుగుతాయి. గాలి ప్రాణాన్ని కాపాడుతుంది. తాజా గాలి లేకుంటే అనారోగ్యాల బారిన పడతాము. కనుక కిటికీలు, దర్వాజాలు తగినన్ని ఉండటము, అవి సరైన దిశలో ఉండటం వల్ల బయటి నుండి స్వచ్చమైన గాలి లోనికి, లోపలి గాలి బయటకు వెళ్ళి ఇంటి వాతావరణం తేటగా, పరిశుభ్రంగా ఉంటుంది.

వాస్తు శాస్త్రం పరిపూర్ణంగా తెలిసినవారు ఇంటిని ఖచ్చితంగా రోడ్డు కంటే ఎత్తులో నిర్మిస్తారు. ఇల్లు కనుక రోడ్డు కంటే మెరకలో లేకుండా పల్లంలో ఉంటే వర్షం పడినప్పుడు ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఉండటమే కాకుండా గాలీ వెల్తురూ మెరుగ్గా లోనికి వస్తాయి.

కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఇళ్ళను గమనించినట్లయితే చిన్న కిటికీ కూడా కనిపించదు. అలాంటి గదుల్లో పట్టపగలు కూడా చిమ్మచీకటి తాండవిస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో కనిపించకపోవడమే కాదు, అసలు కాసేపు కూడా ఉండలేము. పొదుపు పేరుతో వాస్తు విరుద్ధంగా నిర్మిస్తున్న కొన్ని ఆధునిక గృహాల్లో సైతం లైటు వేస్తేనే వెలుగు, ఫాను ఉంటేనే గాలి చందంగా ఉంటున్నాయి. ఇవి ఆరోగ్యకరమైన ఇళ్ళు కావని గుర్తించాలి. అందుకే వాస్తు శాస్త్రకారులు పుష్కలంగా గాలీవెల్తురూ వచ్చేందుకు వీలుగా పెద్ద కిటికీలను ఏర్పాటు చేస్తారు.

పూర్తిగా చెక్క అమర్చిన కిటికీల కంటే చెక్క ఫ్రేముకు అద్దాలు బిగించిన తలుపులు అమర్చుకోవడం శ్రేష్ఠం. వర్షం పడుతున్నప్పుడు లేదా గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కిటికీలు మూసి ఉంచినా వెల్తురు వచ్చే అవకాశం ఉంటుంది.

గాలీ వెల్తురు వచ్చే అవకాశం లేకుంటే, తాజా గాలి రాదు, లోపలి కలుషిత గాలి బయటకు పోదు. దాంతో విసుగ్గా, అసహనంగా ఉంటుంది. త్వరగా అలసిపోయినట్లు అవుతుంది. చీటికిమాటికి కోపం ముంచుకొస్తుంది. శారీరక ఆరోగ్యం పాడవుతుంది. మానసిక అశాంతి కలుగుతుంది.

ఇంట్లోకి గాలీ వెల్తురూ పుష్కలంగా రాకుంటే నీరసం ఆవరించినట్లుగా ఉంటుంది. ఇల్లు కళ తప్పుతుంది. అందుకే చీకటి గదుల్ని జైళ్ళ తో పోలుస్తారు. స్వేచ్చ లేనట్లుగా, నిరాశానిస్పృహలు ఆవరించినట్లుగా ఉంటుంది. పెద్ద కిటికీలు ఉండటం వల్ల బయటి ప్రపంచం కూడా తెలుస్తుంది.

వాస్తు శాస్త్రీయం Vastu is Scientific

వాస్తు గురించి అనేక తర్జనభర్జనలు ఉన్నాయి. "ఈ వాకిలి ఇటువైపే ఎందుకు ఉండాలి, మరోవైపు ఎందుకు ఎండకూడదు..", "వంటిల్లు ఆగ్నేయం దిశలో లేకపోతే ఏమౌతుంది" - లాంటి వాదాలు అనేకం వింటూ ఉంటాం. "ఇండిపెండెంట్ ఇల్లయితే, సరే కావలసినట్లు కట్టించుకోవచ్చు, కానీ ఫ్లాట్స్ లో వాస్తు ఎలా సాధ్యం?!" అని తల పంకించేవాళ్ళు, "ఆఫీసుల్లో చెప్పిన చోట కూర్చుని పని చేయడం లేదూ.. అక్కడ కూడా వాస్తు గురించి మాట్లాడితే ఉద్యోగం ఊడుతుంది" - అని ఛలోక్తులు విసిరేవాళ్ళు, "ఇంకా నయం, రైల్లో కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తాను అంటారేమో" - అంటూ జోకులు వేసేవాళ్ళు ఎదురౌతుంటారు.

రోజంతా పనుల వత్తిడితో నలిగిపోయి, విసిగిపోయిన మనం, ఏదో వంకన కాసేపు కులాసాగా నవ్వుకోడానికి చూస్తాం. అలాంటి చతురోక్తులకు వాస్తు కూడా ఒక టాపిక్ అయితే పరవాలేదు. కానీ వాస్తును చప్పరించి, తీసిపారేస్తే, ఆనక మనమే బాధపడాల్సి వస్తుంది. ఏది ఎటువైపు ఉండాలో, అది అటువైపే గనుక ఉంటే మేలు జరుగుతుంది. ఉండకూడని వైపు కిటికీలు, దర్వాజాలు గట్రా వాస్తు విరుద్ధంగా ఉంటే ఫలితాలు నెగెటివ్ గానే ఉంటాయి.

భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈ నేపథ్యంలో భూమి చుట్టూ ఉండే గ్రహాలూ, నక్షత్రాల ప్రభావం భూమి మీద పడుతుంటుంది. అందుకే ప్రతిదానికీ "ఇదిలా ఉండాలి" అంటూ నియమాలు నిర్దేశించారు. ఆ నియమాలను పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

 

వాస్తులో కిటికీల నియమాలు Vastu and Windows

ఇంటికి ముఖద్వారం, ప్రహరీ గేటులు ఎంత ముఖ్యమో కిటికీలు కూడా అంతే ముఖ్యం. ఇంటి సైజు, గదుల సంఖ్యను బట్టి కిటికీలు ఏర్పాటు చెసుకోవాల్సి ఉంటుంది. ఒకే గది ఉన్న ఇల్లు అయితే ఒకే ఒక్క కిటికీ ఉండొచ్చు. అలా ఒక్క కిటికీ మాత్రమే ఉంచడంలో దోషం ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దది అయినప్పుడు 14 కిటికీలు అవసరం కావచ్చు. కనుక అవసరాన్ని బట్టి ద్వారాలు, కిటికీల సంఖ్య ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అయితే, వాస్తులో ఎన్ని కిటికీలు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు అనే అంశాలకు సంబంధించి కొన్ని నియామాలు ఉన్నాయి. ఆ నియమాలను ఉల్లంఘించకుండా గృహ నిర్మాణం చేసుకోవాలి.

వాస్తు ప్రకారం ఇంటికి 1, 2, 4, 8, 12, 14 చొప్పున కిటికీలు ఉండాలి.

కిటికీలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ – ఇలా ఏ దిక్కున అయినా ఉండవచ్చు. అయితే నైరుతి వైపు మాత్రం కిటికీలు ఏర్పాటు చేయకూడదు.

నైరుతి వైపు గనుక కిటికీలు ఉంటే కుటుంబసభ్యులకు, ముఖ్యంగా ఇంటి యజమానికి ఆందోళన తప్పదు.

నైరుతిలో గనుక కిటికీ ఉంటే నడుంనొప్పి, మెడనొప్పి లాంటి అనారోగ్యాలు వస్తాయి.

కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంది.

ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి.

వృత్తి వ్యాపారాల్ల్లో లాభాలు ఆర్జించినప్పటికీ ఏదో నెపాన వచ్చిన సొమ్మంతా పోతుంది.

సాఫీగా జరిగిపోవాల్సిన విషయాలు కూడా సమస్యాత్మకంగా, బాధాకరంగా మారతాయి.

vastu and fresh air, vastu windows and doors, Vastu rules and windows number, no window in Nairuthi side, vastu and lighting, indian architecture and windows, indian vastu doors and windows rules, indian vastu scientific, 


More Vastu