వినాయక   పూజలోని   అంతరార్థము



‘’పిల్లలూ రండి, రండి !ఇవాళ  వినాయకుని పూజ గురించి తెలుసుకొందాం!

‘’చెప్పండి, చెప్పండి . వినాయకున్నే  గణపతి అని అంటారు కదా! ఏపూజ  చేసినా  ముందు వినాయకున్నే పూజించాలని అంటారు . ఎందుకు ? తాతగారు ?’’అన్నారు పిల్లలంతా .తెలిసుకోవాలనే  కుతూహలంతో .ఈ వినాయకుడే  విఘ్నేశ్వరుడు , విఘ్నేశుడు,  విష్వక్సేను డు, గణపతి,  గణేషుడు , గణపతి అనే పేర్లు కలవాడు . ఇలా ఈయనకు లోకంలో చాలా పేర్లే వున్నై .విఘ్నాలను తొలగిస్తాడు  కనక  విఘ్నేశ్వరుడు .గణాలకు అధిపతి గనక    గణేశుడు.అనేపేర్లు వచ్చాయి .తండ్రి పరమేశ్వరుడు యిచ్చిన వరం వలన అన్ని పూజలకు, శుభకార్యాలకు  ఆది దేవునిగా పూజ లభించింది ..

‘’ఐతే పసుపు ముద్దకు పూజ చేస్తారేమిటి ?’’ –  శ్రేష్ఠ ప్రశ్న.

‘’ఔనర్ర్ర్రోయి .గణపతిని  పసుపు రూపంలో పూజించే సంప్రదాయం ఎప్పటినుండో వస్తోంది . దానికో కథ వుంది చెప్తా వినండి .’’ ‘’అదేమిటో చెప్పండి ‘’ అన్నారు అంతా .

పూర్వం త్రిపురాసురులు  అనే రాక్షసులు  వుండే వారు .వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది  లోకాలన్నిటినీ  బాధించసాగారు.ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకొని  దేవతలను ,లోకాలనూ బాధించసాగారు. వీళ్ళ  బాధలు  భరించ లేక  శివుణ్ణి  ప్రార్థించారు .  అపుడు  శివుడు  రక్షిస్తానని  అభయమిచ్చాడు. ‘’ఆ ...తర్వాత ఏమైంది ?’’అంది గౌతమి . శివుడు  ఆలోచించి  ఒక  ఉపాయాన్ని  చెప్పాడు . నందిని  ఆమూడు  నగరాలను  తన  కొమ్ములతో  యెత్తి పట్టుకోమన్నాడు .అప్పుడు శివుడు కొమ్ముల పై యెత్తిన  మూడు  నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు. ఆ సమయంలో నండి కొమ్ము ఒకటి తెగి పడిపోయింది .అదే పసుపుకొమ్ము. దానితో నందికి చాలా దు:ఖం  కలిగింది .

‘’ఐతే బాగా ఎడ్చాడా  నంది ?’’తన్ని తన్నిష్ఠ ప్రశ్న.

‘’ఔనమ్మా! తనకొమ్ము విరిగి ఎక్కడో పడిపోతే  ఏడవడా మరి ?’’

‘’అప్పుడేమైం ది ? తాతగారూ ?’’అన్నారందరు .

గణపతి అప్పుడు ఆ కొమ్ము   

  ఎక్కడ పడిందో వేడికి తెచ్చాడట ! కొమ్ము దొరికి  నందుకు నందికి చాలా ఆనందం కలిగింది . అది చూచిన శివుడు’’నందీ ! బాధ పడకు. నీ పసుపు కొమ్ము పడిన చోటున  మొలిచిన  పసుపు కొమ్ముల తోనే  చూర్ణించగా వచ్చిన  పసుపుతో  పసుపు గణపతిని  చేసి , యే  పూజకైనా మొదట పూ జింప వలసినదే !’’అన్నాడట!.

‘’మరి అలా పసుపు కొమ్ములు దొరికాయా ? లేదా ?’ అడిగారు పిల్లలు.

ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన  పసుపుతోనే తయారుచేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట!

‘’ఓహో ! అదా పసుపు గణపతి !అందుకే ఆయన ఆది దేవుడు , ప్రథమ  పూజ్యుడు  అయ్యాడన్నమాట !’’

‘’ఇదర్రా! పసుపు గణపతి కథ !అందుకే శివుని వరం ప్రకారం యే పూజకైనా  ముండుపసుపు గణపతిని పూ జించే

సంప్రదాయం ఏర్పడిం దన్నమాట !’అన్నారు తాతగారు.

 

వినాయకుని  గురించిన  కథలు పురాణాలలో  ఎన్నోవున్నై.  ఏదేమైనా  గణపతి మాత్రం శివ !పార్వతుల కుమారుడుగానూ, ప్రథమ  పూజ్యుడుగాను అన్ని  పురాణాలు పేర్కొన్నాయి. కాబట్టి దాన్నే మనమూ  నమ్మాలి. !



 

‘’తాతగారూ!ఈ పూ జలన్నింటిలోనూ  పదహారు సేవలు చేస్తారని యిది వరకు చెప్పారు కదా ! అందులో  ‘పంచామృత స్నానం’ అని చేయిస్తారు. అదేమిటి ? దాని వలన  మనకు కలిగే  లాభమేమిటో చెపుతారా?

 ఒరే ! రాంబాబు ! పదహారు   రకాల  సేవలంటే  షోడశోప చారము  లన్నమాట ! వీటిలో పంచామృత  స్నానంకుడా ఒక సేవ అన్నమాట ! పంచ అమృతాలు అంటే ఐదు అమృతాలు  కలిసినవని  అర్థం.- వీ టితో దేవునికి ంచేయించేస్నానమే  పంచామృత  స్నానం.

‘’ఆ పంచామృతాలు యేమిటి తాత గారూ?’’గౌతమి ప్రశ్నించింది .

‘’నీ రు, పాలూ,పెరుగు,నేయి, తేనె- యివి పంచామృతాలు. వీటిని కలిపి  వీటితో చేయించే స్నానమే పంచామృత స్నానం  అంటారు.

‘’ఇది చేయటం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా ?’’ ఆడిగారందరు .
‘’ఈ స్నానం అయిన తర్వాత శుద్దోధకస్నానం చేయిస్తారు –అంటే కొబ్బరి నీటిస్నానం అన్నమాట.’’
‘’మళ్ళి శుద్దోదకం ఎందుకు?’’ పిల్లల ప్రశ్న .
‘’పంచామృతస్నానంతో  దేవుని  వొళ్ళంతా  జిడ్డుగా  వుంటుంది  కదా! ఆడి పోగొట్టటానికి శుద్దోదక స్నానం చేయించాలి.’

‘’మరి ఆ తర్వాత  యేం చేస్తారు ?’’

స్నానం చేయించిన పంచామృతాన్ని వచ్చ్చిన  భక్తులందరికీ ‘’అకాల మృత్యు హరణం| సర్వ వ్యాధి నివారణం|  సమస్త

పాప క్షయకరం |శ్రీ గణేశ పాదోదకం పీత్వా | పునర్జన్మ న విద్యతే |’’ అంటూ  మూడేసి  ఉద్ధరిణెలు చొప్పున తీర్థంగా యిస్తారు .    

‘’ఈ తీర్థం  తీసుకోవటం  వలన  యేమిటి  లాభం ?

’’ఈ  పంచామృత  తీర్థం  తీసుకోవటం  వలన  మనలోని  ధాతుశక్తి , నరాలశక్తి  పెరుగుతుంది.  మేథవ్యాధి  నిరోధక  శక్తి పెరుగుతుంది.   హృదయానికి  బలం  చేకూరుతుంది. కాబట్టి దీనిని  వారానికి  ఒకసారైనా  తీసుకోవటం చాలా మంచిదని  ఆయుర్వేద  శాస్త్రం  చెబుతోంది.’’

‘’ఓహో! అంటే వారానికొకసారి  పంచామృతాలు  కలుపుకొని  త్రాగాలన్నమాట !’’

‘’ఉట్టిగా  కలుపుకొని  త్రాగటం  కాదురా  అబ్బాయి.  దేవునికి   దీనితోస్నానం చేయించి  త్రాగితే  దైవశక్తి  కూడా తోడవుతుంది కదా!’’ అన్నారు తాతగారు .

‘’సరే! మరి,  ఆకులతో  వినాయకుని  పూజిస్తారెందుకు? అవి యెన్ని? యెక్కడ  దొరుకుతాయి  తాతగారూ?’’ప్రశ్నలు

పిల్లలవి.

‘’ఓరి భడవ ల్లారా !మీకు ఆకు పూజ కూడా తెలుసా !’’

‘’సరే! చెప్తా వినండి. రకరకాల ఆకులు అంటే రకరాల పత్రాలన్న మాట! అవి ఇరవై ఒకటి .దీన్నే ఏకవింశతి పత్రాలు- అంటారు.ఇది సంస్కృత పదం . ఇన్ని పత్రాలతో  పూజించా  లన్నమాట !’’

‘’ఎందుకు అన్నిఆకులు ? ఏవో ఒకటి రెండు ఆకులు వేస్తే చాలదా?’’  స్వాతి  ప్రశ్న.

సరిపోదు.ఐనా, సంవత్సరానికి  ఒక సారే కదా చేసేది ? వాటి  లాభాలూ  బోలెడున్నాయి  మరి!  అవేమిటో తెలుసుకొందాం . ఏకవింశతి  పత్రాలు  అంట21 ఆకులు అని అర్థం .ఇవి ఎలా వచ్చాయంటే ;  10 విష్ణు అవతారాలు  +  11శివుని అవతారాలు కలిపి ఇరవై ఒకటి   ఐనాయి కదా! ఈ అవతారాలకు  ప్రతీకలె  ఈ ఇరవైయొక్క   పత్రా లైనాయి.  ఎందుకనగా  హరి హరు లిద్దరూ గణపతికి యిష్ఠ మైన దైవాలు . అంతేగాక గణపతి హరి హరులకును ఆరాధ్యుడు . కాబట్టి  ఈ  పత్రాలతో  పూజించిన  శివకేశవుల తో మనమూ పూ జించిన పుణ్యం కల్గుతుంది  అని భావం . ఇది పుణ్యఫలం.!  అన్నారు తాతగారు  . కాస్త విరామం  తర్వాత  తిరిగి  ప్రారంభించారు.

            ‘’అజుడేకపాదు డహుర్బుద్నుయుడును

             త్వష్ట రుద్ర  హరుడునూ  శరభుడునూ

             త్ర్యంబకు  డపరాజితుడీ శానుడు

             త్రిభువనుడను  పదకొండవ తారము

             లివి  తెలియగ  హరునివి  యని  యెరుగుము|;ఇవి హరుని  (11) పదకొండవతారములు

 

             మత్స్య కూర్మవరాహశ్చ

             నారసింహ వామన:

             రామో రామశ్చ రామశ్చ

             బౌద్ధ కల్క్యావతార: |;   ఇవి హరి అవతారములు(10)  పది.

 

                  మాచి, బృహస్పతి, బిల్వ, దూర్వ,ద

                  త్తూర,  బదరి,  అపామార్గ, తులసీ,

                  చూత, కరివీర,  విష్ణుక్రాంత,  దాడి

                  మ, దేవదారు, మరువక,  సిందువా

             ర,జాజి,గండలి, శమీ, అశ్వత్థ

                  అర్జున,అర్క , పత్రమ్ము లిరువది

                  యొకటి యివియు వినాయాక పూజకు.!:ఇవి 21 అవతారములకు  సంబంధించిన  పత్రములు .

‘’హమ్మయ్య ! ఇన్ని పత్రాలా ? వీ టితో పూజించటం వల్ల ఏమి ఉపయోగం  తాత గారూ?’’  శ్రేష్ఠ ప్రశ్న .

‘’ఈ పత్రాల  గురించి  తెలుసుకుంటే  నీవే  తప్పకుండా  పూజించా  లంటావు .’’

‘’ఓహో ! అలానా ! అయితే చెప్పండి!’’ ‘’మరి వినండి ?’’

౧.మాచి పత్రం (నాగ దమని ) ..దీనీ ఆకులు  కళ్ళకు చలువ చేస్తాయి .తలనొప్పిని తగ్గిస్తాయి .

 ౨. బృహతీపత్రం (బృహస్పతి /వాకుడాకు  ... దగ్గు, ఉబ్బస ,నంజు,గొంతు, శ్వాస కోశ వ్యాదులకు చాలా మంచిది .

౩ .బిల్వ పత్రం (మారేడు) ...పండ్ల సమస్యలు, నోటి మలినాలు  తొలగించుటకు ,  ఆకులు , ఫలములు రక్తశుధ్ధికి                                           పనికొస్తాయి .‌

౪.దూర్వార యుగ్మం (గరిక/గడ్డి )...రక్త పైత్యానికి ,చర్మ వ్యాధులను రానీయకుండా చేస్తుంది ; మూత్ర వ్యాధులను దూరం చేస్తుంది .

౫ .దత్తుర పత్రం (ఉమ్మెత్త )... అస్తమా, ఇతర దగ్గులకు,  కీళ్ళ వాతమునకు  మంచి మందు.జ్వర నివారణ , కుష్టు నివారణ, తేలు,జెర్రి ,ఎలుక , కుక్క కాటు విషాలకు విరుగుడుగా  యీ ఆకు రసం  పనిచేస్తుంది.

౬.బదరి (రేగు)...భోజనం తర్వాత ఈ ఆకులు తింటే  ఆహారం చక్కగా జీర్ణమౌతుంది.అజీర్తి,రక్త దోషాలను నివారిస్తుంది.

వీర్య వృద్దికి తోడ్పడుతుంది.

౭ .అపా మార్గ(ఉత్తరేణి)...పండ్ల సమస్యలకు ఉత్తమమైనిది .విషాన్ని హరిస్తుంది.గాయాలను మాన్ప టంలో,ఇతర చర్మ సమస్యలకు  అద్భుతమైన ఔష ధం.

8.తులసి ( రామ తులసి, కృష్ణ తులసి ) ...నీ టిని, గాలిని శుభ్ర పరుస్తాయి.ఔషధాల గని .కీట కాలను ఇంటిలోనికి రానివ్వవు.జ్వరము ,జలుబు,దగ్గు,దురద,లాంటి  వ్యాధులకు  దివ్యౌషధము.మొక్కల చీడ పీడలనుంచి  కాపాడుతుంది .

9.చూత పత్రం (మధు ఫలం/ మామిడి) ...ఆక్సిజన్  యిస్తుంది. మూత్ర  వ్యాధులను   అరికట్టుతుంది.పాదాల బాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది .

10.కరవీర పత్రం (గన్నేరు )...జుట్టును  పెంచుతుంది . తల చుండ్రును తగ్గిస్తుంది. విషాన్ని హరిస్తుంది .కాని,ఎక్కువైతే విషమే ఔతుంది .

11.విష్ణు క్రాంత పత్రం (శంఖ పుష్పం/వారకాంత )...దీర్ఘకాలిక దగ్గును,కఫ  వాతాలను,జ్వరాలను ,నివారిస్తుంది.ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది.దీనిపూలు నీలంగా ఎర్రగా వుంటాయి.

12.దాడిమీ పత్రం (దానిమ్మ)...ఆకలి కలిగిస్తుంది. అజీ ర్ణాన్నిపోగొడుతుంది .గుండె జబ్బులున్న వారికి మేలుచేస్తుంది.

ఈ పండు తింటే విరేనాలు, వాంతులు తగ్గు తాయి.శరీరంలో   త్రిదోష వాత పిత్త కఫాలను  హరిమ్పజేస్తుంది .

13.దేవదారు  పత్రం ...దోమలు,కీటకాలను దరికి రానీయవు.దీనితైలం చర్మ వ్యాధులకు,గొంతు సమస్యలకు ,ప్రేవులలో పుండ్లకు, కండరాల బలోపెతానికి ,లైంగిక  ఉత్ప్రేరణకు  ఉపయుక్తముగా  వుంటుంది.

 14.మరువక పత్రం (మరువ౦ )...జుట్టు రాలనివ్వదు. గుండె జబ్బుల వారికిది మచిది . నరాల ఉత్ప్రేరణకు,చెవిపోటు, నొప్పులకు  దీన్ని ఔషధంగా  వాడవచ్చు.

15.సింధువార పత్రం (వావిలి)...వాతరోగ హరిణి.విషాలకు విరుగుడు .జ్వర నొప్పుల పై పనిచేస్తుంది తలమాడు నొప్పిని తగ్గిస్తుంది.పంటి చిగుళ్ళు , కీళ్ళబాధలను నివారిస్తుంది.

16.జాజి పత్రం (సన్నజాజి)...అజీర్ణం తొలగిస్తుంది . తలరోగాలను దరి రానీయదు.ఆకులు శరీరానికి వేడి నిచ్చి, శక్తినిస్తాయి.వాపు నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్నిశుద్ధి చేస్తాయి.

 17.గండకీ(గణకీ) పత్రం (కామంచి /కాకమాసి /తీగె గరిక/ లతా దుర్వా)...  అధిక దప్పిక తగ్గిస్తుంది .జ్వరానికి  మంచి మందు.కడుపు లొని  నులిపురుగులను  హరిస్తుంది

18.శమీ పత్రం(జమ్మి ఆకు )...వంశ పారం పర్యంగా వచ్చే వ్యాధులను తొలగిస్తుంది.ఈ ఆకు రసం తల చల్ల దనానికి, జుట్టు  నిగనిగ  లాడేందుకు ఉపకరిస్తుంది.ఈ వ్హెట్టు పై నుంచి వచ్చే గాలిని స్వచ్చంగానూ ఆహ్లాదంగాను వుంచుతుంది.

19.అశ్వత్థ పత్రం (రావి ఆకు)...ఈ  ఆకులు మూత్ర సంబంధ ,శ్వాస కోశ సంబంధ ,చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. శరీరంలో విషాల విరుగుడుకు,   క్రిమిదోషాల నివారణకు వినియోగిస్తారు.

20.అర్జున పత్రం ( తెల్ల మద్ది/వీర తరు) ...రక్త దోషం,క్షయకు  జరిపే  చికిత్సల్లో  దీనిని  వాడతారు.దీ నిబెరడు కషాయం గుండె ఆరోగ్యంగా,  పదిలంగా  వుండటానికి  ఉపయోగిస్తారు.

21.అర్క పత్రం (తెల్ల జిల్లేడు )...దీని  పాలు విషానికి విరుగుడు.ఎక్కువ వయసున్న చెట్టు వేళ్ళు గణపతిని పోలి వుంటాయట ! దాన్నే శ్వేతార్కమూల  గణపతి అంటారు . ఇది ఇంటిలో వుండటం చాలా మంచిది.  దీనిని  సూర్యునికి     ప్రతీకగా భావిస్తారు. దిఇనిలోని ఔషధ గుణాలు శరీరాన్ని కామ్తివంతంచేస్తాయి.’’                                                     

‘’అబ్బ ! చాలా విషయాలు  తెలుసుకున్నాం.!   తాతగారూ !’’

అరే !..మన ప్రతి పూజ వెనుకా యెన్నో రహస్యాలు దాచి పెట్టారు మన పెద్దలు . అవన్నీ తెలుసుకుంటేనే మనం  చేసే  పూజకు అర్థం వుంటుంది .లేకుంటే వ్యర్థమే!. ఆగారు తాతగారు కొంచెం విశ్రాంతి కోసం.

‘’ఒరే ! పిల్లలూ! ఇంతకీ  గణేశ పూజకు సిద్ధంగా వున్నారా?చెప్పండి !’’

‘’ఆ..ఆ..మేమంతా రెడీ! తాతగారు  !’’భేష్ ! ఇక ఇంటికివెళ్ళి  పాలవెల్లి అవీ తయారు చేసుకోండి. పూజ పూర్తి అయిం తర్వాత  కలుద్దాం . ఓకే!’’అన్నారు తాతగారు .పిల్లలు కూడా తాతగారికి ఓకే చెపుతూ వెళ్లి పోయారు

                            ‘’జయ గణేశ ! జయ గణేశ !’


వ్యాసకర్త  :- నల్లాన్ చక్రవర్తుల వెంకట రంగనాథ్


More Vinayakudu