కాశీవిశ్వనాథ ఆలయం

(Venkatagiri Kashi Viswanatha Temple)

 

వెంకటగిరి కాశీవిశ్వనాథ ఆలయం చారిత్రాత్మకమైంది. వెంకటగిరి, ఆ పరిసర ప్రాంతాల ప్రజలతో కాశీవిశ్వనాథ దేవాలయం నిత్యం సందడిగా ఉంటుంది.

 

దేవాలయం గర్భగుడిలో కాశీవిశ్వనాథుడు దర్శనమిస్తాడు. పక్కనున్న మరోగుడిలో అమ్మవారు కనులవిందు చేస్తుంది. విశాలమైన విశ్వనాథ దేవాలయ ఆవరణలో విఘ్నేశ్వరుని గుడి, మాతృభూతేశ్వరాలయం, ఉన్నాయి. ఇంకా ఆలయ ప్రాంగణంలో పంచభూత స్థలం ఉంది. ఇది పరమ పవిత్రమైంది. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, కుమార సుందరేశ్వరుడు, శ్రీరామమల్లేశ్వరులు కొలువై ఉన్నారు. కాశీవిశ్వనాథ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దేవతామూర్తులను కూడా దర్శించుకుంటారు.

 

క్షేత్ర మాహత్యాన్ని అనుసరించి వెంకటగిరి వెలమ రాజుల కాలంలో రాజధానిగా ఉండేది. బంగారు యాచమనాయుడు పాలకుడిగా ఉన్న కాలంలో కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు వెంకటగిరికి వచ్చాడట. బ్రాహ్మణుడు, తాను తెచ్చిన శివలింగాన్ని యాచమనాయుడికి చూపించి, “రాజా, ఈ లింగాన్ని తీసుకో.. విశ్వనాథునికి ఒక దేవాలయం కట్టించి, అందులో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించు. ఆ ఆలయంలో నిత్యం పూజలు, అర్చనలు జరుపుతుంటే నీకేంతో అభివృద్ధి కలుగుతుంది. ప్రజలు కూడా సుఖశాంతులు పొందుతారు...'' అని సెలవిచ్చాడట.

 

యాచమనాయుడు శివలింగాన్ని తీసుకున్నాడు. భక్తిగా కళ్ళకు అద్దుకున్నాడు. బ్రాహ్మణుడి మాట ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దేవాలయం కట్టించాడు. ఆ ఆలయమే ప్రస్తుత వెంకటగిరి కాశీవిశ్వనాథ ఆలయం. ఈ వెంకటగిరి కాశీవిశ్వనాథ ఆలయం, నెల్లూరు జిల్లాలో ఉంది.


More Punya Kshetralu