విజ్ఞానుల ముందు వినయంగా ఉండాలి

 

 

హర్తుర్యాతి న గోచరం కిమపి శం పుష్ణాతి యత్సర్వదా-

ప్యర్థిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాప్నోతి వృద్ధిం పరామ్‌ ।

కల్పాంతేష్వపి న ప్రయాతి నిధనం విద్యాఖ్యమంతర్ధనం

యేషాం తాన్ప్రతిమానముజ్ఝత నృపాః కస్తైః సహ స్పర్ధతే ॥

విద్య అనే సంపదను చోరులు దొంగిలించలేరు, దాని వల్ల ఎప్పటికీ దుఃఖం కలగదు, అలాంటి విద్యను పరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుందే కానీ తరగదు, ప్రళయకాలంలో కూడా అది నశించదు... ఇలాంటి విద్యాధికులని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ధనవంతులు సైతం విజ్ఞానుల ముందు వినయంగా ఉండాలే కానీ గర్వం ప్రదర్శించాలనుకోవడం అవివేకం.


More Good Word Of The Day