వడపప్పు, పానకం, విసనకర్ర.. ప్రాధాన్యం...

శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం ఇస్తారు. విసనకర్రలు దానం చేస్తారు.  ఉగాది తర్వాత వచ్చే పండగల్లో శ్రీరామనవమి ముఖ్యమైనది. ఆనాడు లోకకళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో, పాటలతో జరిపించాక వడపప్పు, పానకం ఇస్తారు.

 



నానబెట్టిన పెసరపప్పులో కొద్దిపాటి రుచికి తక్కువగా కారం కలుపుతారు. నానబెట్టిన పెసరపప్పునే వడపప్పు అంటారు. శ్రమను హరించే పప్పు వడపప్పు. శ్రమ పడినప్పుడు ఎండాకాలంలో వడ కొడుతుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో కొంత వేడి ప్రారంభంలో వచ్చే పండగ. వడపప్పు తినడం చేత చల్లదనం ఏర్పడుతుంది.

 

 

పానకం అనేది బెల్లం, మిరియాలతో చేస్తారు. పానకం శుభకార్యక్రమాలలోనే అవసరం పెళ్ళిళ్ళలో పానకం బిందెలు ఇవ్వడంలో ఒకతతంగం మాధుర్యమే కాక ఎదుటివారు చల్లగా వుండాలనేది కూడా వుంది. సీతారాముల కళ్యాణం ఒక శుభపర్వం. ఆ సందర్భాలన పానకం పంపకం తీయని సందర్భం.

 


పూర్వకాలంలో వేసవి కాలంలో విద్యుచ్ఛక్తి ఉండని కాలంలో, ఫ్యాన్లూ అవీ లేని కాలంలో తాటాకు విసనకర్రలే తాపం పోవడానికి, గాలి రావడానికీ వాడుకునేవారు. విసనకర్రలు గతంలో రెండు రకాలుగా వుండేవి. వెదురుతో చేసిన విసన కర్రలు పొయ్యిలకి, కుంపట్లకీ ఉపయోగించేవారు. తాటాకు విసనకర్రలు గాలి పొందడానికి, తాపాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించేవారు. మామిడిపండ్ల కాలం రావడంతో మామిడిపళ్ళు, విసనకర్రలు ఇవ్వడం పుణ్యప్రదం. అంతేకాదు, ఇతరులు హాయిగా వుండటం కోరుకోవడం కూడా వుంది. శ్రీరామనవి నాడు విసనకర్రలు దానం చేయడం కూడా అందుకే.

- సన్నిధానం నరసింహ శర్మ

 


More Enduku-Emiti