స్నానం సమయంలో చదవాల్సిన శ్లోకం

 


నిద్ర తాత్కాలిక మృత్యువు అని అంటారు మన పెద్దలు. మనిషి నిద్రించేటప్పుడు సగం శవంతో సమానమని దీని అర్ధం. మనలో ఉన్న పంచేంద్రియాలు పనిచేస్తూ ఉంటేనే మనం జీవించి ఉన్నట్టు అర్ధం. అందుకే నిద్ర లేచాక మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి స్నానం చేస్తాం.


పూర్వకాలంలో స్నానం చెయ్యాలి అంటే నదులకి వెళ్లి చేసేవారు. నదీ ప్రవాహం తప్ప మిగిలిన నీరు స్నానానికి, శరీర శుద్ధికి పనికిరాదని ఒక నమ్మకం ఉండేది. కాని కాలం మారుతూ వచ్చింది. రోజులు మారేకొద్దీ నదులకు దూరంగా ఇళ్ళు కట్టుకోవటం వల్ల ప్రత్యేకించి నదులకు వెళ్లి స్నానం చేసి వచ్చేంత దగ్గరలోనూ నదులు లేవు, అక్కడికి వెళ్లి స్నానంచేసి వచ్చేంత సమయము లేకుండా పోయింది.


అందుకే మనం ఇంట్లోనే ఉండి కూడా అన్ని పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం రావటానికి  మన పెద్దలు ఒక శ్లోకాన్ని చెప్పారు. అది ఏంటంటే ---


శ్లో... గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ

       నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురుII


ఈ శ్లోకానికి అర్ధం నేను పరమపవిత్రమైన గంగ, యమునా, గోదావరి, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరి మొదలైన పుణ్య నదుల నీరు శిరస్సు మీది కురులపై చల్లుకుంటున్నాను అని అర్ధం. ఈ శ్లోకం చదువుతూ ఎవరైతే స్నానం చేస్తూ శిరస్సు మీద నీళ్ళు చల్లుకుంటారో, వాళ్ళు అన్ని నదులలో స్నానం చేసి వచ్చినంత పుణ్య ఫలం దక్కుతుంది.


స్నానం చేసిన తరువాత విప్పిన బట్టలు కట్టకుండా, ఉతికిన బట్టలు మాత్రమే కట్టుకోవాలి. మాసిన బట్టలలో శని ప్రవేశించి ఉంటాడని పెద్దలు చెప్తున్నారు. వాళ్ళు ఏది చెప్పిన మన మంచికే చెప్పారన్నది ముమ్మాటికి నిజం. స్నానం చేయటం వల్ల ఒళ్ళు శుద్ధి కావటమే కాకుండా మనిషిలో నూతన ఉత్తేజం కూడా వస్తుంది.

 

..కళ్యాణి


More Enduku-Emiti