సింహ రాశి - (2018-2019)

 

సింహరాశి - మఖ 1,2,3,4 (మ, మి, మూ, మే)

పుబ్బ 1,2,3,4 (మో, టా, టి, టు), ఉ.ఫ. 1 (టే)

ఆదాయము 11 వ్యయం 11 రాజపూజ్యం 3 అవమానం 6

    ఈ రాశి వారికి 11-10-2018 వరకు 3వ స్థానంలో గురువు, తదుపరి 29-03-2019 వరకు 4వ స్థానంలో తుదపరి వత్సరాంతం 5వ స్థానంలో ఉండును. శని సంవత్సరమంతా 5వ స్థానంలో ఉండును. రాహు, కేతువులు 07-03-2019 వరకు 12, 6 స్థానాల్లో తదుపరి వత్సరాంతం 11, 5 స్థానాల్లో ఉంటారు.        

    చాలా కాలంగా అపరిశ్క్రుతంగా ఉన్న సమస్యలు పరిష్కార దిశగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు తమ పరిక్షలలో విశ్లేష ప్రతిభ ప్రదర్శిస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఋణ బాధలు తీరుతాయి. ఒకానొక సమయంలో   మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు మధ్యవర్తత్యము చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరము. ఎంత ధైర్యము పెరిగినా 'అనువు కాని చోట అధికులమనరాదు' అను న్యాయాన్ని పాటించండి. విద్యాపరమైన విషయాలలో కొంత అలసత్వము, సోమరి తనము పెరుగ వచ్చును. స్త్రీ,పురుష స్నేహాలు - పరచయాల విషయంలో అపోహలు, అవమానాలు ఏర్పడే సూచనలు గలవు. కరపాద బాధలు బాధించవచ్చును. సంవత్సరము మధ్య మధ్య భాగములో ప్రత్యక్ష మిత్రులు - పరోక్షం శత్రువులుగా మారే అవకాశము గలదు. తమకు సంబంధము లేని విషయమునై ఆసక్తి చూపి తమను తాము అరిష్టాలు స్వాగతించెదరు. రాహు-కేతు ప్రభావం వలన అనారోగ్యము నరములు,  ఎముకలు, రక్తము నకు సంబంధించిన అవస్థలు ఎదుర్కొనవలసి వచ్చును. వాహనములు నడుపునపుడు తగు జాగ్రత్త అవసరము. స్నేహ ధర్మ కొరకు ఎవరో చేసిన పొరపాటుకు మీరు సంజాయిశి చెప్పవలసిన పరిస్థితి రావచ్చును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ బాధించ వచ్చును.

    వీరికి చాలా విషయాలలో సర్దుకుపోయే మనస్తత్వము కల్గియుండుట శ్రేయస్కరము. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వృధా ఖర్చులు చేస్తారు. ఈ విషయంలో ఒకింత జాగ్రత్త అవసరము. తమ శ్రేయోభిలాషులు, స్నేహితులు, మిమ్ములను అమితంగా ఇష్టపడే వారి యొక్క మాటలను సూచనలను పట్టినిచుకోకపోవడం ఇబ్బందికరంగా పరిణమించవచ్చును. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే అవకాశము గలదు. అవకాశము ఉన్నదని, అయూచిత ఋణము లభిస్తున్నదని అనాలోచితముగా ఋణములు చేసే అవకాశము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. నూతన పరిచయాలు ఇబ్బంది గలిగించవచ్చును. కొత్త వ్యాపారాలతో పెట్టుబడులు పెట్టునపుడు ఒకింత ఆలోచించండి. స్వయంకృతాపరాధము సంభవించవచ్చును. ప్రస్తుత తమస్థాయిని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగే అవకాశము గలదు. బాధ్యతలను విస్మరించకుండా జాగ్రత్త పడండి. మానసిక ప్రశాంతత లోపించవచ్చును. మనుజులు ఈ విధగా కూడా ఉంటారా! అని ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కారణం కొన్ని సందర్భాలలో మీ శ్రేయస్సుకోరే వారిని విస్మరించడమని తెలుసుకోవాలి. ఆస్తులు, భవనాలు మొదలైన వాటిని వృద్ధి చేసుకోవాలని ఆరాటము ఎక్కువౌతుంది. విలాసాలు, సువర్ణాభరణముపై ఆసక్తి పెరుగుతుంది. తాము అనుకున్నది సాధించడానికి కొంత వక్రమార్గ ఆచరణ కూడా చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఆస్తులు మార్పిడి చేసే అవకాశము గలదు. భూవ్యాపారాలు కొంతవరకు లభిస్తాయి. మధ్యవర్తిత్వాలు, మధ్యవర్తి వ్యాపారాలు కొంతవరకు లభిస్తాయి. ఏమి చేసి అయినా అవాంతరాలు ఎదురైనా తోటి వారిలో మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నము చేస్తారు. సఫలమవుతారు. సంప్రదాయ విషయాలపై ఆసక్తి, శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాన్ని స్వంతంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములను దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి. మీకంటూ ఒక వర్గాన్ని స్థిరపరుచుకుంటారు. నూతన భవన నిర్మాణానికి బ్యాంక్‌ ఋణాలకై ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. పేరుప్రతిష్టలకు లోపం ఉండదు. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ప్రతిష్టలకు లోటు ఉండదు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీకు విశేషంగా సహకారం లభించవచ్చును. కండరాలు, కీళ్ళనొప్పులు అవస్థలు మాత్రం భరించక తప్పదు, బిపి, షుగర్‌ వంటి వ్యాధుల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ, అజాగ్రత్త పనికిరాదు. నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు.

    స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు నమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శతృవులపై అధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంధాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి  పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్న గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలునైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో  లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో  ముఖ్యమైన అనవసరమైన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నత స్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నతన వాహనాలు సమకర్చుకుంటారు. చరాస్తులు వృద్ధి పరుచుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారం పై లేదా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాళఇకను సిద్ధం చేసి అమలు పరుస్తారు.

    శతృవులు స్తబ్ధులై ఉంటారు. సుఖ, సౌఖ్యాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జీవిత భాగస్వామితో చక్కని అనురాగ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. శయ్యాసౌఖ్యము లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసిన ప్రయోజనాలను అందుకుంటారు. రాజకీయ లబ్ధి, పరపతి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణానికై మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన ఖరీదైన జీవితము గడిపే అవకాశాలు లభిస్తాయి. నతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశము గలదు.

    ధైర్యము పెరుగుతుంది. ఇతర సంప్రదాయ, మతాంతర, కులాంతర స్త్రీ, పురుషుల స్నేహాలు ఏర్పడుట, గర్భధారణ జరిగిన స్త్రీలు ప్రసూతి వరకు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను. విషజంతు భయము. కంటి దంత సమస్యలు, దూరప్రాంత ప్రయాణాలు చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరము. మత ఛాందసవివాదాలకు దూరంగా ఉండండి. తండ్రి ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. విలువైన వస్తువులు సువర్ణాభరణములు తగు జాగ్రత్తగా దాచుకోవాలి. చోరభయము కనబడుచున్నది. భార్య తరపున బంధువులతో వివాదములు. తాంత్రిక విద్య అభ్యసించిన వారి పరిచయాలు జ్వరబాధ,దీర్ఘకాలిక వ్యాధులకు లేదా తప్పని సరి పరిస్థితులలో శస్త్రచికిత్స, అల్సరు, చర్మ బాధలు బాధించవచ్చును.

    మధ్యవర్తిత్వము చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరం. తమ సంతానాన్ని ఉన్నత విద్యలకై విదేశాలకు పంపే ప్రయత్నము సఫలమవుతుంది. కోర్టు వివాదములు మధ్యవర్తిత్వము ద్వారా పరిష్కరించుకుంటారు. మొత్తం మీద ఈ రాశివారలకు శనిబలం అనుకూలంగా ఉన్నా గురుబలం ప్రతికూలంగా ఉన్నది కనుక గురుధ్యానం మరియు రాహుకేతు గోసేవ, శ్రీరామరక్షాస్తోత్ర పారాయణం, కృష్ణాష్టకము చేసిన మేలు జరుగును. అనాధ స్త్రీలకు వివాహం కొరకు సహాయం ఆర్జించే వారికి తమకు తోచిన సహాయం చేయండి. శుభాలు పొందండి.

    సంవత్సరము యోగ  దాయకంగా ఉన్నది. జీవితంలో అనేకమైన అనుభవాలు ఉచితానుచితాలు, తాము చూసిన నమ్మిన సమస్యలు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన, పారదర్శకమైన దారి మీకు కనపడుతుంది. గతంలో కొందరి మనసును అనవసరంగా నిరాదరించామన్న విషయాన్ని తెలుసుకుంటారు. పాలు, నీళ్ళనను గ్రహిస్తారు. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా ప్రేమగా దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం అనేక స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. నతన వ్యాపారాలకై అన్వేషణ ఆరంభమవుతుంది. సమయానికై నిరీక్షిస్తారు. మీ కలలు నెరవేరుతాయి. జీవితాశయము నెరవేరే అవకాశాలు అతి చెరువలో ఉన్నాయని గ్రహించండి. మిమ్ములను ద్వేషించిన వారు మీ స్నేహానికై ఆరాటపడతారు. అదే విధంగా మీ స్నేహాన్ని కోరే వారు కూడా ఆరాటపడుతుంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భవిష్యత్‌ జీవితానికి గుణపాఠమి గుర్తించండి. ఊహలలో వివరించడం మానుకొని తమ, పర బేధము తెలుసుకునే ప్రయత్నం చేయండి. ధనము, హోదాతో స్నేహాలను, అభిమానాన్ని పొందలేమని గ్రహిస్తారు. ధనము చేతికందుతుంది. నూతన వ్యాపార భాగస్వాములను చేర్చుకుంటారు. భవిష్యత్తుకై చక్కని నిర్ణయాత్మకమైన పునాదులు వేస్తారు. నూతన పరిచయాలు వివాహప్రాప్తి, సంతానప్రాప్తి, కోరుకున్న వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్య పరిస్థితి గతముకన్నా కొంత బాగుపడుతుంది. కీళ్లు, ఎముకలు, నరములకు సంబంధించిన అవస్థతలకు వైద్యపరమైన పరిష్కారం లభిస్తుంది. నరఘోషపై ఎప్పటికప్పుడు పరిహారములు చేసుకొనుట ఉత్తమం. జీవితంలో ధనము, హోద, విలాసాలు మాత్రమే ప్రధానము కాదని గ్రహిస్తారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది.

    ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు - అశిష్ట నివృత్తికి గో సేవ చేయండి, పేద విద్యార్థులకు, అనాధ వృద్ధులకు చేయూతనివ్వండి. దేవతా ఋషిలు ఉసిరి , మామిడి వృక్షాన్ని పోశించి ఆరాధించండి. శని, రాహు, కేతు, గురుధీశ్వర్లను పఠించండి. గోవుకి నల్లనువ్వులు, శనగలు, నల్ల మినుములు ఆహారంగా ఇవ్వండి.


More Rasi Phalalu 2018 - 2019