సంతోషం ఎక్కడ ఉంది!


చాలామంది సంతోషం బయట నుంచి వస్తుందనీ, భౌతికమైన సంపదలతో ఏర్పుడుతుందనీ అనుకుంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగేట్లయితే సంపద పెరుగుతున్న కొద్దీ అది పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేనివాడి దగ్గర సంతోషం అనేదే ఉండకూడదు. కానీ నిజంగా అలా జరుగదు కదా! మనిషి ఏ సంపదనీ అనుభవించలేని... కనీసం శరీర స్పృహ కూడా లేని నిద్రావస్థలో చాలా సంతోషంగా ఉంటాడు. అలాంటి స్థితి కోసమే తనకు గాఢంగా నిద్ర పట్టాలని కోరుకుంటాడు. దీనిని బట్టి సంతోషం మనిషి అంతరంగంలోనే ఉందని తేలిపోతోంది కదా! మనల్ని మనం తెలుసుకున్న రోజున, అలాంటి స్వచ్ఛమైన సంతోషాన్ని నిరంతరం  పొందగలుగుతాము -

రమణ మహర్షి.


More Good Word Of The Day