• TOne Home
  • TV
  • News
  • Movie News
  • Videos
  • Radio
  • Telugu Movies
  • Kidsone
  • Comedy
  • Shopping
  • Bhakti
  • Greetings
  • NRI Corner
  • Romance
  • Charity
  • More...

  • Home  |
  • Stotralu  |
  • Sahasranamalu  |
  • Mangalaharathulu  |
  • Vratalu  |
  • Deity  |
  • Festivals  |
  • Temples  |
  • Audio  |
  • Video  |
  • Archives
Share
  • Home
  •  >> Bhakti Content
  •  >> Enduku-Emiti
  •  >> 
  • పుత్రద ఏకాదశికి ఏం చేయాలి!

Prev

Next

Facebook Twitter Google


 

పుత్రద ఏకాదశికి ఏం చేయాలి!

 

 

హిందూ కాలమానంలో ఒకో ఏకాదశికీ ఒకో పేరు ఉంది.  ఆ పేరు వెనుక ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా! పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్యపురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం- పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ఆయన రాజ్యంలోని వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికీ, ధాన్యానికీ ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాతైనా ఆయన కోరిక నెరవేరలేదు.

 

 

ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి ఉన్నడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే, తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమశుని వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే... రాజుగారికి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే... రాజుగారికి పుత్రసంతానం ప్రాప్తించింది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు.

 

 

పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఆ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా. ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. ఇక సంతానం ఒక లెక్కా!

ఈ శ్రావణశుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెబుతున్నారు. సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించినా, కుబేర మంత్రాన్ని జపించినా, కుబేర అష్టోత్తరాన్ని పఠించినా విశేషమైన ఫలితం దక్కుతుందట.

- నిర్జర.

 

Facebook Twitter Google

Also Read

 ఆషాఢంలో పెళ్లిళ్లు ఎ...

 చీపురుకాలికి తగిలితే...

 

చీపురుకాలికి తగిలితే దోషమా..?

Read More »

ఆషాఢంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు...

Read More »
 More Enduku-Emiti
చేతికి గాజులు వేసుకో...
భార్య భర్తకి ఎటువైపు...
మాఘమాసం విశిష్ఠత... ...
న్యూఇయర్‌లో ఇది తింట...
కోటి పుణ్యాలకు సాటి....
ఉత్తర ద్వార దర్శనం అ...
ఉదయం నిద్ర లేవగానే ఏ...
పెళ్లిలో ఎదుర్కోలు స...

More

TeluguOneServices

  • FreeMovies
  • Cinema
  • News
  • TORi-Radio
  • KidsOne
  • Comedy
  • Romance
  • Videos


  • Short Films
  • Shopping
  • Astrology
  • Bhakti
  • Greetings
  • Mypodcastone
  • Photos
  • Vanitha


  • Health
  • FresherJobs
  • Games
  • NRI Corner
  • e-Books
  • Recipes
  • Charity

CustomerService

bk-projects

LiveHelp24/7Customer Care
teluguone.teluguone@gmail.com



Send your Queries to
support@teluguone.com

Follow Us Here

Follow @theteluguone




About TeluguOne
Copyright @ 2000-2018 TeluguOne.com All Rights Reserved