ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే తులసి

Tulsi Holy Basil - Ocimum tenuiflorum

 

హిందువులకు తులసి (Holy Basil - Ocimum tenuiflorum)మొక్క పరమ పవిత్రమైంది.తులసి మొక్క లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఉదయానే లేచి తులసి మొక్కను చూస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు. అందుకే తులసి వనాన్ని పెంచుతారు. ఇంట్లో స్థలం లేనివారు కనీసం కుండీలో అయినా తులసి మొక్కను ఉంచుతారు. తులసి దళాలతో దేవుని అర్చిస్తారు. తులసివనం ముందు దీపం ఉంచి, అగరొత్తులు వెలిగించి, దానిచుట్టూ ప్రదక్షిణాలు చేసి, భక్తిగా పూజిస్తారు.

మొక్కల్లో రాణీమొక్క తులసి. ప్రకృతిలో లభ్యమయ్యే ఔషధాలకు తులసి తల్లి లాంటిది. అందుకే తులసిని ''mother medicine of nature'' అని ''the queen of herbs'' అని అంటారు. సంస్కృతంలో ''ఆయుర్వేదం'' అంటే ఆయుస్షు గురించి, జీవన ప్రమాణాల గురించి తెలుసుకోవడం. క్రీస్తుకుపూర్వం 5000 సంవత్సరాల నాడే మన దేశంలో ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఆ ఔషధాల్లో ఇతర వన మూలికలతోబాటు తులసిని విస్తారంగా ఉపయోగించేవారు. తులసి మొక్కల్లోని ఆకులు, కాండం, పూవులు - ఇలా ప్రతి భాగం ఔషధాల్లో ఉపయోగిస్తారు.తులసి దగ్గు, కఫాల వంటి సమస్యలను తులసి తక్షణం నివారిస్తుంది. దేవాలయాల్లో తీర్థంలో పచ్చ కర్పూరంతోబాటు తులసి దళాలను కూడా వేస్తారు. కారణం తులసిలో ఔషధ గుణాలతోబాటు దివ్యత్వం ఉండటమే.

తులసిమొక్కను లక్ష్మీదేవితో సమానంగా ఆరాధించడమే గాక ఉపకారానికి ప్రతీకగా తులసిని గుర్తు చేసుకుంటారు. సజ్జనుల ప్రస్తావన చేసేటప్పుడు "తులసిమొక్క లాంటి వ్యక్తి.. అందరికీ మేలు చేయడమే తెలుసు కానీ పొరపాటున కూడా కీడు తలపెట్టారు" అని చెప్తారు. అలాగే, ఒక మంచి కుటుంబంలో దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి ఉన్నట్లయితే, “తులసీవనంలో గంజాయి మొక్కలా..” అంటూ పోల్చి చెప్పడం కూడా చూస్తుంటాం.

తులసి మొక్క ముందు నిలబడి –

“దేవీం కనక సంపన్నాం కనకా భరనైర్యుతాం|

దాస్యామి విష్ణనే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా|| ”

అనే మంత్రాన్ని జపిస్తూ, ప్రార్ధన చేసినట్లయితే ఎనలేని ప్రశాంతత చేకూరుతుంది.

పొద్దున్నే స్నానాదికాలు పూర్తయ్యాక తులసిననం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ

"తులసీ శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే

నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే

యన్మూలే సర్వ తీర్ధాని యన్మధ్యే సర్వ దేవతాః

యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వాం నమామ్యహం

దేవీ పాదోదకం స్త్రీణా మాయురారోగ్య వర్ధనం "

అనే శ్లోకాన్ని జపిస్తూ, తులసిని ప్రార్ధించాలని పెద్దలు చెప్తారు.

దైవంగా పూజించే తులసిమొక్కలో (Holy Basil or sacred basil - Ocimum tenuiflorum) ఔషధ గుణాలు అనేకం ఉన్నాయి. ఆయుర్వేదంలో తలసిని విస్తారంగా ఉపయోగిస్తారు. తులసి మొక్క నుండి వచ్చే గాలిని పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అయిదు తలసి ఆకులను కడిగి తిన్నట్లయితే కఫం లాంటి అనారోగ్యాలు హరిస్తాయి. ఆఖరికి కాన్సర్ లాంటి దుర్భర రోగాలను కూడా నశింపచేసే శక్తి తులసి ఆకులకు ఉందని పరిశోధకులు రుజువు చేశారు.

 

sacred or holy basil plant, tulasi or holy basil herb used in Ayurveda, hindu traditional plant holy basil, holy basil or tulsi as goddess lakshmidevi


More Enduku-Emiti