మాఘపౌర్ణమి రోజున తప్పని సరిగా ఈ వస్తువులు దానం చెయ్యాలి!

 


మాఘపౌర్ణమి అనగానే మాఘమాసం ఎప్పుడొస్తుందో...మౌనరాగాలెన్నినాళ్ళో పాట గుర్తొస్తోందా? అదండీ మాఘమాసంలో ఉండే గొప్పదనం...ఈ మాసంతో మాఘపౌర్ణమి చాలా మంచిరోజు. ఈశ్వరుని అర్ధాంగి సతీదేవి జన్మించినరోజు. ఈరోజు సముద్రస్నానం చేస్తే చాలామంచిది అంటారు. 

 

            మాఘమాసానికి పరిపోషకుడు మాధవుడు. 
            అసలు మాధవుడు అంటే అర్ధం తెలుసా? 
            మా అంటే మహాలక్ష్మి....ధవుడు అంటే భర్త...

 

మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్ధం అని అంటారు. అందుకే శ్రీమహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. మాఘమాసంలో అన్నిరోజుల్లో స్నానం చెయ్యడానికి అవకాశం లేకపోయినా పాడ్యమి,విదియ,తదియ తిధులలో స్నానం చేసి, మళ్ళీ త్రయోదశి, చతుర్ధశి మాఘపౌర్ణమి తిధులలో కూడా స్నానం చెయ్యాలి అంటారు. ముఖ్యంగా మాఘమాసంలో పౌర్ణమి నాడు స్నానం చెయ్యాలి.

 

అరుణోదయ సమయంలో నారాయణ పాదపద్మాలను ధ్యానిస్తూ.... స్నానం చేసినవాడు...దేవతల చేత సైతం పూజింపబడతాడని అంటారు. ఈ రోజు లక్ష్మీనారాయణులను పూజించాలి. మాఘపౌర్ణమి నాడు ఈ కింద చెప్పబడిన దానాలు చేస్తే... సర్వదేవతానుగ్రహం కలుగుతుంది అంటారు. ఈరోజు చేసే దానాలు భక్తులకు ఎంతో మంచి చేస్తాయి అంటారు. బీదవారికి భోజనం పెట్టడం వల్ల మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది అంటారు. శని ప్రభావం ఉన్నవారు ఆరోజు పాదరక్షలు అంటే చెప్పులు దానం చెయ్యాలి అంటారు. గొడుగు దానం చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటారు. అమ్మవారికి కుంకుమార్చన జరిపితే సౌభాగ్యం లభిస్తుంది అంటారు. అలాగే చంద్రగ్రహ ప్రభావం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఈరోజున ఎవరికైనా వస్త్రదానం చేస్తే మీకు ఉన్న చంద్రగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి అంటారు.

 

అలాగే కుజప్రభావం ఉన్నవారు ఈరోజు ఎర్రని వస్త్రాలు దానం చెయ్యాలి అంటారు. కందిపప్పుకానీ ఎర్రపప్పుకానీ దానం చెయ్యాలి. ఈరోజు బీద విద్యార్ధులకు పుస్తకాలను పంచిపెట్టడం ద్వారా మీ ఇంటిల్లిపాదికీ కూడా చాలా మంచి జరుగుతుంది అంటారు. అలాగే చదువుకొనే పిల్లలకు విద్యాబుద్ధులు సిద్దిస్తాయి అంటారు. అలాగే ఎవరైతే రాహుకేతు దోషాలున్నాయో అలాంటి వారు తేనెను ఖర్జూరాన్ని దానం చెయ్యాలి అంటారు. ఇలా మాఘపౌర్ణమి రోజు సతీదేవి పూజ చేసుకొని....  అమ్మదీవెనలు తీసుకుంటారని ఆశిస్తూ... ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.

- కుల శేఖర్


More Bhakti Content