శ్రీ అనంతాళ్వార్ ?

 

 

brief history of lord venkateshwara sri Ananthalwar temple crowbar hanging in main temple and yellow karpur to venkateswara

 

 

శ్రీవారి కైంకర్యం లో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్. శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద  శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు. ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు. తిరుమల లో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామి వారికి సమర్పించేవారు. అనంతాళ్వారులు  తిరుమలలో పూల తోటకి నీళ్ళ కోసం బావి తవ్వటానికి భార్యని సహకారం తీసుకొన్నారు. అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టితట్టని తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వారులు కు సహాయం చెయ్యటానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి, అనంతాళ్వార్ ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు  అంగీకరించలేదు. బాలుడు అనంతాళ్వారులు భార్య కి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టితట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసివచ్చేవాడు. భార్య తొందర తొందరగా మట్టిని తట్టలు తీసుకొనివెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు, భార్య  అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.

 

 

brief history of lord venkateshwara sri Ananthalwar temple crowbar hanging in main temple and yellow karpur to venkateswara

 

 


ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో, చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి  తగులుతుంది. ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే, అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. సాయంత్రం చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం  చూసిని అనంతాళ్వారులు, అయ్యో ...  నేను గునపం విసిరింది ఎవరిమీదకో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చెయ్యటానికి వచ్చాడని గ్రహిస్తాడు. స్వామివారి గడ్డం పై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుంచి  స్వామివారి గడ్డం పై రోజూ  పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికీ మనం అనంతాళ్వారులు స్వామివారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళడుతూ ఉండటం చూడవచ్చు. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి  ఆలయం వెనకవైపు ఉంటుంది. మనం  అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి  ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి  శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు


More Venkateswara Swamy