క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేస్తారు? 

 

కార్తీకమాసంలో వచ్చే పవిత్రమైన దినాల్లో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. ఈ రోజంటే శ్రీమహావిష్ణువుకి బహుప్రీతి. ఆయన దేవతలందరితో కలిసి తులసిలో కొలువయ్యే పరమపవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. ఉసిరి చెట్టులో కూడా ఈ రోజు విష్ణువు కొలువై ఉంటాడని వేదాలు చెబుతున్నాయ్.

అందుకే.. క్షీరాబ్ది ద్వాదశి రోజున.. తులసి కోటలో ఉసిరి మొక్కను కూడా ఉంచి.. శంఖ, చక్రాలు, పద్మపాదాలతో కూడి ముగ్గుని వేసి, మహావిష్ణువు ప్రతిమను కానీ.. లేక శ్రీకృష్ణ ప్రతిమను కానీ పెట్టి శోడశోపచారాలతో పూజించాలి. దీన్నే క్షీరాబ్ది శయన వ్రతం అంటారు. జన్మజన్మల పాపం హరింపజేయడమే కాక, అష్టైశ్వర్యాలను ప్రసాదించే గొప్ప వ్రతం ఇది. ఈ సారి ‘క్షీరాబ్ది ద్వాదశి’పర్వదినం నవంబర్ 1న వచ్చింది. ఆ రోజుకు సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.

 

 


More Karthikamasa Vaibhavam