ప్రత్యుపకారం వద్దు

 

 

మదంగే జీర్ణతాం యాతు యత్‌ త్వయోపకృతం కపే

నరః ప్రత్యుపకారాణా మాపత్స్యాయాతి పాత్రతామ్‌॥


అవతలివారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలన్న ఆలోచన మంచిదే! కానీ అలా ప్రత్యుపకారం చేసే అవకాశం రాకపోవడమే మంచిదంటున్నాడు కవి. ఎందుకంటే! అవతలి వ్యక్తికి ఆపద వస్తేనే కదా... ఉపకారం చేయాల్సిన అవసరం వచ్చేది. కాబట్టి మనకి ఉపకారం చేసినవాడు చల్లగా ఎలాంటి ఆపదలూ రాకుండా, అసలు ప్రత్యుపకారం చేయించుకోవాల్సిన పరిస్థితే రాకుండా ఉండాలని కోరుకోవాలట!

 


More Good Word Of The Day