మనసనే వేదిక స్వచ్ఛంగా ఉండాలి

 

అహంకారం బలం దర్పం
కామం క్రోధం పరిగ్రహమ్ ।
విముచ్య నిర్మమః శాంతో
బ్రహ్మభూయాయ కల్పతే ॥

నానారకాల వికారాలు నిండిన మనసుతో పరమాత్మను ప్రసన్నం చేసుకోవడం దుర్లభం కదా! అందుకనే అహంకారాన్నీ, మదాన్నీ, దర్పాన్నీ, కోరికనీ, కోపాన్నీ పరిత్యజించి... ఎలాంటి మమకారమూ లేకుండా, ప్రశాంతమైన చిత్తంతో ఉండేవాడు పరబ్రహ్మను తనలో నిలుపుకొనేందుకు తగిన వేదికను సమకూర్చుకున్నవాడై ఉంటాడు అని గీతాకారుడు చెబుతున్నాడు.


More Good Word Of The Day