డబ్బు వచ్చే రాత ఉంటే!

 

 

సిరి తా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్‌,

సిరి తా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!

సంపద ఎప్పుడు ఎలా వస్తుందో, తిరిగి ఎలా మాయమైపోతుందో ఊహించడం అసాధ్యం. సిరి వచ్చే రాతే ఉంటే కొబ్బరికాయలోని నీటిలాగా అనూహ్యంగా వచ్చి చేరుతుంది. అదే పోవాల్సి ఉంటే... ఎంతటి సంపద అయినా ఏనుగు మింగిన వెలగపండులాగా గుటుక్కున మాయమైపోతుంది.


More Good Word Of The Day