ఎన్ని విద్యలు నేర్చినా
ఏల సమస్తవిద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు ననేక మార్గములసన్నుతి కెక్క నదెట్లొకో యనన్
ఱాలకు నేడ విద్యలు? తిరంబగు దేవత రూప చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీద భాస్కరా!
రాళ్లకు ఎలాంటి జ్ఞానమూ ఉండదు. కానీ అవి దేవతావిగ్రహాలుగా మారినప్పుడు, ప్రజలంతా ఆ ప్రతిమలను పూజిస్తుంటారు. అది కేవలం వాటి అదృష్టమే కదా! అలాగే ఎన్ని విద్యలు నేర్చినా కూడా అదృష్టం కూడా కొంత కలసి రావాలి.
...Nirjara