కాస్త ముందే!

 

 

మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్

దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా

ధన మొనరింపగావలయు దత్త్వవిచారము మానియుండుట

ల్తనువునకు విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!

 

మనసులో విచక్షణ చేసే స్థితి దాటిపోక ముందే, కఫాదిరోగాలతో శరీరపు బిగి సడలక ముందే... మానవుడు మోక్షసాధనాన్ని సాగించాలి. తత్వవిచారాన్ని మానుకుని మనుగడ సాగించడం అంటే... తనువుకి వ్యతిరేకంగా ప్రవర్తించడమే! అంటే సమయం మించిపోకముందే, జవసత్వాలు ఉన్నప్పుడే ఆధ్మాత్మిక మార్గంలోకి ప్రవేశించమనీ... లేకపోతే జీవితం నిరుపయోగమనీ కవి భావన.

 

..Nirjara


More Good Word Of The Day