యద్భావం తద్భవతి

 

 

ప్రార్థనముల, పుణ్యతీర్థంబులందున,

గురులయందు, వైద్య వరులయందు,

భావమెట్టి దట్టి ఫలితంబు ప్రాప్తించు,

లలితసుగుణజాల! తెలుగుబాల!!

 

ప్రార్థనలు చేసినా, తీర్థాలలో మునిగినా, గురుల ఉపదేశాలను గ్రహిస్తున్నా, వైద్యుల సూచనలను పాటిస్తున్నా... మన మనసులో ఎలాంటి భావం ఉంటుందో, దానికి అనుగుణంగానే ఫలితాలను పొందుతాము. మనసున అపనమ్మకం, చెడు తలంపులు ఉంటే పైన పేర్కొన్నవేవీ ఉపయోగపడవు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం ఉంటే ప్రతిదీ మనకు అనుకూలంగానే పరిణమిస్తుంది. యద్భావం తద్భవతి అని పెద్దలు ఊరికనే అనలేదు కదా!

 

..Nirjara


More Good Word Of The Day