ఊరికనే ఉన్నా కూడా

 

 

ఊరక సజ్జనుం డొదిగియుండిననైన దురాత్మకుండు ని

ష్కారణ మోర్వలేక యపకారముచేయుట వాని విద్యగా

చీరలు నూఱుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ

జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!

 

మంచివాడు తన మానాన తాను ఉన్నా కూడా ఓర్వలేని దుష్టులు వానికి ఏదో ఒక హానిని తలపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఎంతో ఖరీదైన చీరెలని పెట్టెలో భద్రంగా ఉంచితే, చిమ్మెట పురుగు ఉత్తపుణ్యానికే వాటిని కొరికిపారేస్తుంది కదా! అలాగే చెడ్డవాడు కూడా తన సహజస్వభావం చేత ఇతరులకు ఏదో ఒక హాని కలిగించి తృప్తి పడుతుంటారట.

 

..Nirjara


More Good Word Of The Day