గుమ్మం పైన ఈ పటాన్ని పెట్టుకుంటే ఇంతే సంగతి!

 

ఇంటి ప్రధాన ద్వారం పైన చాలామంది... దేవుని పటాలు పెడుతుంటారు. కొందరైతే.. బారుగా చెక్క కొట్టేసి... వరుసగా దేవుళ్ల పటాలు పెట్టేస్తారు. అసలు అలా పెట్టుకోవచ్చా? ముఖ్యంగా ప్రధాన ద్వారం పైన దేవుని పటం ఉండవచ్చా? అనడిగితే... ఉండకూడదు అనే చెప్పాలి. ఇలాంటివి చేయడం వల్ల పేదరికం సంప్రాప్తిస్తుంది. కేవలం ప్రధాన ద్వారం పైనే కాదు. ఏ ద్వారం పైనా దేవుని పటాలు ఉండకూడదు. అలాగే చనిపోయిన పెద్దల పటాలు కూడా ముఖ ద్వారంపై పెట్టకూడదు. ఒక్క షిర్డీ సాయినాధుని పటం మాత్రం ఎక్కడైనా... ఏ ద్వారం పైన అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన యోగిరాజ పరబ్రహ్మ. సాయికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉండవ్. ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని క్లిక్ చేయండి.

 


More Vastu