పన్నులు ఎలా ఉండాలంటే!

 

 

 

అదను దలంచి కూర్చిప్రజ నాదర మొప్పవిభుండు కోరినన్

గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టితెండనన్

మొదటికి మోసమౌబొదుగు మూలము గోసిన బాలు గల్గునే

పిదికినఁగాక భూమిఁబశు బృందము నెవ్వరికైన భాస్కరా!

 

ఆవు నుంచి పాలు పితుక్కోవాలంటే అదను చూసుకోవాలి. అత్యాశ కూడదు. అలా కాకుండా నిరంతరం పాలు వస్తాయనే భ్రమతో పొదుగునే కోసి పారేస్తే ఎలా! రాజు ప్రవర్తన కూడా ఇలాగే ఉండాలి. వీలు చూసుకుని ప్రజల నుంచి డబ్బుని ఆశించాలే కానీ, ధనం కోసం దాష్టీకానికి పాల్పడితే అసలుకే మోసం రాక తప్పదు. ఆనాటి రాజులైనా, ఈనాటి రాజకీయనేతలైనా ఇదే నీతి వర్తిస్తుంది.

 

..Nirjara


More Good Word Of The Day