ఇంద్రియాలన్నీ నీ కొరకే

 

 

కరములు మీకు మ్రొక్కులిడఁ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ

స్మరణఁ దనర్ప వీనులు భవత్కథలన్‌ వినుచుండ నాస మీ

యఱుతనుబెట్టు పూసరుల కాసగొనం బరమార్థ సాధనో

త్కరమిది చేయవే కృపను దాశరథీ! కరుణాపయోనిధీ!కరుణాసముద్రుడవైన ఓ రామయ తండ్రీ! పరమార్థ సాధన కోసం నిన్ను కొలుచుకునేందుకు నా ఇంద్రియాలన్నీ సాధకములే. చేతులు (స్పర్శ) నీకు మొక్కేందుకు, కన్నులు నిన్ను దర్శించుకునేందుకు, నాలుకతో నీ నామ స్మరణ గావించేందుకు, చెవులతో నీ మహిమలను వినేందుకు, నాసికతో నీ మెడలోని పూదండని ఆఘ్రానించేందుకు వినియోగింపాలి.


More Good Word Of The Day